యనమల రామకృష్ణుడు ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖామంత్రి & ప్రణాళిక శాఖ కూడా ఆయన డీల్ చెసే సబ్జెక్ట్. అంతేకాదు ప్రతిపక్షాలను విమర్శించటంలో ప్రశ్నించటంలో ముందుంటారు. అయితే  అంతటి బుద్ధిమంతుడు నిజాయతీ పరుడులాగా కనిపించే వ్యక్తి ఈ మద్య సింగపూర్లో చేసిన నిర్వాకం ఆయన ఔన్నత్యాన్ని నింగి నుండి నేలకు... సారీ! పాతాళానికి పడేసింది. 
Image result for root canal treatment to AP Minister Yanamala
దంతానికి రూట్ కెనాల్ ఎంత పెద్ద కార్పొరేట్ ఆస్పత్రి లో చేయించుకున్నా పాతిక వేలకు మించదు. సాధారణంగా ఐదువేలు కొత్త పన్ను తో కలిపి పదివేలు రూపాయిలు మాత్రమే. కానీ ఏపీలో అత్యంత సీనియర్ మంత్రి, రాజకీయ నాయకుడు అయిన యనమల రామకృష్ణుడు రూట్-కెనాల్ చికిత్సకు సింగపూర్ లో వైద్యం చేయించు కుని ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బులో నుంచి ₹2.80 లక్షల రూపాయలు క్లెయిం చేశారు. 


కొన్ని పచ్చ పత్రికలు అయితే అసలు ఈ వార్తే రాయకుండా యనమలకు సంఘీభావం ప్రకటించాయి. వీటికి జాతి జనులపై అంత ప్రేమ. ఈ పత్రికల యాజమాన్యం బ్రిటీష్ వాళ్ళ పాలనలో గనక ఉనికి లో ఉండి ఉంటే మహాత్ముడు కూడా ఈ దేశానికి స్వాతంత్రం సంపాధించి ఉండేవాడు కాదు. ఎందుకంటే వీళ్ళు పాలకుల చెప్పులు నాకుతూ వార్తలను వారికి ప్రయోజనకరంగా మార్చి రాస్తారు కదా! 
Image result for root canal treatment to AP Minister Yanamala
అయితే కొన్ని పత్రికలతో పాటు, సోషల్ మీడియాలో ఈ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. చివరకు ప్రతిపక్ష వైసీపీ, బిజెపి నేతలు కూడా యనమల రామకృష్ణుడి దంత చికిత్స వ్యవహారంపై విమర్శలు చేశారు. ఒక మంత్రిగా విదేశాల్లో వైద్యం చేయించుకోవటానికి ఆయనకు అర్హత ఉన్నా, దంతానికి రూట్ కెనాల్ చికిత్సకు అయిన బిల్లు చూసే అందరూ అవాక్కుయ్యారు. 
Image result for root canal treatment to AP Minister Yanamala
ఒక  పెద్ద స్కామ్ చేసే నష్టం కంటే  ఈ చిన్న జీవోతోనే యనమల తన పరువు పొగొట్టుకున్నారు. ఇంత చిన్న అవకాశం దొరికితేనే ఈ మహానుభావుడు సిగ్గులేని పనిచేయగా లేంది,  ఆర్ధిక ప్రణాళికా శాఖల్లో మూడు దశాబ్ధాలుగా ఎంతగా కక్కుర్తి పడ్దరో? ఆలోచిస్తేనే ఒళ్ళు జలధరిస్తుంది. ప్రధాన పచ్చ మీడియా ఎలా తగలడ్డా, కొన్ని పత్రికలు, చానళ్ళు, సామాజిక మాద్యమం ఏకధాటిగా వాయించేస్తేనే - ఇప్పుడు సింగపూర్ లో  చేయించుకున్న పంటి చికిత్సకు సంబంధించిన డబ్బును తిరిగి ఖజనా కు చెల్లించేశారు. దీంతో యనమల దంత చికిత్సకు అయిన ఖర్చు మొత్తనికి ప్రభుత్వం విడుదల చేసిన జీవో# 1844 రద్దు చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే ఈ అమౌంట్ తిరిగి ఖజానాకు జమ చేయటం ద్వారా ఆయన తను తప్పుచేసినట్లు అంగీకరించినట్లే. దీంతో ఆయనకు ఎవరిని విమర్శించే హక్కులేనట్లే. దంత చికిత్స కోసం యనమల రామకృష్ణుడు తీసుకున్న ₹2,88,82/- ను చలానా రూపంలో జమ చేశారని జీవో లో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే యనమల రామకృష్ణుడికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయినా  దంత చికిత్స నిమిత్తం సర్కారు నుంచి తీసుకున్న మొత్తాన్ని వెనక్కి ఇచ్చేసి కొంత లో కొంత పరువు కాపాడుకునే ప్రయత్నం చేశారు.

Image result for root canal treatment to AP Minister Yanamala

మరింత సమాచారం తెలుసుకోండి: