Image result for UN environment meeting invited chandrababu
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటన ఏ సమావేశం కోసం వెళుతున్నారో? ప్రజలకు వివరణ యివ్వాలని బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ, జీవిఎల్‌ నరసింహారావు డిమాండ్‌ చేశారు. శనివారం నిర్వహించిన మీడియా సమా వేశంలో చంద్రబాబు అమెరికా టూర్‌ పై ఆయన పలు అనుమానాలు వ్యక్తం చేశారు. 
Image result for chandrababu is attending UN or WEF
"వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం" నిర్వహిస్తున్న సమావేశంకు వెళ్తూ,  "ఐక్యరాజ్య సమితి సమావేశం" కి వెళ్తున్నామని అబద్దపు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఐరాస లో ఏ మీటింగ్‌కు ముఖ్యమంత్రి వెళ్తున్నారో వారు పంపిన ఆహ్వానం ఎందుకో? ఏమిటో?  బయట పెట్టాలన్నారు. ఈ వివరం చంద్రబాబు నాయుడు విమానం ఎక్కే లోపు అమెరికా ప్రయాణంపై స్పష్టతను ఇవ్వాలన్నారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ వారు నిర్వహిస్తున్న సమావేశానికి ఐఖ్య రాజ్య సమితి కి ఎటువంటి సంబంధం లేదని ఆయన తేల్చిచెప్పారు. 
Image result for chandrababu is attending UN or WEF
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం బూటకపు పాలన కొనసాగిస్తోందని జీవిఎల్‌ నరసింహారావు నిప్పులు చెరిగారు. రామాయపట్నం పోర్టును మైనర్‌ పోర్టు గా పరిగణించి రాష్ట్ర ప్రభుత్వమే అడ్డు కుందని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు వ్యతిరేకించేసరికి టీడీపీ నాయకులే పోర్టు దగ్గరికి వెళ్లి డ్రామాలు ఆడుతున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు పై 'కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ -కాగ్‌'  ఇచ్చిన నివేదికపై సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ అవినీతిని బయట పెడితే వారిని ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వలనే గోదావరి పుష్కరాల్లో మరణాలు సంభవించాయని ఆరో పించారు. చంద్ర బాబు తను చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకే మీడియా, పుష్కరస్థానం కోసంవచ్చి పూజలు నిర్వహిస్తున్న భక్తుల మీదకు ఆ తప్పిదాన్ని  నెట్టేస్తున్నారని జీవిఎల్‌ నరసింహారావు విమర్శించారు.  

Image result for gvl narasimha rao & kutumba rao

Image result for UN environment meeting invited chandrababu

Image result for UN environment meeting invited chandrababu

CM N Chandrababu Naidu releasing a book at a session on 'Transforming Agriculture Through Natural Farming in Andhra Pradesh' organised by the United Nations ...

ప్రజలు గుర్తుంచుకోవలసింది చంద్రబాబును యుఎన్ జనరల్ అసెంబ్లిలో ఉపన్యసించటానికి మాత్రంకాదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: