మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యకు సంబంధించిన నింధితులను నేడు మీడియా ముందు ప్రవేశ పెట్టారు నల్లగొండ జిల్లా ఎస్పీ రంఘనాథ్.  ప్రణయ్ ని చంపించడానికి నింధితులతో కోటి రూపాయల డీల్.  జూన్ లో స్కెచ్ వేసి..జూలై  మొదటి వారంలో ప్రణయ్ హత్యకు కుట్ర ప్లాన్ చేసుకున్నారు. ప్రణయ్ ను బీహార్ కు చెందిన సుభాష్ శర్మ హతమార్చాడు.  ఏడుగురు నింధితులను అదుపోలోకి తీసుకున్న పోలీసులు. 

ఏ1-మారుతిరావు (తండ్రి), ఏ2-సుభాష్ శర్మ(హంతకుడు) ఏ3-అస్గర్ అలీ, ఏ4-మహ్మద్ బారీ(మర్డర్ కు స్కెచ్ వేసిన వ్యక్తులు), ఏ5 - అబ్దుల్ కరీం, ఏ6-తిరునగరి శ్రవణ్ (బాబాయి), ఏ7-సముద్రాల శివగౌడ్ (డ్రైవర్) .  ప్రణయ్ హత్యకు అస్గర్ అలీ, అబ్దుల్ బారీ స్కెచ్ వేశారు.  అసర్గర్, బారీ గుజరాత్ మాజీ హోం మంత్రి మర్డర్ కేసులో నింధితులు.   అమృత తండ్రి మారుతీరావు నుంచి డబ్బలు తీసుకున్నారు.


ప్రణయ్ ని కిడ్నాప్ చేసి హత్య చేయాలని ప్లాన్ వేశఆరు..అది క్యాన్సల్ అయ్యింది.  ఈ హత్య ప్లాన్ మొత్తం అసర్గర్ అలీ నేతృత్వంలో జరిగింది.  మిర్యాలగూడకు ఒకసారి సుభాష్ శర్మ వచ్చి రెక్కీ నిర్వహించాడు.    మర్డర్ ప్లాన్ అమలుకు మూడు సిమ్ కార్డులు కొన్నారు. గతంలో రెండు సార్లు మర్డర్ కి ప్లాన్ చేశారు..కానీ అది విఫలం అయ్యింది.

తనకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న కూతురు ప్రెగ్నెన్సీ అని తెలుసుకొని అబార్షన్ చేయించుకోమని అమృతను ఒత్తిడి చేశారు ఆమె తండ్రి మారుతీరావు.  అమృతకు బిడ్డ పుడితే అవమానకరమని మారుతి భావించాడు.  ఆగస్ట్ 17 వెడ్డింగ్ రిసెప్షన్ ను టార్గెట్ చేశారు.  హత్య జరిగిన వెంటనే విషయం తెలుసుకొని అమృత తండ్రి, బాబాయి మిర్యలగూడా నుంచి పాట్నాకు జంప్ అయ్యారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: