మోహన్ దాస్ కరంచంద్ గాంధీ" 1869 అక్టోబరు 2 వ తేదీన పోర్ బందర్ లో జన్మించారు.  చదువులో గాంధీ మధ్యస్థమైన విద్యార్థి. పోర్ బందర్ లోను, రాజ్‌కోట్ లోను ఆయన చదువు కొనసాగింది. 19 సంవత్సరాల వయసులో (1888 లో) న్యాయశాస్త్ర విద్యాభ్యాసానికి గాంధీ ఇంగ్లాండువెళ్ళాడు. తల్లికిచ్చిన మాట ప్రకారము ఆయన మాంసానికి, మద్యానికి, స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉన్నాడు.  ఒక సంవత్సరము పనిమీద వెళ్ళిన గాంధీ, దక్షిణాఫ్రికాలో 21 సంవత్సరాలు (1893 నుండి 1914 వరకు) గడిపాడు. కేవలం తెల్లవాడు కానందువల్ల రైలు బండి మొదటి తరగతి లోంచి నెట్టివేయడం, హోటళ్ళలోకి రానివ్వకపోవడం వంటి జాతి వివక్షతలు ఆయనకు సమాజంలోని అన్యాయాలను కళ్ళకు కట్టినట్లు చూపాయి. 


అప్పటి నుంచి భారతీయుల పట్ల జరుగుతున్న వివక్షతపై పోరాటం చేయాలని తలంచారు. ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను ఆయన ప్రచురించాడు. సత్యాగ్రహం అనే పోరాట విధానాన్ని ఈ కాలంలోనే ఆయన అమలు చేశాడు. ఈ పోరాటంతోనే బ్రిటీష్ పాలకులను గడ గడలాడించి భారత దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చారు.   అంత త్యాగనిరతితో ఎంతో మంది అమరుల త్యాగ ఫలితంగా సిద్దించిన స్వాతంత్రం ఇప్పుడు రాబంధుల చేతిలో పడ్డట్టయ్యింది. ఎంతో మంది స్వార్థ చింతనతో తెచ్చిన స్వాతంత్రానికి విలువ లేకుండా చేస్తున్నారు. ప్రజల కోసం మీరు తెల్లదొరలను తరిమికొట్టారు. కానీ నల్లదొరలే నయవంచకులై ప్రజలను వంచిస్తున్నారు. ఆంగ్లేయులు అవలంభించే విభజించు పాలించు సూత్రాన్ని మీరు వ్యతిరేకించారు.


అయితే నేతలు కులాల వారీగా విభజించి పాలనసాగిస్తున్నారు. అహింసే మార్గమని మీరు చాటి చెప్పారు. అధికారం కోసం హింసామార్గంలో పయనిస్తూ అధికారం చేజిక్కించుకుంటున్నారు. మీరు ఒకచెంపపై కొడితే మరో చెంప చూపించారు. కాగా పాలకులు ధరలు ఆకాశానికి చేర్చి సామాన్యుల రెండు చెంపలు వాయిస్తున్నారు. మీరు దేశం కోసం ఉప్పు సత్యాగ్రహం చేశారు. కానీ మనవాళ్ళు అప్పుకోసం విదేశాల వద్ద పడిగాపులు గాస్తున్నారు. ఇక్కడ గాడ్సేల రాజ్యమే కొనసాగుతోంది...?   గాంధీజీ కన్న కలలు కల్లలు చేశారు. దేశంలో మతసామరస్యం మచ్చుకైనా కనిపించడం లేదు. ఆడది అర్థరాత్రి తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యమని గాంధీజి తేల్చిచెప్పారు. కానీ నేటి పరిస్థితుల్లో పట్టపగలే మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. తెల్లదొరలను తరిమికొట్టడంలో తరిమికొట్టడంలో మీరు శాంతి మార్గాన్ని ఎంచుకుని విజయాలు సాధించారు.


కానీ పేరుకు గాంధీజి మార్గం అని చెబుతూ మన వాళ్ళు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు.   మహాత్మా మీకు ఇటీవల కాలంలో దేశంలో జరిగిన కుంభకోణాలపై వివరిస్తా వినండి. కల్మాడీ అనే ఓ కీలాడీ రాజకీయ ముసుగులో వేలాది కోట్ల రూపాయలు దిగమింగాడు. అలాగే రాజా అనే ఓ అరవోడు 2జి స్పెక్ట్రాం (టెలీఫోన్)లో దాదాపు 2లక్షల కోట్లు కొల్లగొట్టాడు. ఎంతో మంది బడా వ్యాపారులు బ్యాంకులకు కన్నం వేస్తూ విదేశాలకు వెళ్లి హాయిగా బతుకుతున్నారు.  ఆ బ్యాంకుల్లో సామాన్యుల దాచుకున్న డబ్బు సామాన్యులదన్న విషయం మర్చిపోతున్నారు.  యూరియా ఓటుకు నోటు.గడ్డి.బోఫోర్స్ లాంటి ఎన్నో కుంభకోణాలు జరిగాయి మహాత్మా. అంతేకాకుండా మన రాష్ట్రంలోనూ కొందరు అవినీతి గడ్డి కరిచి కటకటల్లో ఉన్నారు. ఎన్నికలు వస్తే..ఓట్ల బేరాలు అడుతూ..అడ్డగోలిగా డబ్బులు పంచుతూ..తీరా 


మీలా వీళ్ళు దేశం కోసం కటకటాలకు వెళ్లలేదు మహాత్మా కేవలంస్వలాభం కోసం అడ్డదారులు తొక్కి అరదండాల పాలయ్యారు. వీరి పాలనలో ఉన్న మమ్మల్ని మన్నించు మహాత్మా.....జైల్లో వున్న వారిని పొరపాటున కూడా మన్నించకు.  

మరింత సమాచారం తెలుసుకోండి: