నంద‌మూరి న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ రాజ‌కీయంగా చాలా స్ట్రాంగ్ డెసిష‌న్ తీసుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు ఎదురవుతున్న ఇబ్బందుల‌ను అధిగ‌మించి.. త‌న స్థానాన్ని ప‌దిలం చేసుకునేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. తొలిసారి చ‌ట్ట‌స‌భ‌ల‌కు పోటీ చేసిన బాల‌య్య‌.. 2014లో టీడీపీ టికెట్‌పై హిందూపురంలో బ‌రిలో నిలి చి విజ‌యం సాధించారు. అయితే, ఈ నాలుగున్న‌రేళ్ల‌లో హిందూపురానికి చేసిన సేవలు ఏంటి? అని ప్ర‌శ్నిస్తే.. మాత్రం కేవ‌లం ఓ రెండు బైకు ర్యాలీలు, స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తామంటూ.. ఓ రెండు రోజుల మ‌కాం.. ప‌రిష్కార వేదిక‌లు నిర్వ‌హించి స‌మ‌స్య‌ల‌పై విన‌తి ప‌త్రాలు స్వీక‌రించ‌డం వంటివి క‌నిపిస్తున్నాయి త‌ప్పితే.. బాల‌య్య మార్కు అభివృద్ధి ఇంకా ఎక్కువ ఉండాల‌న్న‌ది నియోజ‌క‌వ‌ర్గ జ‌నాల అభిమ‌తం.


దీనికితోడు ఆయన ఎమ్మెల్యేగా ఉంటూనే ఏడాదికి రెండు సినిమ‌లు చేస్తున్నారు. ఇక‌, ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతు న్న నేప‌థ్యంలో కూడా ఆయ‌న ఎన్టీఆర్ మూవీ మేకింగ్‌లో బిజీగా ఉన్నారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో వ్య‌తిరేక‌త పెరుగు తోంది. వాస్త‌వానికి హిందూపురం అంటేనే.. ఎన్టీఆర్ టీడీపీకి పెట్ట‌నికోట‌. ఇక్క‌డ నుంచి ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి ఎవ‌రు నిల‌బ‌డ్డా కూడా గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయం. అయితే, ఇప్పుడు బాల‌య్య‌వ్య‌వ‌హార శైలితో ఇది భ్ర‌ష్టు ప‌ట్టే ప‌రిస్థితి వ‌చ్చింది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ బాల‌య్య‌ను మార్చాల‌ని డిమాండ్లు తెర‌మీదికి వ‌చ్చాయి. వీటిని గ‌మ‌నించిన బాల‌య్య‌.. ఇక్క‌డ చ‌క్రం తిప్పారు. అసంతృప్తుల‌ను బుజ్జ‌గించారు. ఇక్క‌డ త‌న‌కు పీఏగా ఉన్న వ్య‌క్తిని మార్చి.. వేరేవారికి బాధ్య‌త‌లు అప్ప‌గించారు. 


ఇక‌, ఇక్క‌డ ఎమ్మెల్యే బాల‌య్యకు ఓటు మాత్రం హైద‌రాబాద్‌లో ఉందంటూ.. పెద్ద ఎత్తున విప‌క్షాలు విమ‌ర్శ‌ల‌కు దిగ‌డం తో బాల‌య్య హుటాహుటిన త‌న ఓటును, త‌న‌భార్య ఓటును కూడా హిందూపురానికి మార్చుకున్నారు. మొత్తానికి తాను హిందూపురానికి ప‌క్కాలోక‌ల్‌న‌ని చెప్ప‌క‌నే చెప్పుకొచ్చారు. ఈ ప‌రిణామాల‌తో ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించుకునేందుకు త‌న వంతుగా ఇటీవల కొన్ని కార్య‌క్ర‌మాల‌కు శంకు స్థాప‌న చేశారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ బాల‌య్యే ఇక్క‌డ నుంచి బ‌రిలోకిది గ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, బాల‌య్య‌ను మార్చి వేరేవారికి అవ‌కాశం ఇద్దామ‌ని భావించినా.. సొంత వియ్యంకుడు ప‌ట్టుబ‌డితే.. చంద్ర‌బాబు మాత్రం చేసేదేముంది.! అందుకే హిందుపురాన్ని బాల‌య్య‌కే రిజ‌ర్వ్ చేశార‌ని చెబుతున్నారు. మ‌రి బాల‌య్య‌ను గెలిపిస్తారా? ఓడిస్తారా?  చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: