Image result for vote for note vs kanakamedala ravindra kumar
నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఓటుకు నోటు కేసు లో కొంత పురోగతి ఏర్పడింది.కేసును తేల్చగలుగుతారో? లేదో? కాని, ఆదాయపన్ను శాఖ కొంత విచారణ చేసింది.ఈ కేసులో నిందితులుగా ఉన్న ఉదయసింహ, సెబాస్టియన్ లను ఐటి శాఖ అదికారులు విచారించారు.
Image result for vote for note vs kanakamedala ravindra kumar
-నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన ₹ 50 లక్షల నగదు ఎక్కడ నుంచి వచ్చింది? అని అధికారులు ఆరా తీసే ప్రయత్నం చేశారు.
-ఆ డబ్బు ఎవరు తెచ్చారు? ఎవరిచ్చారు? డబ్బు ఇచ్చే సంగతి తెలుసా? అని ప్రశ్నించారు.
-బ్యాంకు నుంచి డ్రా చేసి తెచ్చారా?
-ఎవరైనా మధ్యవర్తి ద్వారా సమకూర్చారా? 
-ఇదంతా పన్ను కట్టిన డబ్బేనా? అన్న కోణంలో అడిగారని తెలియవచ్చింది.
-మిగతా ₹ 4.5 కోట్లు ఎక్కడ నుంచి తేవాలనుకున్నారు? అని కూడా అడిగారు.
-రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌ రెడ్డిని ఆయన వ్యాపార లావాదేవీల గురించి ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
Image result for vote for note vs kanakamedala ravindra kumar
ఎన్.డి.ఎ నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చిన తర్వాత బిజెపి మైండ్-గేమ్ ఆడుతోందని టిడిపి పార్లమెంట్ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు ఓటు కు నోటు కేసులో ఏదో జరిగిపోతోందని, చంద్రబాబు జైలుకు వెళ్తారని ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు. అది అంతా అభూతకల్పనేనని ఆయన అన్నారు. ఓటుకు నోటు కేసు చెల్లదని హైకోర్టు ఇప్పటికే చెప్పిందని ఆయన అన్నారు. ఈ కేసులో చంద్రబాబును ఇరికించాలని రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసును తెరపైకి తెస్తు న్నారని ఆయన అన్నారు.చంద్రబాబును ఇరికించడానికి సుప్రిం కోర్టుకు వెళ్లారని ఆయన అన్నారు.


కనకమేడల ప్రవచించిన న్యాయస్థానాల నిర్ణయాలపై ముందుగానే ఆయన సూత్రీకరించటం తానుపక్కా తెలుగుదేశంవాడినేనని మరోసారి చెప్పటం తప్ప, జాతిజనులు విశ్వమంతా వీక్షించిన పరమ దుర్మార్గం "ప్రజాన్యాయస్థానం" లో వీగి పోకతప్పదని - మహానాయకుడు నందమూరికి తారక రామారావుకు వేసిన వెన్నుపోటుపై దైవం తీర్పు చెప్పే సమయం కూదా ఆసన్నమైనదని తెలంగాణాలో ఎన్ టి రామారావు అభిమానులు నమ్ముతున్నారు.  అంతేకాదు కాంగ్రెస్ లాంటి అవకాశవాద పార్టీతో పొత్తు తెలుగు దేశాన్ని పునాదులనుండి కూల్చటానికేనని బిజెపి వారి అభిప్రాయం.
  Image result for vote for note vs kanakamedala ravindra kumar   

మరింత సమాచారం తెలుసుకోండి: