జగిత్యాల జిల్లాల్లోని కొండగట్టులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.   ఇప్పటి వరకు ఇలాంటి దారుణమైన  ప్రమాదం ఎప్పుడూ సంబవించలేదని స్థానికులు అంటున్నారు. ఆర్టీసీ చరిత్రలోనే ఇది ఘోర ప్రమాదం అంటున్నారు.   ఈ  ప్రమాదంలో మృతుల సంఖ్య మొదట 20 అనుకున్నా..ప్రస్తుతం 52 చేరుకుంది.   కొండగట్టు నుంచి కిందకు దిగుతున్న బస్సు అదుపు తప్పి లోయలోకి జారిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బస్సులో 80 మంది ఉన్నట్లు అనుమానం. ప్రమాదానిక కారణం..డౌన్ కావడంతో న్యూటల్ గేరు వేసుకొని రావడంతో..అదుపు తప్పి లోయలోకి వెళ్లినట్లు తెలుస్తుంది.
Image result for jagityala rtc bus accident
ఈ ప్రమాద ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ప్రమాదంలో గాయపడ్డ వారందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అలాగే రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి మృతుల కుటుంబాలకు ఆర్టీసీ తరఫున రూ.3 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని చెప్పారు.
Image result for jagityala rtc bus accident
క్షతగాత్రులకు మరింత మెరుగైన చికిత్స అందించేందుకు జగిత్యాల, కరీంనగర్ తో పాటు హైదరాబాద్ లోని ఆసుపత్రులకు తరలించారు.  ప్రమాదం గురించి తెలుసుకున్న తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సంతాపం తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: