ఈ మద్య ఆంధ్రప్రదేశ్ పాడేరు లో మావోయిస్టులు చేసిన బీభత్సం అందరికీ తెలిసిందే.  అధికార పార్టీ  ఎమ్మెల్యే కిడారిపైన, ఆయనతోపాటు ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే సివేరు సోముపైనా మావోయిస్టులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ కిడారి ఘటనా స్థలంలోనే కన్నుమూశారు. ఈ ఘటనలో 40-50 మంది మావోయిస్టులు పాల్గొని ఉండొచ్చని, వారంతా సామాన్య పౌరుల్లా సివిల్ దుస్తుల్లో వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీస్ అధికారులు తెలిపారు.  ఇదిలా ఉంటే..ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులను గుర్తించిన పోలీసు బలగాలు మన్యంలో కూంబింగ్ ముమ్మరం చేశారు.

మావోయిస్టుల సమాచారం రాబట్టే పనిలో పోలీసులు నిమగ్నమవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.  అయితే ఈ ఎఫెక్ట్ తెలంగాణ రాష్ట్రం పై కూడా పడుతుందని..అప్రమత్తంగా ఉండాలని ఇంటలీజెన్స్ వర్గాలు తెలిపుతున్నాయి.  తాజాగా మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు పురుషోత్తం అలియాస్ రవి, ఆయన భార్య వినోదిని అలియాస్ భారతక్క లొంగిపోయారు.
Image result for మన్యంలో కూంబింగ్
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎదుట వీరు లొంగిపోయారు. మావో అగ్రనేతలు ఆర్కే, గణపతి, కిషన్ లతో కలసి పురుషోత్తం 25 ఏళ్లు పని చేశారు. అయితే పురుషోత్తానికి మావోయిస్ట్ పార్టీ మాస్టర్ బ్రెయిన్ గా మంచి పేరు ఉంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ప్రచార కమిటీ సెక్రటరీగా పురుషోత్తం పని చేస్తున్నారు. అనారోగ్య కారణలతో అడవిన వదిలిపెట్టి, జనజీవన స్రవంతిలోకి వచ్చారు. వీరిపై రూ. 8 లక్షల వరకు రివార్డు ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: