మొదలు బ్రిటీష్ పాలన నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు పతాక స్థాయి ఉద్యమాన్ని లేవనెత్తారు. శాంతి, అహింస ఆయుధాలుగా సరికొత్త పోరాటానికి ఊపిరిలూదారు.  గాంధీజీ పూర్తి  పేరు మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ...మోహన్‌దాస్‌ అసలు పేరు. కరంచంద్‌ తండ్రి పేరు.  ''గాందీ'' అంటే 'పచారి దినుసుల వర్తకుడు' అని అర్థం. వారి పూర్వీకులు వర్తక వాణిజ్యాలు సాగించారు. కాని కొందరు వ్యాపారానికి బదులు ప్రభుత్వ ఉద్యోగాలు చేశారు.తాత పోర్‌బందరుకు దివాను. తండ్రి పోర్‌బందర్‌, రాజకోట, వంకనేర్‌ అనే సంస్థానాలలో దివాన్‌గా పని చేశాడు.గుజరాత్‌ రాష్ట్రంలో కధియవార్‌ ఉన్నది. దానిలో భాగం పోర్‌బందరు.

మహాత్మా గాంధీ ప్రయాణించిన కార్లు

అది సముద్రతీరాన ఉన్న ఒక చిన్న పట్టణం.అక్కడే 1869 అక్టోబర్‌ 2వ తేదీన గాంధీ జన్మించాడు. తండ్రి అసలు పేరు కరంచంద్‌. కాని కాబా గాంధీ అనే ఇంకొక పేరూ ఉన్నది. తల్లి పుతలీబాయి. వారికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. నాలుగవవాడు మోహన్‌దాస్‌. తండ్రి ఎక్కువగా చదువుకోలేదు. కాని క్రమశిక్షణ, మంచి నడవడి ఉన్నవాడు. తన పదవికి న్యాయం చేకూర్చినవాడు. తల్లి భక్తి పరాయణురాలు. ఇతరులను నొప్పించేది కాదు. వారిలోని గుణాలను మోహన్‌దాస్‌ పుణికి పుచ్చుకున్నాడు. 

మహాత్మా గాంధీ ప్రయాణించిన కార్లు

చేతితో వడికిన వస్త్రాలు ధరించి ఎంతో సాదాసీదాగా గడిపిన జాతిపిత వద్ద ఒక్క సొంత కారు కూడా ఉండేది కాదు. మహాత్మా గాంధీ వద్ద అప్పట్లో కారు కొనుగోలు చేసేంత సంపద ఉన్నప్పటికీ, ఆయన ఎన్నడూ వాటిపై వ్యామోహ పడలేదు. అప్పట్లో కారు కలిగి ఉండటం అంటే, పెద్ద హోదాను కలిగి ఉండటంగా భావించే వారు. గాంధీజీ కారును కొనకపోయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో కారులో ప్రయాణించారు.  మహాత్మా గాంధీ ఈ కారులో ప్రయాణించిన తర్వాత, ప్రపంచ వ్యాప్తంగా ఈ కారుకు మంచి పాపులారిటీ వచ్చింది.  

మహాత్మా గాంధీ ప్రయాణించిన కార్లు

మహాత్మా గాంధీ ప్రయాణించిన కార్లు

బాపూజీ ప్రయాణించిన కార్లలో చెప్పుకోదగిన మరొక కారు రాజ్‌కోట్ మహారాజుకు చెందిన 'స్టార్ ఆఫ్ ఇండియా' అనే పురాతన రోల్స్ రాయిస్ కారు. రాజ్‌కోట్ రాజ కుటుంబానికి మహాత్మా గాంధీ తండ్రి కరంచంద్ దివాన్‌గా పనిచేసేవారు. ఈ కారులో మహాత్మా గాంధీ, ఇంగ్లాండ్ రాణిలు ప్రయాణించారని చెప్పుకుంటారు. మహాత్మా గాంధీజీకి 1928లో స్థాపించిన కుమార్ టాక్సీస్‌తో మంచి అనుబంధం ఉందనే చెప్పాలి. 1928లో ఎస్. కృష్ణన్ మరియు కె.బి. కుమరన్‌లు ఈ కంపెనీను ప్రారంభించారు. ఈ కంపెనీకి బాపూజీ కూడా ఓ కస్టమరే. 1928లో గాంధీజీ 'ఓవర్‌ల్యాండ్ విప్పెట్' అనే కారులో ప్రయాణించారు. కోట్ల మంది ప్రజల అభిమానం..ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రెటీలు, ప్రముఖ రాజకీయ నాయకులు ఆయన చుట్టూ ఉన్నా ఎక్కువ శాతం ఆయన పాద యాత్రనే చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: