తెలంగాణలో ఇప్పుడు రాజకీయాలు గరం గరంగా ఉన్నాయి.  ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ నువ్వా..నేనా అన్నట్లు ఉన్నాయి.  ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలు హడావుడి కూడా మొదలైంది.  ఇప్పటికే అసెంబ్లీ రద్దు చేయడం...టీఆర్ఎస్ 105 సీట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ కేటాయించడం పై విమర్శలు..అలకలు..రాజీనామాలు మొదలయ్యాయి.  నిన్న టీఆర్ఎస్ నేత రమేష్ రాథోడ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.  ఎప్పటి నుంచి టీడీపీలో కొనసాగుతున్న రమేష్ రాథోడ్ తన మడుగడ ఇబ్బందిగా మారడంతో..కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.   

అయితే టీఆర్ ఎస్ లో తన ప్రాబల్యాన్ని గురించి తనకు ఇష్టమైన చోటు నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తారని భావించారు..కానీ అలా జరగలేదు. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ టికెట్ ను తాజా మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ కు కేటాయించడంపై రమేష్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో, తన అనుచరులు, మద్దతుదారులతో కలసి రమేష్ కాంగ్రెస్ లో చేరారు. అయితే, ఆయనకు ఖానాపూర్ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారా? లేదా? అనే విషయం తెలియరాలేదు. 

 ఇక లాభం లేదని కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు రమేష్ రాథోడ్. లంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డిల సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. రమేష్ కు వీరంతా పార్టీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఆయనకు కాంగ్రెస్ పెద్దలు టికెట్ హామీ ఇచ్చారా..? లేదా అనే విషయం తెలియరాలేదు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఖానాపూర్ నుంచి రమేష్ పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: