తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న స‌భ‌ను ర‌ద్దు చేశారు. మ‌రో తొమ్మిది నెల‌ల పాటు ప్ర‌జ‌ల‌ను పాలించే అవ‌కాశం ఉన్నప్ప‌టి కీ.. ఆయ‌న అర్ధంతరంగా ప్ర‌భుత్వాన్నిర‌ద్దు చేసి ఎన్నిక‌ల‌కు సై! అన్నారు. అయితే, ఈ క్ర‌మంలో కేసీఆర్ అనుస‌రించిన వైఖ‌రి.. రాబోయే రోజుల‌కు సంబంధించి ఆయ‌న ప్ర‌క‌టించిన షెడ్యూల్ పై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు కౌంట‌ర్లు విసు రుతున్నారు.  తాజా ప‌రిణామాల‌ను చూస్తే.. కేసీఆర్‌కు ఒకింత సెంటిమెంట్ ఉన్న‌ద‌నే విష‌యం ఆయ‌న అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి తెలిసిందే. తెలంగాణ ఉద్య‌మం చేసే స‌మ‌యంలో తెలంగాణ వ‌స్తే.. తిరుప‌తి వెంక‌న్న‌కు కానుక‌లు ఇస్తాన‌ని మొక్కుకున్నారు. బెజ‌వాడ దుర్గ‌మ్మ‌కు కూడా ప‌ట్టుచీర స‌హా న‌గ‌లు ఇస్తాన‌ని మొక్కుకున్నారు. 


ఇక‌, హైద‌రాబాద్‌లోని జూబ్లీ హిల్స్ పెద్ద‌మ‌కు, వ‌రంగ‌ల్ జిల్లాలోని భ‌ద్ర‌కాళి అమ్మ‌వారికి కూడా ప‌లు మొక్కులు మొక్కు కున్నారు. తెలంగాణ రావ‌డం, కేసీఆర్ అధికారం చేప‌ట్ట‌డం తెలిసిందే. ఆ త‌ర్వాత విడ‌త‌ల వారీగా ఆయ‌న ఈ మొక్కు లు తీర్చుకోవ‌డంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ప్ర‌భుత్వ ప‌ద‌వుల్లో ఉండి ఇదేం ప‌ద్ధ‌త‌ని విమ‌ర్శించిన వారు ఉన్నారు. అయినా కేసీఆర్ లెక్క‌చేయ‌లేదు. ఇక‌, ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్ హౌస్‌లో సీఎం హోదాలోనే ఉండి రాష్ట్ర అభ్యున్న‌తి, ప్ర‌భుత్వ సుస్థిర‌త కోసం అంటూ దాదాపు 50 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేసి శ‌త చండీ యాగం చేయించారు. అప్పుడు కూడా ఆయ‌న సెంటిమెంట్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. 

Image result for telangana

ఇక‌, ఇప్పుడు ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసే స‌మ‌యంలోనూ ఆయ‌న ముహూర్తాల‌కు సెంటిమెంటుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. శ్రావణ మాసం, గురువారం మధ్యాహ్నం.. ద్వాదశి ఘడియలు, పుష్యమి నక్షత్రం ప్రవేశించిన తర్వాత గురుపుష్య యోగంలో.. గురుహోరలో... తెలంగాణ శాసనసభ రద్దుకు తీర్మానం చేశారు. దీనికిగాను ఆయ‌న ఏపీలోని తూర్పు గోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి, వ‌రంగ‌ల్‌, తిరుప‌తిల నుంచి వేద పండితుల‌ను హైద‌రాబాద్‌కు నెల కింద‌టే ఆహ్వానించార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. వారు చెప్పిన ప్ర‌కారం,వారు నిర్ణయించిన స‌మ‌యం ప్ర‌కార‌మే ర‌ద్దు నిర్ణ‌యం వెల్ల‌డించార‌ని క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఇక‌, మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ప్రారంభ‌మైన ద్వాద‌శి ఘ‌డియ‌లోనే ఆయ‌న కేబినెట్ భేటీ జ‌రిగింది.  


ఆ త‌ర్వాత రెండు నిముషాల‌కు అంటే 1.02 నిముషాల‌కు ర‌ద్దు సిఫార‌సుకు ఒకే చెప్పారు. 1.15కు రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లారు. 1.25కు గ‌వ‌ర్న‌ర్‌తో భేటీ అయ్యారు. ఇలా ప్ర‌తి నిముషంలోనూ వేద‌పండితులు చెప్పిన‌ట్టే న‌డుచుకున్నారు. ఇక‌, మీడియాతో మాట్లాడుతూ కూడా త‌న సెంటిమెంటును కేసీఆర్ వివ‌రించారు. ఈ నెల 9న అమావాస్య ఉంద‌ని, అందుకే తాము రెండు రోజుల ముంద ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని కేసీఆర్ పేర్కొన్నారు. రేపు శ్రావ‌ణ శుక్ర‌వారం కావ‌డంతో, మంచిద‌ని పెద్ద‌లు చెప్ప‌డంతో హుస్నాబాద్‌లో తాను ప్ర‌చారం ప్రారంభిస్తున్నాన‌ని కూడా వెల్ల‌డించ‌డంపై నెటిజ‌న్లు స‌టైర్లు వేస్తున్నారు. ప్ర‌భుత్వంలో ఉండి .. ఇలా ముహూర్తాలు.. ముల‌క్కాయ‌లు అంటున్న సీఎం దేశంలో ఈయ‌నొక్క‌డే అంటూ నోరు నొక్కుకుంటున్నారు నెటిజ‌న్లు!! 



మరింత సమాచారం తెలుసుకోండి: