ఈ మద్య టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది సైబర్ మోసాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి.  ఎదుటి వ్యక్తి ఎవరు అని చూడకుండా ఆన్ లైన్ లో తమ జాతకం మొత్తం చెప్పడంతో ఈజీగా మోసం చేస్తున్నారు సైబర్ మోసగాళ్లు.  తాజాగా హైదరాబాద్ లో ఆన్ లైన్ డేటింగ్ పేరు తో మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. 

గత కొంత కాలంగా  ఆన్ లైన్ డేటింగ్ పేరు తో కోట్ల రూపాయలు కాజేసీన కేటుగాళ్లు.  అమ్మాయిలతో ఫోన్లో మాట్లాడించి..కుర్రాళ్లను ఆకర్షించి తర్వాత వారి జేబులకు చిల్లు పడేలా చేయడం ఈ కేటుగాళ్ల పని. కేటుగాళ్ల వలలో పడ్డ 150 మంది పైగా బాధితులు. ఒక్కో బాధితుడి  నుంచి రూ. 10 వేల నుంచి రూ.15 లక్షలు కాజేసిన మోసగాళ్లు. తాము ఇంత ఘోరంగా మోసపోయామని తెలిస్తే సమాజంలో సిగ్గు పోతుందని చాలా మంది బాధితులు సైలెంట్ గా ఉండి పోవడం కూడా ఈ కేటుగాళ్లకు బాగా కలిసి వచ్చింది. 

 బాధితులు ఆన్ లైన్ లోకి రాగానే హీరోయిన్లు..అందమైన మోడల్స్ ఫోటోలు పెట్టి మోసానికి పాల్పడ్డ ముఠా.  ఇలాంటి ఘరానా మోసగాళ్లను గుర్తించి ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని..తీరా మోసపోయిన తర్వాత గగ్గోలు పెడితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుందని అన్నారు.  ఇలాంటి మోసాగాళ్ల భారిన పడ్డవారు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా..అది సైబర్ క్రేమ్ పరిధిలోకి తీసుకుంటామని పోలీస్ అధికారులు అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: