దేశంలోనే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు పేరుంది. భద్రంగా గమ్యం చేర్చే అతి ముఖ్య  ప్రజా రవాణా సంస్థగా చెబుతారు. మరి అదే ఆర్టీసీ బతుకులను మింగేస్తే ఏమవుతుంది. దేశంలో విశేష సేవలు అందిస్తున్న ప్రభుత్వ సంస్థే ఇపుడు మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ రోజు జరిగిన కొండగట్టు రోడ్డు ప్రమాదం ఆర్టీసీ చరిత్రలోనే అతి పెద్దదట. పెద్ద ఎత్తున మృతులు కూడా ఈ దుర్ఘటనలో ఛోటుఛేసుకోవడం తీరని విషాదమే.


అంతకంతకు పెరుగుతున్నారు.  :


అతి దారుణమైన ఈ రోడ్డు ప్రమాదంలో మృతులు అంతకంతకు పెరుగుతున్న్నారు. మొదట పది, ఇరవై అంటూ మొదలైన సంఖ్య ఇపుడు యాభై దాటేసింది. వస్తున్న రిపోర్ట్ల ప్రకారం చూసుకుంటే మరిన్ని మరణాలు నమోదు అయ్యేలా కనిపిస్తోంది.  మృతుల్లో ఎక్కువగా 25 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉండడం కలచివేస్తోంది. నిజానికి బస్సు హేవీ లోడ్ తో వెళ్తోందని ప్రాధమిక సమాచారం.


నిర్లక్ష్యమే కారణం :


డ్రైవర్ నిర్లక్ష్యం  పెను ప్రమాదానికి కారణం అయిందని ఆర్టీసీ అధికారుల నివేదిక చెబుతోంది. ఇక బస్సు కెపాసిటీకి మించి ఎనభై మందికి పైగా తీసుకుని అతి వేగంతో వెళ్ళడం కూడా దుర్ఘటనకు కారణం అంటున్నారు. . కేవలం 30 నుంచి 40 మంది మాత్రమే ప్రయాణించడానికి అనువైన బస్సులో కాసులకు కక్కుర్తి పడి 80మందిని ఎక్కించినట్లు తెలిసింది. ఘాట్ మలుపులు చూసుకోకుండా వేగంగా పోనీయడంతో బొల్తా కొట్టిందని చెబుతున్నారు. బస్సు కూడా ఏ మాత్రం కండీషన్‌లో లేనిదని విజువల్స్‌ను చూస్తే స్పష్టంగా కనిపిస్తోందిప్రమాద సమయంలో బస్సు ఒక పక్కకు ఒరిగిపోవడంతో అందరూ ఒకరిపై ఒకరు పడి ఊపిరి ఆడక పిల్లలు, మహిళలు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: