తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది.  అసెంబ్లీ రద్దు అయన తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్  105 మంది ఎమ్మెల్యేల జాబిగా రిలీజ్ చేశారు.  అవన్నీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావడం విశేషం.  అయితే ఇంతకాలం కాంగ్రెస్ కూటమి కోనసాగిస్తుందన్న వార్తలు వచ్చాయి.  ఈ నేపథ్యంలో అభ్యర్థుల లీస్టు ఇవ్వడంలో జాప్యం జరిగిందని వార్తలు వచ్చాయి.

తాజాగా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలిజాబితాను కాంగ్రెస్‌ పార్టీ సిద్ధం చేసింది. మొత్తం 119 నియోజకవర్గాలకుగాను 34 నియోజకవర్గాలకు పేర్లను ఎంపిక చేసింది. వీరిలో ఎక్కువ మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులే ఉన్నారు.   యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం శుక్రవారం జరగనుంది. ఈ సందర్భంగా తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.


కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఖరారు చేసిన అభ్యర్థులు వీరే:


సబితా ఇంద్రారెడ్డి - మహేశ్వరం
కార్తీక్‌రెడ్డి - రాజేంద్రనగర్‌
రేవంత్‌రెడ్డి - కొడంగల్‌
గండ్ర వెంకటరమణరెడ్డి - భూపాలపల్లి
కొండా సురేఖ - పరకాల
పొన్నాల లక్ష్మయ్య - జనగామ
కూన శ్రీశైలంగౌడ్ ‌- కుత్బుల్లాపూర్‌
సుధీర్‌రెడ్డి - ఎల్బీనగర్‌
ప్రతాప్‌రెడ్డి - షాద్‌నగర్‌
షబ్బీర్‌ అలీ - కామారెడ్డి
సుదర్శన్‌రెడ్డి - బోదన్‌
శ్రీధర్‌బాబు - మంథని
మహేశ్వర్‌రెడ్డి - నిర్మల్‌
జీవన్‌రెడ్డి - జగిత్యాల
బలరాంనాయక్‌ - మహబూబాబాద్‌
దొంతుమాధవరెడ్డి - నర్సంపేట
గీతారెడ్డి - జహీరాబాద్‌
దామోదర రాజనర్సింహ - ఆందోల్‌
జానారెడ్డి - నాగార్జునసాగర్‌
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి - హుజూర్‌నగర్‌
ఉత్తమ్‌ పద్మావతి - కోదాడ
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి - నల్గొండ
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి - మునుగోడు
సురేష్‌ షెట్కర్‌ - నారాయణ్‌ఖేడ్‌
రమేష్‌ రాథోడ్‌ - ఖానాపూర్‌
పొన్నం ప్రభాకర్‌ - కరీంనగర్‌
సునీతాలక్ష్మారెడ్డి - నర్సాపూర్‌
వంశీచందర్‌రెడ్డి - కల్వకుర్తి
డీకే అరుణ - గద్వాల
సంపత్‌ - ఆలంపూర్‌
ఆరేపల్లి మోహన్‌ - మానకొండూరు
చిన్నారెడ్డి - వనపర్తి
జగ్గారెడ్డి - సంగారెడ్డి
భట్టి విక్రమార్క - మధిర



మరింత సమాచారం తెలుసుకోండి: