Image result for income tax department raids on AP  & central government

అతనోక నాలుగు దశాబ్ధాల సుధీర్ఘ అనుభవం ఉన్న రాజనీతిఙ్జుడని ఆయనే చెప్పుకుంటారు. తానే నిప్పు అంటారు. తనను స్పర్శిస్తే భస్మమై పోతారంటారు. శాసనసభ లో శాసనాలను చేసే అపురూపమైన పదవిలో ఉన్న శాసనసభ్యుడు అంటే లా మేకర్. అంతేకాదు ప్రభుత్వాధినేతగా శాసనాలను అమలు చేసే పదవిలో ఉన్నారు. ఆయనే ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

Image result for IT raids & searches in AP

నేడు అంటే శుక్రవారం నాడు రాజధాని అమరావతి లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఒకే సారి పెద్ద ఎత్తున జరుగుతున్న ఆదాయ శాఖ సోదాలు నిర్వహించడంపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. మూకుమ్మడిగా ఆ శాఖ అధికారులు సోదాలు నిర్వహించడం రాష్ట్రంపై దాడిగా ముఖ్యమంత్రి అయి ఉండీ శాసన కర్త అయి ఉండీ చంద్రబాబు తప్పుపట్టారు. మంత్రివర్గ సమావేశంలో ఈ విషయమై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

Image result for IT raids & searches in AP

రాజకీయ కుట్ర తోనే ఐటీ శాఖ దాడులు చేస్తుందని కేంద్రప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఐటీ దాడుల వెనుక ఆంతర్య మేమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న రాష్ట్రాల్లో ఇదే రకంగా వ్యూహం రచిస్తున్నారని కొందరు మంత్రులు అభిప్రాయ పడ్డారు. మూకుమ్మడి గా ఐటీ దాడులు జరపడం రాష్ట్ర ప్రభుత్వానికి మాయని మచ్చగా ఆయన  అభిప్రాయపడ్డారు.

Image result for IT raids & searches in AP

కేంద్ర-రాష్ట్ర సంబంధాలు దెబ్బతినడంపై అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించే విషయాన్ని కూడ పరిశీలించనున్నట్టు చెప్పారు. శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలో ఉంటాయని చంద్ర బాబు నాయుడు కేబినేట్ సమావేశంలో అభిప్రాయపడినట్టు సమాచారం. అయితే రాష్ట్రంలో ఓకే సారి ఐటీ దాడులను సీఎం సీరియస్‌గా పరిగణించారు. సోదాలు నిర్వహించేందుకు వచ్చే అధికారు లకు పోలీసు రక్షణను ఉపసంహరించుకొనే విషయమై  ఏపి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.ఈ విషయమై ఏ రకమైన చర్యలు తీసుకోనే అవకాశం ఉందో పరిశీలించాలని చంద్రబాబు అధికారు లను  ఆదేశించారు.

Image result for IT raids & searches in AP

ఇక్కడ జాతి మొత్తం సిగ్గుపడే విషయం గురించి జనం అనేదేమంటే - ఈయన శాసనసభలో శాసనాలు చేస్తారు. ప్రభుత్వ అధినేతగా శాసనాలు అమలు చేసేది కూడా ఆయనే. అయితే ఇక్కడ అమలు చేసేది వేరేవారిపై అయితే ఆయన అంతగా బాధపడేవారు కాదు. ఇప్పుడు దాడులు అధికార పక్షం అంటే ప్రభుత్వంలోని వ్యక్తులపైనే. ప్రభుత్వం పై కాదు. శాసనసభ్యులు గా వారు శాసన సభ్యులైనా, అధికారంలో ఉన్నప్పుడు వారు అధికారులే కదా!.  వ్యక్తులు గా వారూ వ్యక్తులే. వ్యక్తులుగా నేరస్తులైన వారు ప్రభుత్వంలో ఉన్నా, బయట ఉన్నా, అధికారంలో ఉన్నా, కేంద్రంలో ఉన్నా, రాష్ట్రంలో ఉన్నా  నేరస్తులు నేరస్తులే. శిక్షార్హులే.

Image result for IT official visits Narayana Institutions in AP

ఆదాయ పన్ను అధికారులుగా, శాసనం ద్వారా సిద్ధించిన అధికారాన్నే వినియోగించి వారు అనుమానితులపై దాడులు నిర్వహించి సోదాలు చేసి నేరాల ఋజువులు సాధించటం వారి భాధ్యత. అందులో కేంద్ర కుట్ర ఏముంటుంది. ఒకవేళ కుట్ర ఉంటే నిజాయతీ గల వ్యక్తులు పవిత్రులుగానే బయటపడతారు కదా! ఏ నేరం చేయని వారు గత ఆరు నెలల నుండే తమపై సిబీఇ, ఈడి, ఐటి దాడులు కేంద్రం ప్రోద్బలంతో జరగనున్నాయని దాన్నుంచి తమను తమ ప్రభుత్వాన్ని ప్రజలే వలయంగా ఏర్పడి కాపాడలని వేడుకోవటం నాలుగు దశాబ్ధాల సుధీర్ఘ రాజకీయ అనుభవమున్న ఒక ముఖ్యమంత్రి చేసే పనేనా! సిగ్గుమాలిన తనం కాదా! ఇది.

Image result for IT official visits Narayana Institutions in AP అదే నిజమైతే "ప్రతి నిందితుడూ తాను సత్యసందుడి నని" చెప్పుకొనే సాధారణ వ్యక్తిలా - ఒక లా మేకర్, ఆయన టీం మెంబర్స్ గంపగుత్తగా తాము చేసిన శాస్నాల అమలునే తప్పుపట్టటం జరిగితే "శాసన ధిక్కారం" చేసినట్లే కాదా! అన్నింటిని మించిన సిగ్గుమాలినతనం ఏమంటే తాము చేసిన శాసనాల ద్వారా పనులు చెసే అధికారులకు రక్షణ ఉపసంహరిస్తానని అనటం దివాలా కోరుతనం కాదా! అలాగే తాము చేసిన శాసనాలను అమలు చెసే అధికారులపైనే న్యాయస్థానానికి పిర్యాదు చేస్తానంటే - న్యాయ నిర్ధారణ అధికారం న్యాయస్థానాలకు ఇచ్చే శాసన కర్తవైన నీవే - బాధ్య నిర్వహించేవారికి పిర్యాదు చెస్తే వారేమి చెప్పగలరు?        

 Image result for shivaring chandrababu

ఐటి రైడ్స్ అంటూ సమావేశాల్లో వణికి పోతున్న చంద్రబాబు సహచరులు బందువులు 

మరింత సమాచారం తెలుసుకోండి: