బ్రిటీష్ కబంధ హస్తంలో ఉన్న భరత మాత సంకెళ్లు తెంచడానికి ఎంతో మంది వీరులు అమరులయ్యారు.  వారిలో అత్యంత పిన్న వయసులోనే దేశమాత సేవలో ప్రాణాలు అర్పించిన వీరుడు భగత్ సింగ్.  స్వాతంత్ర పోరాటంలో శాంతి మార్గంలో  వారు కొందరైతే..తిరుగుబాటు తో నే సాధించాలని పట్టుదలతో వెళ్లిన వారు మరికొందరు. అలా తిరుగుబాటు ఉద్యమంలో పాల్గొన్న వారిలో వెంటనే గుర్తుకు వచ్చేది భగత్ సింగ్, ఆజాద్ చంద్రశేఖర్, అల్లూరి సీతారామరాజు లాంటి మహా యోధులు ఎందరో ఉన్నారు. 


భారత దేశంలో బ్రిటీష్ పాలనను వ్యతరేకిస్తూ యుక్త వయసులో ఉరికంబాన్ని తన కంఠమాలగా భావించిన అమరవీరుడు భగత్ సింగ్. స్వాతంత్ర్య సమర యోధుడు, భారత స్వాతంత్ర్యం గురించి పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులల్లో ఆయన ఒకరు. అందుకే ఆయను  'షహీద్ భగత్ సింగ్’ గా కొనియాడబడతాడు. భారత్‌లో బ్రిటీషు పాలనను వ్యతిరేకిస్తూ విప్లవాత్మక ఉద్యమాలను చేపట్టిన కుటుంబంలో ఆయన జన్మించాడు.


భగత్ సింగ్ లాహోరు లోని డి.ఎ.వి. కళాశాలలో చదువుతున్నప్పుడు, అప్పట్లో స్వాతంత్ర్యధ్యంలో చురుకుగా పాల్గొంటున్న వాళ్ళు పరిచయమయ్యారు.. వాళ్ళలో ముఖ్యులు, “లాలాలజపతి రాయి”, “రాజ్ బిహారి బోస్”.. మహాత్మా గాంధీ 1921లో సహాయ నిరాకరణోద్యమానికి పిలుపు ఇచ్చారు.. దానికి ప్రతిగా, భగత్ సింగ్ అప్పటివరకు తను చదువుతున్న పాఠశాల మానేసి, లాహోరు లోని, నేషనల్ కాలేజీ లో చేరారు.  ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజ్‌పత్ రాయ్ హత్య నేపథ్యంలో ఒక పోలీసు అధికారిని కాల్చినందుకు ఆయన్ను ఉరితీశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: