జ‌నసేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న గురించి, త‌న పార్టీ గురించి చెప్పుకొంటున్న గొప్ప‌లు మా గొప్ప‌గా ఉన్నాయ‌ని అంటున్నా రు ప‌రిశీల‌కులు. రాష్ట్రంలో ఈ పార్టీ పుట్టింది 2014కు ముందే అయినా.. అప్ప‌టి ఎన్నిక‌ల‌కు మాత్రం క‌డు దూరంలో నిలిచిపోయింది. టీడీపీ-బీజేపీ కూట‌మికి మ‌ద్దతు ఇచ్చి టీడీపీ ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యేలా జ‌న‌సేనాని చ‌క్రం తిప్పారు. అయితే, ఇప్పుడు ఇద్ద‌రికీ చెడిపోయిన నేప‌థ్యంలో ప‌వ‌న్ తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నాడు. అయితే, తాజాగా ఆయ‌న చెప్పిన ఓవిష‌యంపై నెటిజ‌న్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ప‌లు జిల్లాల్లో ఇప్ప‌టికీ ప్ర‌చారంలో లేని జ‌న‌సేన పార్టీకి ల‌క్ష‌ల్లో ఓటు బ్యాంకు ఉంద‌ని ప‌వ‌న్ చెప్ప‌డాన్ని చీప్‌గా చూస్తున్నారు. 


అంతేకాదు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న పార్టీ అధికార పార్టీని శాసిస్తుంద‌ని చెప్ప‌డాన్ని కూడా ఓ వ‌ర్గం ప్ర‌జ‌లు ఎద్దేవా చేస్తున్నా రు. ప్ర‌స్తుతం ప్ర‌జా పోరాట యాత్ర‌లో ఉన్న ప‌వ‌న్‌.. ప‌శ్చిమ గోదావ‌రిలో స‌భ‌లు నిర్వ‌హిస్తూ.. ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ లు చేస్తున్నారు. తాజాగా కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన స‌భ‌లో ప‌వ‌న్ మాట్లాడుతూ.. త‌న పార్టీ ఓటు బ్యాంకు విష‌యంపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. రాష్ట్రంలో ప‌లు నియోజ‌కవ‌ర్గాల్లో ఓట్ల‌ను తొల‌గిస్తున్నార‌ని, అది కూడా టీడీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకుగా మారిన జ‌న‌సేన పార్టీ ఓట్ల‌ను తొల‌గిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.  నూజివీడు నుంచి కొవ్వూరు వరకూ తొలగించిన 18లక్షల ఓట్లు జనసేనవేనని మండిపడ్డారు. 


అయితే, వాస్త‌వానికి పార్టీ పెట్టి నాలుగున్న‌రేళ్లు దాటినా.. పార్టీ నిర్మాణం మాత్రం ఇంకా చేప‌ట్ట‌లేదు. 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో పూర్తిగా స‌మ‌న్వ‌య క‌ర్త‌ల‌ను కూడా నియ‌మించ‌లేదు. పార్టీ గురించి గ్రామాల్లో ఇప్ప‌టికీ ప్ర‌చారంలో లేదు. కాపు సామాజిక వ‌ర్గం బ‌లంగా ఉన్న ప‌శ్చిమ గోదావ‌రి వంటి జిల్లాలోనే పార్టీ నిర్మాణం పూర్తిగా సాగ‌లేదు. దీంతో జ‌న‌సేన‌కు ఓటు బ్యాంకు ఎక్క‌డ ఉందో అర్ధ‌మ‌వుతూనే ఉంది.

ఇక‌, నూడివీడు నుంచి కొవ్వూరు వ‌ర‌కు అంటే.. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ, టీడీపీ ఓట‌ర్లే ఎక్కువ‌గా ఉన్నారు. వీరిలో ఏమైనా తొలిగిస్తే.. వైసీపీవే అయి ఉంటాయి. కానీ, అస‌లు నిర్మాణమే జ‌ర‌గ‌ని జ‌న‌సేన ఓట్లు  అది కూడా 18 ల‌క్ష‌ల ఓట్లు తొల‌గించడం అంటే.. నిజ‌మెలా అవుతుంది. ఆయా నియోక‌వ‌ర్గాల్లో ఉన్న మొత్తం ఓట్లు క‌లిపితే కూడా 18 ల‌క్ష‌లు కావు. మ‌రి ఎలా జ‌న‌సేన‌కు అన్యాయం జ‌రిగిందో ప‌వ‌న్‌కే తెలియాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: