ప్రముఖ నక్సల్ నేత కొండపల్లి సీతారామయ్య భార్య కోటేశ్వరమ్మ(100) ఈ రోజు కన్నుమూశారు. సెప్టెంబర్ 10న కోటేశ్వరమ్మ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన విశాఖలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమె ఆరోగ్యం కొంచెం కుదుటపడటంతో హాస్పిటల్ నుంచి ఇంటికి తరలించారు. విశాఖలోని కృష్ణా కాలేజ్ సమీపంలో తన మనవరాలు అనురాధ ఇంట్లో ఆమె తుదిశ్వాస విడిచారు.  మండలంలోని జనార్దనపురం గ్రామానికి చెందిన సీతారామయ్యకు కమ్యూనిస్టు భావాలు ఉండటంతో వంగపాటి రంగారెడ్డి ఆధ్వర్యంలో  సీతారామయ్య 1933లో కమ్యూనిస్టు పార్టీలో చేశారు. పామర్రుకు చెందిన కోటేశ్వరమ్మను 1939లో ఆదర్శ వివాహం చేసుకున్నారు.


ఆగస్టులో తన 100వ పుట్టినరోజును కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. తొలితరం కమ్యూనిస్టు నాయకురాలిగా ఉన్న కోటేశ్వరమ్మ అతివాద ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ‘నిర్జన వారధి’ అనే పుస్తకాన్ని ఆమె రాశారు. అంతేకాకుండా ఆమె మంచి గాయని కూడా. కొండపల్లి కోటేశ్వరమ్మకు కమ్యూనిస్టు చరిత్రలో ఓ అధ్యాయం ఉంది. ఏడేళ్ల వయసులో వితంతవుగా మారిన కోటేశ్వరమ్మ.. నాటి సామాజిక కట్టుబాట్లను ఎదురించి తొమ్మిదో ఏట కొండపల్లి సీతారామయ్యను పునర్వివాహం చేసుకున్నారు.


కమ్యూనిస్ట్‌‌లు రెండుగా చీలిపోవడంతో అతివాద ఉద్యమంలో ఆమె కీలకపాత్ర పోషించారు.  సీతారామయ్య కొద్దికాలనికే  జనార్దనపురం గ్రామం విడిచి కరీంనగర్‌  వెళ్లిపోయారు.  ఆయనతో పాటు కోటేశ్వరమ్మ  తన బిడ్డలతో కలిసి వెళ్లిపోయారు. అనంతరం కొంతకాలనికి   సీతారామయ్య  కమ్యూనిస్టు పార్టీతో విభేదించి పీపుల్స్‌వార్‌ను స్థాపించి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ సమయంలోనే పోలీసులు సీతారామయ్య కుమారుడు చందును ఎన్‌కౌంటర్‌ పేరుతో బలితీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కోటేశ్వరమ్మ తీవ్ర మనోవేదనకు గురైయింది.


సీతారామయ్య ఆమె నుంచి దూరంగా వెళ్లిపోవడంతో ఎవరి సహాయమూ తీసుకోకుండా స్వశక్తితో నిలబడాలని నిశ్చయించుకున్న కోటేశ్వరమ్మ, 35 ఏళ్ల వయసులో హైదరాబాద్ ఆంధ్ర మహిళా సభలో మెట్రిక్ చదవడానికి చేరారు. ప్రభుత్వం ఇచ్చిన ఉపకారవేతనం సరిపడక రేడియో నాటకాలు, కార్యక్రమాలలో పాల్గొంటూ కథలు రాసి ఖర్చులకు డబ్బులు సంపాదించేవారు.  హైదరాబాద్, విజయవాడ నగరాల్లో జరిగిన నాటి ఇస్కస్, శాంతి ఉద్యమాలతో పాటు ఈనాటి ఇస్కఫ్‌  కార్యక్రమాలలో కూడా కోటేశ్వరమ్మ చురుగ్గా పాల్గొన్నారన్నారు. పరిపూర్ణ జీవితం గడిపిన ఆమె జీవితం యువ మహిళలకు స్ఫూర్తిదాయకం కావాలని ఆకాంక్షించారు.  కాగా, కోటేశ్వరమ్మ మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: