భారత రాజకీయాల్లో కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రి అయిన విధం అనేక చిన్న చితక పార్టీలకు అధికారంలోకి వచ్చి తాము ముఖ్యమంత్రులం కావాలన్న తపనను రగిల్చింది. కాంగ్రెస్ బాజపాను అధికారంలోకి రానివ్వకుడదన్న దుగ్ధ, పరిపాలనలోకి రాలేని అసమర్ధత జెడిఎస్ కుమారస్వామిని ముఖ్యమంత్రి చేసిన సాంప్రదాయం - కర్ణాటక ప్రజాభిప్రాయానికి వ్యతిరేఖంగా మైనారిటీ ప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. అదే దుష్ట సాంప్రదాయం 2018 ముందస్తు ఎన్నికల అనంతరం తెలంగాణాలో కూడా ఏర్పడవచ్చు.  
MIM akbaruddeen comments MIM to become CM in 2018 కోసం చిత్ర ఫలితం
"ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సరిపడా మెజారిటీ లేకున్నా హెచ్ డి  కుమారస్వామి కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. మన మెందుకు ముఖ్యమంత్రి కాలేం?" అంటూ మజ్లిస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
akbaruddin Telangana CM? కోసం చిత్ర ఫలితంహైదరాబాద్‌ లోని మల్లేపల్లిలో నిన్న శుక్రవారం ఎమైఎం కార్యకర్తల సమావేశంలో ఆయన పైవిధంగా మాట్లాడారు. నవంబరులో ఎన్నికలొస్తున్నాయ్‌, డిసెంబరులో మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని కేసీఆర్‌ చెప్పిన నేపధ్యంలో, నవంబరులో జరిగే ఎన్నికల్లో మనమూ గెలుద్దాం, డిసెంబరులో కేసీఆర్‌ ను అడుగుదాం, మన రక్షణ ఎవరు చూస్తారని? డిసెంబరులో ఫలితాలు వచ్చాక ఎవరి అవసరాలు ఎలా వస్తాయో? అప్పటికి తెలుస్తుందని అక్బరుద్ధీన్ ఒవైసీ అన్నారు. 
MIM akbaruddeen comments MIM to become CM in 2018 కోసం చిత్ర ఫలితం
శాసనసభలో 36 సీట్లు మాత్రమే గెలిచి - అవసరాలు అలా తన్నుకురాగా ఎగిరి వచ్చి జెడిఎస్ నేత కుమారస్వామి సీఎం సీట్లో కూర్చున్న్ అట్లే "ఇన్షా అల్లా! (అల్లా దయ వల్ల) మనమూ ముఖ్యమంత్రి అవుతామేమో? చూద్దామని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. రాజకీయం అంటే మన ఇంటి పని మనిషి అని సాలార్‌ (సలావుద్దీన్‌ ఒవైసీ) చెప్పేవారు. ప్రతి ఇంటికీ ఒక కమాండర్‌ ఉన్నా, అమీర్‌ ఒక్కడే ఉంటాడని" అక్బరుద్దీన్‌ వ్యాఖ్యానించారు.
MIM akbaruddeen comments MIM to become CM in 2018 కోసం చిత్ర ఫలితం
ఈ వ్యాఖ్యలు పరిశీలిస్తే టిఆరెస్ కు ఓటేస్గ్తే ఎమైఎం పార్టీ నుంచి అకబరుద్ధీన్ ఒవైసీ ముఖ్యమంత్రి అవుతారని చ్రెప్పవచ్చు. ఎలా అంటే 222 శాసనసభ స్థానాలున్న కర్ణాటక శాసనసభలో 104 శాసనసభ స్థానాలు గెలిచిన బాజపాను కాదని 78 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ 38 స్థానాలు మాత్రమే సాధించిన జెడిఎస్ కాళ్ళుకడిగి ఆ నీళ్ళు నెత్తిపై జల్లుకొని మరీ కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేసిన విషయం - ఇప్పుడు 2018-19 ఎన్నికల్లో నేటి కర్ణాటక కాంగ్రెస్ పరిస్థితి టిఆరెస్ కు వస్తుందని అప్పుడు తాము ముఖ్యమంత్రి పీఠం ఎక్కొచ్చనేది ఆయన అభిప్రాయం.   

MIM akbaruddeen comments MIM to become CM in 2018 కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: