ఏపీ సీఎం, అప‌ర చాణిక్యుడు చంద్ర‌బాబు వేసిన మంత్రం భారీ ఎత్తున పారింది! ప్ర‌తి విష‌యంలోనూ త‌న‌కంటూ ఏదైనా ప్ర‌త్యేక లాభం ఉందో లేదో చూసుకుని అడుగులు వేసే చంద్ర‌బాబు.. ఇప్పుడు కూడా తాజా నిర్ణ‌యం ఆ దిశ‌గానే తీసుకున్నారు. ప్ర‌జల న‌డ్డి విరుస్తున్న పెట్రోలు, డీజీల్‌పై బాబు క‌న్నీరు కార్చారు. ఈ క్ర‌మంలోనే రూ.2 త‌గ్గించేస్తున్న‌ట్టు అసెం బ్లీలో ప్ర‌క‌టించి పెద్ద ఎత్తున సింప‌తీని సొంతం చేసుకున్నారు. విష‌యంలోకి వెళ్తే.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో అద‌న‌పు వ్యాట్ ఉంది. అంటే.. ప్ర‌స్తుతం రాష్ట్రాలు అన్నీ కూడా వ్యాట్‌ను వ‌సూలు చేస్తున్నాయి. ఇది మ‌న రాష్ట్రంలో 31%(అంటే వంద‌కు 31 రూపాయ‌లు)గా ఉంది. దీనికి అద‌నంగా.. ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రానికి చేయూత నందించే ప‌న్నును బాబు ప్ర‌వేశ పెట్టారు.


2015లో ప్రారంభించిన ఈ బాదుడు ఖ‌రీదు లీట‌రుకు రూ.4. అంటే వ్యాట్‌+అద‌న‌పు వ్యాట్‌. ఫ‌లితంగా ప్ర‌జ‌లు ప్ర‌తి లీట రు డీజిల్‌, పెట్రోల్‌పై అద‌నంగా దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రూ.4 చెల్లిస్తున్నారు. ఇప్పుడు చంద్ర‌బాబు గారు ఏపీ ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను చూసి త‌ట్టుకోలేక అత్యంత కీల‌క నిర్ణ‌యంగా ఈ అద‌న‌పు బాదుడులో రూ.2 త‌గ్గించారు. అయితే, ఇక్క‌డ ష‌రా ఏంటంటే.. కేంద్రం రేపో మాపో ఏమైనా పెట్రో ధ‌ర‌లు త‌గ్గిస్తే.. వెంట‌నే దీనిని అమ‌ల్లోకి తెచ్చేస్తారు! అంటే ఇది నామ్‌కే వాస్తే.. త‌గ్గుద‌ల అన్న‌మాట‌! కానీ, దీనికే చంద్ర‌బాబు అండ్ అనుకూల మీడియా పెద్ద ఎత్తున ఏపీ ప్ర‌జ‌ల‌కు ఏదో చేసిన‌ట్టుగాప్ర‌చారం గుప్పించేసుకుంటున్నాయి. 


కానీ, వాస్త‌వానికి రాజస్థాన్ ప‌రిస్థితి చూస్తే.. బీజేపీ పాలిత రాష్ట్ర‌మే అయినా(ఈ ఏడాది ఇక్క‌డ ఎన్నిక‌లు ఉన్నాయి) అక్క‌డ ఎలాంటి అద‌న‌పు వ్యాట్‌లు లేవు. అయినా కూడా విధిస్తున్న ప‌న్నులోనే రూ.2.50 త‌గ్గించారు అక్క‌డి సీఎం వ‌సుంధ‌రా రాజే. చాలా విష‌యాన్ని వసుంధ‌ర రాజేను స్పూర్తిగా తీసుకునే చంద్ర‌బాబు ఈ మాత్రం కూడా త‌గ్గించ‌క‌పోగా.. కొద్దిగా త‌గ్గించి గొప్ప‌గా డ‌ప్పు కొట్టుకొంటున్నార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పోనీ ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రం కాబ‌ట్టి వ‌సూలు చేసిన అద‌న‌పు వ్యాట్ ప‌రిస్థితి ఏంటి?  ఇన్నాళ్ల‌లో రూ.ల‌క్ష కోట్లు అయినా అయిఉండాల‌ని అంటున్నారు. మ‌రి ఈ సొమ్ముకు లెక్క‌లు చెప్ప‌డం లేదు.

ఈ క్ర‌మంలో అస‌లు ఏం జ‌రుగుతోందో కూడా తెలియని ప‌రిస్థితి నెల‌కొంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా ల‌బ్ధి పొందాల‌నే ల‌క్ష్యంతోనే చంద్ర‌బాబు ఇప్పుడు ఇలాంటి చిన్న నిర్ణ‌యం తీసుకుని పెద్ద లాభం పొందాల‌ని భావిస్తున్నార‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి దీనిని గ‌మ‌నించిన వాళ్లు.. బాబు తీసుకున్న నిర్ణ‌యం అదిరంద‌య్యా!! అన‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: