ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్టణం గాజువాకలో  శ్రీ కన్య సినిమా థియేటర్లో  అగ్ని ప్రమాదం సంభవించింది.  అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే థియేటర్లో పై భాగంలో ఎగిసిపడుతున్న మంటలు.  థియేటర్ బిల్టింగ్ పై సెల్ టవర్ లో మంటలు. నల్లటి పొగలతో ధట్టంగా వ్యాపించిన మంటలు. మాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు.

ఐదు ఫైరింజన్లు సంఘటనా స్థలం వద్దకు చేరుకొని మంటలను అదుపు చేస్తున్నాయి. ప్రమాదంలో థియేటర్‌లోని  రెండు స్క్రీన్లు కాలి బూడిదయ్యాయని సమాచారం.

భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురైతున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. ఎవరికీ గాయాలు కాలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: