తెలంగాణలో రాజకీయాలు బాగా వేడెక్కి పోతున్నాయి.  కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ రద్దు చేయడం..అప్పడే 105 మంది ఎమ్మెల్యేల జాబితా రిలీజ్ చేయడం..వచ్చే ఎన్నికల్లో తామే తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేయడం జరిగింది.  అప్పటి నుంచి టీ కాంగ్రెస్ రంగంలోకి దిగింది..తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు తాము కూడా సిద్దమే అని..ఈసారి టీఆర్ఎస్ ని చిత్తు చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అరెస్ట్ పెను వివాదం రేపింది.   


మనుషుల అక్రమ రవాణా చేస్తున్నారనే కేసులో జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డికి సోమవారం నాడు బెయిల్ మంజూరైంది. మనుషుల అక్రమ రవాణా కేసులో సెప్టెంబర్ 11వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు చంచల్‌గూడ జైల్లో జగ్గారెడ్డి ఉన్నాడు. కాగా, 2004లో నకిలీ పత్రాలతో పాస్ పోర్టులు ఇప్పించి, మానవులను అక్రమ రవాణా చేశారనే ఆరోపణలతో జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.


గుజరాత్ కు చెందిన ముగ్గురుని తన కుటుంబసభ్యులుగా పేర్కొంటూ వారిని అమెరికాకు పంపినట్టు కేసులో ఆరోపణలు ఉన్నాయి.   ఈ నేపథ్యంలో   రూ. 50 వేల పూచీకత్తుతో బెయిల్‌ను సికింద్రాబాద్ కోర్టు మంజూరు చేసింది.  జగ్గారెడ్డి ఇవాళ సాయంత్రం వరకు విడుదలయ్యే అవకాశాలున్నట్లు న్యాయ వాదులు  తెలిపారు.  ప్రతి ఆదివారం మార్కెట్ పోలీసు స్టేషన్‌లో హాజరు కావాలని జగ్గారెడ్డికి కోర్టు సూచించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: