తెలివైన శత్రువు చంద్రబాబు అనుకుంటున్నట్లు ప్రత్యక్షంగా పోరాటం చేయడు. సినీనటుడు శివాజీ అంటున్నట్లు ఆపరేషన్ ద్రవిడ గరుడ అనే పరేషాన్లు చేయరు. వాళ్ళకు బలాన్నిస్తూ రాజకీయాలకు అవసరమైన ఆర్ధిక అంగలాన్ని అందిస్తూ వారి రాజకీయ బారాన్నిమోస్తూ, తమ వ్యాపారప్రయోజనాలు సాధించుకొనే వారి మిత్రుల భుజస్కందాలను విరిచేస్తారు తప్ప ఇంకేం చేయరు. 


ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించినంతవరకు ప్రజాప్రతినిధులంతా అటు కేంద్రం లోని వారేకాదు రాష్ట్రంలోని వారికి లెక్కకు మించిన వ్యాపారాలున్నాయి.  వారే ఇప్పుడు చంద్రబాబుకు "ప్రముఖ్యులు" అస్మదీయులు. ఎక్కువ మందీ పన్ను ఎగవేత దారులే. వారి లెక్కలు తేల్చేందుకు నిన్నతి వరకు ఆదాయపన్ను శాఖ దాడులు చేయగా దొరికిన ఆధారాలపై ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగిందనే అంటున్నాయి విశ్వసనీయవర్గాలు. 
Enforcement-directorate
ఇప్పుడు సీబీఐ మాజీ డైరక్టర్ విజయరామారావు తనయుడు శ్రీనివాస కళ్యాణ రావు నివాసంతో పాటు, ఆయనకే చెందిన మరిన్ని కంపెనీల్లోనూ ఈడీ ఇటీవల నిశిత తనిఖీ లు చేపట్టింది. అదే సమయంలో ఇతరులకు చెందిన పలు సంస్థల్లో కూడా ఈడీ తనిఖీలు సాగాయి అంటున్నారు. ఇప్పటికే విజయరామారావు తనయుడు శ్రీనివాస కళ్యాణరావు పై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 
Image result for vijayaramarao chandrababu
ఈ మొత్తం వ్యవహారంలో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఒక ముఖ్యనేత కంపెనీతో పాటు, కేంద్ర మాజీ మంత్రి కంపెనీ లకు మధ్య "లింక్ దొరికినట్లు" ఈడీ వర్గాల అనధికార సమాచారం. బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ మానేజింగ్ డైరెక్టర్ గా ఉన్న సమయంలో శ్రీనివాస కళ్యాణ రావు విభిన్న బ్యాంకుల కన్సార్టియం నుంచి పెద్ద మొత్తం అంటే ₹ 304 కోట్ల రూపాయల పైగా ఋణం తీసుకుని తర్వాత  "డిఫాల్ట్" అయిన సంగతి అందరకు తెలిసిందే.


బ్యాంకుల కన్సార్టియం నుంచి ఋణం తీసుకున్న తర్వాత ఈ సంస్థ వాటిని చెల్లించటంలో విఫలం అయింది. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ మధ్య ఐటిశాఖ భారీ ఎత్తున దాడులు నిర్వహించి, పెద్ద ఎత్తున వారి రికార్డులు తనిఖీ చేసిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపు గానే హైదరాబాద్ లో కూడా తనిఖీలు ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 
Image result for vijayaramarao TDP
ముఖ్యనేత కంపెనీకి, కేంద్ర మాజీ మంత్రి కంపెనీకి, ఈ బ్యాంకుల కన్సార్టియంకు ఋణాల ఎగవేతకు మధ్య "అనుబంధాన్ని" ను చేధించేపనిలో ఈడీ అధికారులు ఉన్నా రని తెలుస్తుంది. ఇది తేలితే అలా బ్యాంకుల సొమ్మును దారిమళ్ళించి పోగేసి కూడబెట్టిన అవినీతి సొమ్మును ఏ విధంగా వివిధ కంపెనీలకు మళ్ళించారో తెలుసు కోవటాని కి - ఇవన్నీ పెద్దల బినామీలే అని ఋజువు చేయటానికి పక్కాఆధారాలతో అటు ఐటి శాఖ, ఇటు ఈడీలు దర్యాప్తుతోపాటు లింకులచేదన కూడా కొనసాగిస్తు న్నాయి దీంతో రాబోయే రోజుల్లో ప్రభుత్వ పెద్దల అవినీతికి సంబంధించి పక్కా ఆధారాలు సేకరించే పనిలో దర్యాప్తు సంస్థలు విజయం సాధించే దిశలో ప్రయాణిస్తూన్నాయని అభిఙ్జ వర్గాల కథనం. ఇది చాలు అవక్ర విక్రమ అక్రమార్కుల గుండెల్లో రైళ్ళు, విమానాలు పరుగెత్తడానికి. 
Image result for ex cbi director vijaya rama rao family photos

ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉండబట్టే అధినేత అంతగా కంగారు పడుతున్నారని ప్రజలకు తేలి పోయింది. అంతేకాదు అమాయకంగా  ప్రజల మద్దతు వలయం కోరుతూ బజార్ పాలైన అధినేత ఆయన అంగ బలాలు ఇప్పుడు ఆయన్ని రక్షించలేవు. ఒక శాసనకర్తై ఉండి తాను నిర్మించిన శాసనాలను అమలు చెసే ఐటి శాఖ ఈడి లు అమలు పరుస్తుంటే కేంద్రపేరుతో విమర్శించటం విఙ్జత అనిపించుకోదు కదా!   

మరింత సమాచారం తెలుసుకోండి: