ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దర్మాబాడ్ మాజిస్ట్రేట్ కోర్ట్ విడుదల చేసిన నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ విషయం లో రాజకీయాలతో మసిబూసి మారేడు కాయ చేస్తున్న తెలుగుదేశం పార్టీలోని వారిపై ప్రతిపక్ష వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి తిరుపతి ప్రెస్-క్లబ్ లో ఆయన మాట్లాడుతూ నిప్పులు చెరిగారు. 
Image result for bhumana karunakar reddy
న్యాయస్థానం సమన్లు అందుకుని దానికి హాజరు కాకపోతే ఒక కార్యాలయంలో పనిచేసే చప్రాసి కి కూడా వారెంట్ లు జారీ చేస్తారని, పీఎం అయినా, సీఎం అయినా న్యాయస్థానంలో వాయిదాలకు హాజరు కాకపోతే వారెంట్లు రావడం సర్వసాధారణ విషయమన్నారు. అలానే చంద్రబాబుకు కూడా పంపించారని భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. దీన్ని ఏదో కుట్ర జరిగిందని  పచ్చ మీడియా - పచ్చ నేతలు గగ్గోలు పెట్టడం సిగ్గు చేటన్నారు.


బాబ్లీ ప్రాజెక్ట్ కేసులో 'మహారాష్ట్ర దర్మాబాడ్ మాజిస్ట్రేట్ కోర్ట్'  నోటీసులు జారీ చేస్తే ఇది తనపై కేంద్రం కుట్ర అని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటు మాత్రమే కాదు అలా ఆరోపణ చేయటం చంద్రబాబుకు గాని ఆయన పార్టీ వాళ్ళకు గాని ఎంతవరకూ సమంజసమని  ప్రశ్నించారు. ఇది ఖచ్చితంగా భారత న్యాయవ్యవస్థపై బురదజల్లే ప్రయత్న మని మండిపడ్డారు. న్యాయ వ్యవస్థకే  "కళంకం"  ఆపాదిస్తున్న ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబుపై సత్వర చర్యలు తీసుకోవాలని భూమన డిమాండ్ చేశారు.


చంద్ర బాబుపై పెట్టింది ఓ చెత్త కేసు అని, ఆయనది వీరోచిత పోరాటంగా, ఆయనొక అల్లూరి సీతారామ రాజుగా ప్రచారం చేసుకుంటున్నారని భూమన సెటైర్లు చేశారు. చంద్ర బాబు నాయకుడు  "చిటికెల రాయుడు" అని అంటూ తాను నేడు నిందించే న్యాయస్థానాల నుండే 18 కేసుల్లో విచారణలు నిలుపు దలచేసుకొని కొన్నింటిలో బెయిల్ తెచ్చుకున్న ప్రప్రధమ రాజ్యాంగ పదవిలో ఉన్న వీరమొనగాడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు.  

న్యాయస్థానం నోటీసులు జారీ చేస్తే కేంద్రం ప్రతిపక్షాల కుట్రగా అభివర్ణించడం దారుణమన్నారు. దమ్ముంటే "ఓటుకు నోటు కేసు" లో విచారణ ఎదుర్కోవాలని దానికి చంద్రబాబు సిద్ధపడాలని భూమన సవాల్ విసిరారు. న్యాయవ్యవస్థకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మకిల అంటిస్తూ, అవినీతి బురద పూస్తున్నారని వైసిపి ప్రదాన కార్యదర్శి విమర్శించారు.


₹ 500/- నాడే కట్టి వదిలించుకోవలసిన ఒక చెత్త కేసులో చంద్రబాబు నాన్ బెయిలబుల్ వారంట్ అందుకోవటమే ధారుణమైన అవమానమని, అయినా నోటీసులు వస్తే "పచ్చ రాజకీయ మాపీయాకు తోడుగా పచ్చ పత్రికలు చానళ్ళ సమాచార మాఫియా గొంతుకలపటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమే" నని ఏమీ లేని శూన్యంలో ఏదో జరిగినట్లు గగ్గోలు పెడుతూ అల్లరి చేయటం వారికే చెల్లిందన్నారు.

Image result for bhumana karunakar reddy
అల్లూరి సీతారామ రాజు జాతి బానిస శృంఖలాలు చేదించటానికి వీరుడి మాదిరిగా పోరాడితే ఈ చెత్త కేసులో ఆయన్ను అల్లూరి అంతటివాడిగా ప్రొజెక్టు చేయడానికి ప్రయత్నిస్తున్నరన్నారు. టిడిపి మరియు చంద్రబాబు ఆయన "పంచన బ్రతుకీడ్చే కులగజ్జి ఒంటినిండా పులుముకున్న ఒక సినిమాల్లో అవకాశాలు దొరకకని సినీ నటుడు" కూడా కలసి ఈ మకిల అంటించే ప్రయత్నంలో ప్రక్రియలో భాగస్వాములయ్యారని పలువురు ప్రజలు అంటున్నారు.


"ఓటుకు నోటు కేసు" లో పబ్లిక్ అయి పరువు ప్రతిష్ఠ కోల్పోయి అమరావతికి పరుగుతీసిన చంద్రబాబు బాగోతం నేరుగా ప్రజలకు దొరికిపోతేనే న్యాయస్థానం చర్యలు తీసుకోలేదని,  పుష్కరాలలో ఇరవై తొమ్మిది మరణానికి కారణమైతే ఆయనపై కేసు కూడా పెట్టలేదని ,అలాంటి ఈ చిన్నకేసులో వారంట్ జారీ అయితే పెద్ద విషయంగా ప్రచారం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. 

Image result for vote for note

ఈ సందర్భంగా బాబుపై భూమన చేసిన వ్యాఖ్యలు ఇక్కడ క్రోడీకరిచ్చి చూద్ధాం:


*పచ్చ మాఫియా చంద్రబాబును అల్లూరి సీతారామ రాజుగా ప్రొజెక్ట్‌ చేస్తోంది
*చంద్రబాబుపై పెట్టింది ఓ చెత్త కేసు.. ఆయనది వీరోచిత పోరాటంగా చిత్రీకరిస్తున్నారు
*చింతమనేని రోజూ అవినీతికి పాల్పడుతున్నా ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు
*నా పోరాటాన్ని అడ్డుకుంటారా అని చంద్రబాబు ప్రగల్భాలు


*చంద‍్రబాబు నాయుడు ఓ చిటికెల రాయుడు
*చంద్రబాబు పాలన అవినీతితో కుళ్లి కొంపు కొడుతోంది
*18 కేసుల్లో బెయిల్‌ తెచ్చుకున్న వీర మొనగాడు చంద్రబాబు
*ప‍్రత్యేక హోదాపై ఉద్యమించిన వైసీపీ నేతలపై కేసులు పెట్టించిన ఘనత చంద్రబాబుది
*సామాన్య ప్రజలని కూడా వదలని చంద్రబాబు సర్కారు


*పుష్కరాల్లో కనీసం మూడు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది
*పుష్కరాల్లో భక్తుల మృతికి చంద్రబాబే కారణం
*కోర్టు నోటీసులు జారీ చేస్తే, కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల కుట‍్రగా చంద్రబాబు అభివర్ణిస్తున్నారు
*నాలుగేళ్లలో ఒక్క హామీ కూడా నెరవేర్చని చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి
*ప్రజలన‍్నా, ప్రతిపక్షాలన్నా చంద్రబాబుకు లెక్కలేదు


*నాలుగేళ్లుగా ప్రతిపక్ష నేతల మీద వేల కేసులు వేయించారు
*ప్రత్యేక హోదా కోసం పోరాడిన వైసీపీ ఎమ్మెల్యేలు, విద్యార్థులపై కేసులు పెట్టించారు
*విజయవాడలో కాల్‌మనీ వ్యవహారంలో టీడీపీ నేతలపై ఒక్క కేసు లేదు
*సంపద పోగెయ్యటంలోనే కాదు అవినీతిలోనూ చంద్రబాబు ప్రభుత్వం దేశం లోనే నెంబర్‌ వన్‌
*దమ్ముంటే “ఓటుకు కోట్లు కేసు” ను ఎదుర్కోవడానికి చంద్రబాబు సిద్ధపడాలి


*చంద్రబాబు ప్రభుత్వం నాలుగు లక్షల కోట్ల ప‍్రజాధనాన్ని లూటీ చేసింది
*అవినీతి సొమ్ముతో ఎన్నికల్లో నెగ్గాలని చూస్తున్నారు

Image result for vote for note

మరింత సమాచారం తెలుసుకోండి: