Image result for mahakuTami in telangana
తెలంగాణా రాష్ట్ర స్మితికి వైఫల్యం రుచి చూపటానికి "మహాకూటమి" ని ఏర్పాటు చేయాలని తెలంగాణాలోని ప్రతిపక్ష పార్టీలు అన్నీ సమాయత్తం ఔతున్నాయి. కాని అతి ముఖ్యమైన ఈ కూటమి ఏర్పాటు జరిగే జాప్యం టీఆర్ఎస్ కు కోరని వరంగా మారుతోంది. ఇప్పటికే శాసనసభ రద్దు చేసి, 105 శాసనసభా స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించి 100 బహిరంగ సభలు 50 రోజుల లక్ష్యంతో ప్రచారం మొదలు పెట్టి శరవేగంగా దూసుకు పోతున్న కెసిఆర్ ను అన్నీ తెలంగాణ ప్రతిపక్షాలు దరిదాపు ల్లోకి కూడా చేరే పరిస్థితి కనిపించటం లేదు. 



కాంగ్రెస్ తో సహా మిగతా అన్నీ పక్షాలు ఇప్పటికీ సీట్లు - పొత్తుల నిర్ణయం పైనే కూర్చుంటే టీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రం ప్ర్జలను గ్రామాలను సందర్శిస్తూ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనకు ముందే సగం గ్రామాల్లో ప్రచారం పూర్తి చేయాలని కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థులకు తన ఆదేశాలు జారీ చేశారట. గులాబీ దండు ప్రచారంతో దూసుకుపోతుంటే కాంగ్రెస్ మాత్రం "మహాకూటమి" ముహూర్తం కూడా పెట్తలేని పరిస్థితిలో ఉంది. ఇక కూటమికి సంపూర్ణ రూపం ఇవ్వలేని పరిస్థితుల మద్యలో కొట్టుమిట్టాడుతూ ఉంది. 
Related image
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంటూ, బలంగా ఉన్న టీఆర్ఎస్ ను ఓడించేందుకు కాంగ్రెస్ అన్నీ ప్రతిపక్షాలతో కాని కలసి వచ్చే వారితోగాని "మహాకూటమి" కి ఆకృతి సిద్ధం చేసింది. టీడీపీ - సీపీఐ - టీజేఎస్ (కోదండరాం పార్టీ) పార్టీలను కూటమి లో భాగస్వాములు చేయడం లో టిపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కృతకృత్యులయ్యారు. తొలి సమావేశం జరగగా, ఇప్పుడు రెండో సమావేశంలో టికెట్ల కేటాయింపు జ్రిపేద్దామనుకుంటే "టీడీపీ - టీజేసీ" ల గొంతెమ్మ కోరికల్లాంటి నెరవేర్చలేని డిమాండ్లతో కాంగ్రెస్ ముందడుగు వేయని పరిస్థితులు నెలకొన్నాయి.  "మహాకూటమి" లో కోదండరాం అన్నీ తానై వ్యవహరిస్తున్నాడట. మహాకూటమికి "కామన్ మినిమం ప్రోగ్రాం" ఉండాలని ఆ కమిటీకి తానే చైర్మన్ గా ఉంటానని కోదండరాం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.  ఎన్నికల మేనిఫెస్టో విధి విధానాలు తయారయిన తరవాతే అభ్యర్థుల కేటాయింపులు జరగాలని మెలిక పెడుతున్నాడట. ముందు స్థానాల సర్దుబాటు చేద్దామన్న కాంగ్రెస్ ప్రతిపాదనకు, కోదండరాం నుండి ఎలాంటి స్పంధన రావడం లేదట.



ఇప్పుడు సీట్ల సర్దుబాటు అంశాన్ని ఎలా ఒక దారికి తేవాలన్న అంశం కాంగ్రెస్ కు అతి పెద్ద సవాల్ గా మారింది. టీడీపీ మాత్రమే కాదు, టీజేఎస్ కూడా తమకు పదుల సంఖ్యలో శాసనసభ స్థానాలు ఇవ్వాలని డిమాండ్ చేయడమే మహాకూటమి ఏర్పాటు  ఆలస్యానికి ప్రధాన కారణంగా కాంగ్రెస్ నాయకులు చెపుతున్నారు. మహాకూటమి పొత్తులో కూడా కాంగ్రెస్ తను గెలిచే సామర్ధ్యమున్న శాసనసభ స్థానాలను ఎట్టి పరిస్థితుల్లో వేరే కూటమిలోని పార్టీలకు ఇవ్వరాదని టీ-కాంగ్రెస్
నాయకులకు జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారట. 
Image result for mahakuTami in telangana
దీంతో అధిక సంఖ్యలో సీట్లు వేరే పార్టీలకు ఇచ్చే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నేతలు మిత్రపక్షాలకు ఇప్పటికే చెప్పారట. కానీ ఈ విషయం లో టిజేఎస్ కోదండరాం మాత్రం వెనకడుగు వేయటాం లోదని తెలుస్తుంది. టీడీపీ కూడా అధిక సంఖ్యలో శాసనసభ స్థానాలను డిమాండ్ చేస్తోంది. దీంతో మహాకూటమి పేరుతో పొత్తుల వ్యవహారం ముగిసేలా లేదని ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోందని తెలుస్తుంది. "మహాకూటమి" ని చాలా అద్భుతంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకత్వం "సీట్లు అడ్జస్ట్మెంట్" చేయలేక డీలా పడుతున్నారట. ఈ పరిణామాలతో "మహాకూటమి" ముందుకు సాగడం కష్టమని నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు ప్రజలంతా ఈ కలగూరగంప పై అవకాశవదులుగా ముద్ర వేస్తున్నారు. 

Image result for mahakuTami in telangana

మరింత సమాచారం తెలుసుకోండి: