Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jan 21, 2019 | Last Updated 4:44 am IST

Menu &Sections

Search

రగులుతున్న తెలంగాణా! పగతీర్చుకుంటాం! కాంగ్రెస్ శపథం - హరీష్ గుజరాతీ స్త్రీని భార్యగా...?

రగులుతున్న తెలంగాణా! పగతీర్చుకుంటాం! కాంగ్రెస్ శపథం - హరీష్ గుజరాతీ స్త్రీని భార్యగా...?
రగులుతున్న తెలంగాణా! పగతీర్చుకుంటాం! కాంగ్రెస్ శపథం - హరీష్ గుజరాతీ స్త్రీని భార్యగా...?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ముందస్తు ఎన్నికల పేరుతో తెలంగాణా రాజకీయాలు ముదురుతున్నాయి. కేసిఆర్ తన రాజకీయాలని, ఆర్ధికాన్ని, అధికారాన్ని కేంద్ర సహకారాన్ని చతురంగ బలాలుగా ముందస్తు ఎన్నికల కురుక్షేత్రంలో మొహరించారు. రాజ్యాంగ వ్యవస్థలని విచ్చలవిడిగా తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ ప్రయోజనాలకే వాడేస్తున్నారంటూ కాంగ్రెస్ ఇప్పటికే గవర్నర్ కు పిర్యాదు చేసింది. అంతేకాదు యుద్ధానికి ఆజ్యంపోస్తూ నాడు కురుసభలో పాండవులు చేసిన శపథాలను తలపించేలా కాంగ్రెస్ నాయకులు శపథాలు చేశారు. ఇదంతా రానున్న కురుక్షేత్రానికి నాంది ప్రస్థావన చేసినట్లుంది. 
telangana-news-early-poll-news-aggrieved-congress-
ముందస్తు ఎన్నికలతో తెలంగాణ రాజకీయాలు ఊహాతీతమైన మలుపులతో ఏవరూ ఊహించని విధంగా సెగలు క్రక్కుతున్నాయి. అధికార ప్రతిపక్షాలు - ఒకరిని మించి మరొకరు వేస్తున్న ఎట్టుకు పై ఎత్తులతో తెలంగాణ రాజకీయాలు మరింతగా దిగజారి – దినానికో “హాట్ హాట్ ఆప్ డేట్ ను మరీ హాట్ హాట్ గా తయారౌతున్నాయి.

telangana-news-early-poll-news-aggrieved-congress-

*నకిలీ పాస్ పోర్ట్ కేసులో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అరెస్ట్ 

*తుపాకీనే లేని గండ్ర వెంకటరమణారెడ్డిపై తుపాకీతో బెదిరించారని కేసు పెట్టారు.

*జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో అక్రమాల కేసులో  మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కి జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేయడం సంచలనం సృష్టించింది. 
telangana-news-early-poll-news-aggrieved-congress-
కాగా తనపై నమోదైన సొసైటీలో అక్రమాల కేసుపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్లు చేశారు. తనపై రాజకీయ కక్షతోనే జూబ్లీహిల్స్ హౌజింగ్ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ రాజకీయవేట నాతోనే మొదలు పెట్టారు. నన్ను అరెస్ట్ చేయమనుండి,కేసులు పెట్టుకోమనండి నేను చూస్తా! ఏం జరుగుతుందో, తలబొప్పి కట్టేలా కేసీఆర్ కు తెలుస్తుంది అని వ్యాఖ్యానించారు.


కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి శపథం:
telangana-news-early-poll-news-aggrieved-congress-
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీఆర్ ఎస్ అధినేత - ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆయన కుటుంబ సభ్యులపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ కుటుంబ సభ్యులే నకిలీ పాస్ పోర్ట్ - వీసాల దందా లో చిక్కుకున్నారని ఆరోపించారు. 


కేసీఆర్ మంత్రిగా ఉన్నప్పుడే హరీష్ రావు ఒక గుజరాత్ మహిళను తన భార్యగా అమెరికాకు పంపించారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో ప్రస్తుత బోధన్ ఎమ్మెల్యే షకీల్ కూడా ఉన్నారని రేవంత్ ఆరోపించారు. మహేందర్ రెడ్డికి డీజీపీ పోస్ట్ ఇచ్చినందుకు, ఈ కేసులో నుండి కేసీఆర్ - హరీష్ రావు ఈ మద్యే పేర్లను తప్పించారు 
telangana-news-early-poll-news-aggrieved-congress-
“మనుషుల అక్రమ రవాణా కేసు” లో కేసీఆర్ - హరీష్ రావుల పై విచారణ జరగాలి. కేసీఆర్ - హరీష్ రావులే ఈ కేసులో ఉన్నారే తప్ప జగ్గారెడ్డికి అసలు సంబంధమే లేదు. కేసీఆర్ సీఎం అయ్యాక ఛార్జ్ షీట్లో కేసీఆర్ - హరీష్ పేర్లను తప్పించారు. కేసీఆర్ కు లొంగనందుకే జగ్గారెడ్డిపై కేసులు బనాయించారు. అంటూ మండిపడ్డారు. 


ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పోలీసులతో కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేయిస్తున్నారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. మమ్మల్ని కేసులతో వేధించేందుకు కేసీఆర్ తన సామాజిక వర్గానికి చెందిన పొలిసు అధికారులను నియమించారు. మమ్మల్ని వేధిస్తున్న అధికారుల పేర్లను కాంగ్రెస్ డైరీలో రాసుకుంటున్నాం. మేం అధికారంలోకి వచ్చాక ఆ అధికారులకు వడ్డీతో సహా చెల్లిస్తాం. లెక్కపెట్టి మరీ రివెంజ్ తీసుకుంటాం. పోలీసులారా! కేసీఆర్ కుటుంబానికి ప్రయివేట్ సైన్యంగా మారకండి అని సూచించారు.
కాంగ్రెస్ నేతలను భయపెట్టి కేసీఆర్ గెలవాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తుపాకీనే లేని గండ్ర వెంకటరమణారెడ్డిపై తుపాకీతో బెదిరించారని కేసు పెట్టారు. అధికారంలోకి రావడానికి కేసీఆర్ కాంగ్రెస్ నేతలను చంపేయడానికి కూడా వెనకాడరు. దొంగ పాస్ పోర్టుల కేసుపై సిట్టింగ్ జడ్జ్ తో విచారణకు గవర్నర్ ఆదేశించాలి. శాంతి భద్రతలు గవర్నర్ పరిధిలో ఉన్నా గవర్నర్ ఎందుకు జోక్యం చేసుకోవడంలేదు? గవర్నర్ స్పందిస్తారని మేము ఆశిస్తున్నాం. లేకపోతే కోర్టుకు వెళతాం. కేసీఆర్, మమ్మల్ని కేసులకు - జైళ్లకు పంపినంత మాత్రాన భయపడం. మేం అధికారంలోకి వస్తాం. కేసీఆర్ కు వడ్డీతో సహా చెల్లిస్తాం! అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి శపథం:
telangana-news-early-poll-news-aggrieved-congress-
రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే కేసీఆర్‌ను జైలుకు పంపుతామని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చెప్పారు. “కేసీఆర్‌ ఒక బట్టేబాజ్‌” అంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్‌ ఆదేశించాడని పోలీసులు ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. బుధవారం రాత్రి సంగారెడ్డిలో ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. నాల్సాబ్‌ గడ్డలో జరిగిన ముస్లిం మైనారిటీ సభలో ఉత్తమ్‌ మాట్లాడుతూ,  కాంగ్రెస్‌ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. జగ్గారెడ్డిని కేసులతో హింసించి సంగారెడ్డి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ గెలవాలని ప్రయత్నిస్తోందని, ఇందుకు పోలీసులు సహకరిస్తున్నారని ధ్వజమెత్తారు.
 
జగ్గారెడ్డి ప్రజల్లో ఉండే వ్యక్తి అని, ఆరోపణలు వచ్చిన 14ఏళ్ల తర్వాత అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. సీఆర్‌పీసీ 41ప్రకారం నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడమేంటని, ఆయనేమైనా హంతకుడా అని నిలదీశారు. జగ్గారెడ్డిని జైలుకు పంపి గెలవాలని అనుకుంటున్నారని అవేమీ జరగవని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభంజనం వీస్తోందన్నారు. 

రాబోయే ఎన్నికల్లో జగ్గారెడ్డిని 50 వేల మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ‘మీ వెంట కోటి మంది కాంగ్రెస్‌ సైన్యం ఉంటుంది. మీరేం ఆందోళన చెందొద్దు’ అని జగ్గారెడ్డి భార్య నిర్మలను ఉత్తమ్‌ ఓదార్చారు. 


నకిలీ పాస్‌పోర్టుల కేసులో కేసీఆర్‌, హరీశే అసలు ముద్దాయిలని చెప్పారు. సీఐడీ నివేదిక లో కానీ, ఎఫ్‌ఐఆర్‌ లో కానీ జగ్గారెడ్డి పేరును ప్రస్తావించలేదని గుర్తుచేశారు. సీఐడీ నివేదిక ఆధారంగా ఏ శిక్షకైనా సిద్ధమని ఉత్తమ్‌ ప్రభుత్వానికి సవాలు విసిరారు. రాష్ట్రంలో అన్యాక్రాంతమైన వక్ఫ్‌ భూములను సర్కారు కాపాడలేకపోయిందని విమర్శించారు. ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని 30 కోట్ల విలువైన భూమిని 3 కోట్లకే ఒవైసీకి ధారాదత్తం చేశారని ఆరోపించారు.


శ్రీమతి నిర్మలా జగ్గా రెడ్ది శపథం:
telangana-news-early-poll-news-aggrieved-congress-

మైనారిటీ గర్జన సభలో కాంగ్రెస్ నేత తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి భార్య నిర్మల కన్నీరు మున్నీరయ్యారు. జగ్గారెడ్డి లేకున్నా ఇంతమంది మైనారిటీలు సభకు వచ్చారని, వారందరి హృదయాల్లో జగ్గారెడ్డి ఉన్నారని ఆమె అన్నారు.  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారంనాడు సంగారెడ్డిలో మైనారిటీ గర్జన సభ జరిగింది. జగ్గారెడ్డి భార్య నిర్మల,  తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. 


మచ్చలేని మనిషి జగ్గారెడ్డి అని ఈ సభలో నిర్మల అన్నారు. ఇవాళ సభలో జగ్గారెడ్డి లేకపోవడానికి కారణం ఎవరో ప్రజలందరికీ తెలుసునని అంటూ వారికి మీరే బుద్ధి చెప్పాలంటూ సభకు హాజరైన ప్రజలనుద్దేశించి పిలుపునిచ్చారు.  తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి జగ్గారెడ్డిపై కక్ష కట్టారని అన్నారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి గెలుస్తారనే కేసీఆర్, హరీష్ రావు, చింత ప్రభాకర్ కలిసి కుట్రలు చేశారని ఆరోపించారు. 


వాళ్లేమైనా సుద్ద పూసలా..? తప్పు చేయలేదా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన లేదని, దొరల పాలనలో బానిసల్లా బ్రతుకుతున్నామని అన్నారు. జగ్గారెడ్డిపై కుట్రలు చేసిన వారికి తనకు పట్టిన గతే పడుతుందని అన్నారు

telangana-news-early-poll-news-aggrieved-congress-

telangana-news-early-poll-news-aggrieved-congress-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రనీతులు పట్టుకొని ఒక పత్రిక చక్కభజన - నిజమేంటి?
అభివృద్ధికి ఆయనే అడ్డంకి - హస్తినలో వాగ్ధానకర్ణుడుపై పేలుతున్నసెటైర్లు
నిర్ణయం పవన్ కళ్యాన్ దే! పొత్తుకు చంద్రబాబు రడీ!
రాజాసింగ్ ఒక్కడు చాలు! కేసీఆరును ఉప్పెనలా చుట్టేయటానికి?
మోడీకి పతనం మొదలైంది 'కోల్‌కతా యునైటెడ్ ఇండియా బ్రిగేడ్' లో చంద్రబాబు
చంద్రబాబుపై తలసాని చండ్ర నిప్పులు? బాబుపై సమర శంఖమేనా?
మహాకూటమి - మోడీకి ప్రత్యామ్నాయాన్ని ఇవ్వగలదా?
“15 నిమిషాలు ఇస్తే 100 కోట్ల హిందువులను చంపేస్తాం!” అన్న వారిని పూచికపుల్లలా తీసేసిన రాజాసింగ్
హత విధీ! అపర చాణక్యుడికిదేం గతి? ఆయన చివరి రోజులే ఈయనకు సంప్రాప్తమౌతున్నాయా?
జయహో భారత్! కీలక పదవుల్లో భారతీయ అమెరికన్లు-ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నామినేషన్లు
యుద్దం జరగక పోయినా సరిహద్దుల్లో మన సైనికులు ప్రాణాలు ఎందుకు కోల్పోతున్నారు?
తగ్గిపోతున్న పురుషత్వం - సంతానోత్పత్తి తగ్గటానికి పురుషులే ప్రధాన కారణం
సామాన్యుని సణుగుడు: దొరవారూ! ఇది కరక్టేనా! మీకిది తగునా?
శాపగ్రస్త కర్ణుని చేతిలో ఆయుధాలు పనిచేయనట్లే - ఇక ఆయన చాణక్యం పనిచేయదట?
హర్షవర్ధన చౌదరి, గరుడ శివాజి పై - వైఎస్ జగన్  హత్యయత్నం కేసులో - విచారణ?
నేను రాజకీయాలు చేయటానికే వచ్చా! టిడిపికి ఎవరు ఎదురెళ్ళినా వారు మోడీ ఏజెంట్లే! తలసాని
షర్మిల పిర్యాదు తో నాకేం సంబంధం? చంద్రబాబు కౌంటర్
కప్పల తక్కెడ రాజకీయం కర్ణాటకలో....అలా మొదలైంది!
పవన్ కళ్యాన్ సంగతేంటి?
ఎడిటోరియల్: ఎన్టీఆర్ బయోపిక్ వసూళ్ల వైఫల్యం - ఎన్నికల్లో టిడిపి పరిస్థితికి సంకేతమా?
About the author