ఆ ప్రేమ జంట జీవితంలో విషాదం చోటు చేసుకుంది.  కేవలం వేరే కులస్తుడిని ప్రేమించి తన తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నందుకు.. కక్ష్యతో అన్యాయంగా  ఆ యువతి భర్తను దారుణంగా చంపించాడు ఆమె తండ్రి.  ఒకే కళాశాలలో ఇంజనీరింగ్ చదివిన ప్రణయ్, అమృతల మధ్య ప్రేమ చిగురించింది. ఇందుకు అమ్మాయి కుటుంబం ఒప్పుకోకపోవడంతో వీరిద్దరూ హైదరాబాద్ లోని ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. తాను భర్త వద్దే ఉంటానని స్పష్టం చేసిన అమృత .. తన కుటుంబానికి ఏమైనా జరిగితే తండ్రిదే బాధ్యతని డీఎస్పీకి ఫిర్యాదు చేసింది.  దాంతో తన బిడ్డను తనకు కాకుండా చేసి తనను సొసైటీలో అవమానించాడని కక్ష్యకట్టారు అమృత తండ్రి మారుతిరావు.


ఈ నేపథ్యంలో పోలీసులు మారుతీరావుకు కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో మారినట్లు నటించిన అతను, అల్లుడి హత్యకు రూ.10 లక్షలతో డీల్ సెట్ చేశాడు.ఓ కిరాయి హంతకుడిని ఇందుకు నియమించుకున్నాడు. అమృతను ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా అక్కడే ప్రణయ్ పై పదునైన కత్తితో ఆ దుండగుడు దాడిచేశాడు. దీంతో రక్తపు మడుగులో పడిపోయిన ప్రణయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 


హత్య జరిగిన వెంటనే మారుతిరావు అతని సోదరుడు పారిపోయే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు వలపన్ని వారిద్దరిని పట్టుకున్నారు. ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితులు అమృత తండ్రి మారుతీరావు, బాబాయి శ్రవణ్ కుమార్ లను గోల్కొండ పోలీసులు ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అల్లుడు ప్రణయ్ ను తానే హత్య చేయించానని మారుతీరావు అంగీకరించాడు. కుమార్తె తన ఇష్టానికి వ్యతిరేకంగా వేరే కులస్తుడిని పెళ్లి చేసుకోవడంతోనే ఈ దారుణానికి తెగబడినట్లు వెల్లడించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: