రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, కాంగ్రెస్‌ మధ్య పొత్తు దాదాపు ఫిక్స్‌ అయ్యినట్టే తెలుస్తోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, కాంగ్రెస్‌ పొత్తుపై జోరుగా ఊహాగానాలు చెలరేగుతుండగానే తాజాగా రాహుల్‌ గాంధీ ఏపీ పర్యటనతో ఇటు ఏపీలోను ఈ రెండు పార్టీల మధ్య పొత్తు విషయంలో ఓ స్పష్టత వచ్చినట్టు సమాచారం. ఈ రెండు పార్టీల పొత్తుపై అటు టీడీపీతో పాటు కాంగ్రెస్‌ వర్గాల్లో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. 2019లో ఏపీలో ఈ రెండు పార్టీల పొత్తుపై ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చిందని టీడీపీ, కాంగ్రెస్‌కు ఇచ్చే సీట్ల లెక్కపై క్లారిటీ ఉందని రెండు పార్టీల నాయకుల మధ్య చర్చలు నడుస్తున్నాయి. వాస్తవంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కాంగ్రెస్‌ది జీరో పొజీషన్‌. 


గత ఎన్నికల్లో రాష్ట్రాన్ని నిలువునా చీల్చేయడంతో ఆంధ్రాజానాలు కాంగ్రెస్‌ను బొంద పెట్టేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే సీటు కూడా గెలుచుకోలేదు. కొన్ని నియోజకవర్గాల్లో డిపాజిట్లు దక్కించుకోవడానికే ఆ పార్టీ అభ్యర్థులు ఆపశోపాలు పడ్డారు. తాజాగా బీజేపీ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మోసం చెయ్యడంతో చంద్రబాబు ఏ పార్టీ అయితే రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చిందో తిరిగి అదే పార్టీతో పొత్తుకు రెడీ అవుతుండడంతో ఆంధ్రాజనాలు ఎలా ? స్వీకరిస్తారు అన్నది కూడా సందేహంగానే ఉంది. ఇక వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ కాంగ్రెస్‌కు 12 అసెంబ్లీ సీట్లు, 1 ఎంపీ సీటు ఆఫర్‌ చేసినట్టు తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్‌ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఆఫర్‌ చాలా గొప్పదే అనుకోవాలి. 

Image result for telangana

ఇక తెలంగాణలో తెలుగుదేశం 30 అసెంబ్లీ 3 ఎంపీ స్థానాలు ఆశిస్తుంటే కాంగ్రెస్‌ టీడీపీకి 15 అసెంబ్లీ ఖమ్మం, మల్కాజ్‌గిరి ఎంపీ సీట్లు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఏపీలో టీడీపీ, కాంగ్రెస్‌కు ఇచ్చే ఆ ఒక్క ఎంపీ సీటు రాయలసీమలో అదీ కర్నూల్‌ జిల్లాలో మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డికే ఇస్తున్నట్టు కూడా ప్రాథ‌మికంగా తెలిసింది. కోట్ల ఫ్యామిలీకి అదే కర్నూల్‌ జిల్లాలో డోన్‌ లేదా ఆలూరు నియోజకవర్గాల్లో ఏదో ఒక అసెంబ్లీ సీటు కూడా ఇస్తారని.. పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డికి అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం సీటు ఇస్తారని తెలుస్తోంది. 


ఏదేమైనా ఇటు రాహుల్‌ గాంధీ తాను ప్రధాన మంత్రి అయిన వెంటనే తొలి సంతకం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసమే పెడతానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ సానుకూల పవనాలు కాంగ్రెస్‌తో వెళ్తే తనకు సానుకూలత వస్తుందని ప్రభుత్వ వ్యతిరేఖత అధిగమించ వచ్చని చంద్రబాబు సైతం పొత్తుకు సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: