హైదరాబాద్ లో అత్యంత ప్రతిష్టాత్మక హోటల్ పార్క్ హయాత్. నగరం నడిబొడ్డున అందరికీ అందుబాటులో ఉంటూ, కేవలం హోటల్ గదులు మాత్రమే కాకుండా, 'సర్వీస్ ఫ్లాట్స్'  కూడా వున్నాయి. ఈ హోటల్ సినీరంగంలో రాజకీయరంగంలో టీఎస్సార్ గా సుపరిచితమై ప్రఖ్యాత వ్యక్తి  తిక్కవరపు సుబ్బరామిరెడ్డి గారిది. ఆయన కున్న పరిచయాలు వ్యాపార బాంధవ్యాల కారణంగా ఈ హోటల్ నగరంలో ఇతర హోటల్స్ కంటే అద్భుతంగా ఆక్యుపెన్సీ కలిగి ఉంది.  సన్నిహితులకు ఇచ్చే కన్సెషన్లు కావచ్చు, హోటల్ స్థాయి కారణంగా రాజకీయ నాయకులే కాదు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపార దిగ్గజాలతో పాటు సినీజనాలంతా ఈ హోటల్ నే ఎక్కువగా ఇష్టపడతారు. 

Image result for service flats in park hyatt hyderabad

ఒకప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తొలిరోజుల్లో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ హోటల్ లో సకుటుంబ సమేతంగా మొత్తం ఒక ఫ్లోర్ నే హయిర్ చేశారంటారు. హీరోయిన్ సమంత, హిరో మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్, నిర్మాత బెల్లంకొండ సురేష్ లాంటి అనేకమంది సర్వీస్ అపార్ట్మెంట్లను పెర్మనెంట్ గా తీసుకుని లక్షల్లో అద్దెలు చెల్లిస్తుంటారు. 
Image result for service flats in park hyatt hyderabad

అయితే ప్రతిష్ఠాత్మక హోటల్ పరువు ప్రతిష్ఠ ఈ మద్య వస్తున్న కచరావార్తల తో పోయేలా ఉంది. వెలుగు చూస్తున్న కొన్ని వ్యవహారాలు, ఉదాహరణకు శ్వేతాబసు ప్రసాద్ వ్యవహారం,  మరీ ఈ మద్య వివాదాస్పద సినీనటి శ్రీరెడ్డి ఆరోపణలు చేస్తున్నట్లు తెలంగాణాలోని ఆర్మూర్, టిఆరెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వ్యవహారం ఈ హోటల్ లోనే  జరిగినట్లు తెలుస్తుంది. 


Image result for service flats in park hyatt hyderabad

అయితే నేరుగా హోటల్ మీద ఎలాంటి ఆరోపణలు చేయక పోయినా, తెలంగాణ టిఆరెస్ నాయకుడు జీవన్ రెడ్డి ఈ హోటల్ లో పర్మనెంట్ రూమ్ తీసుకుని, రాసలీలలు సాగిస్తున్నారని తనను లైంగికంగా ఈ హోటల్ లోనే వేదించారని శ్రీరెడ్డి ఆరోపించడం, అంటే పదుగురిలో హోటల్ పరువు పోయినట్లే కదా! ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొందరు రాజకీయ నాయకుల పేర్లు వింటేనే అసహ్యం కలిగే రోజులివి. అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే సాంప్రదాయవాదులు కుటుంబంతో ఈ హోటల్ లో ఉండాలంటే ఇబ్బందిపడతారు కదా!  ఇలాటి కార్యకలాపాలు అడపా దదపా జరిగినా జనం మనసుల్లో ఇవే మిగిలిపోతాయి. 

Image result for t subbarami reddy family

టీఎస్సార్ కు అటు టాలీవుడ్ తోను, ఇటు అన్నీ రాజకీయపార్టీలతోను, మరో ప్రక్క అధికారవర్గాలతోను అవసరార్ధ సన్నిహితత్వంతో మొహమాటాలు ఎక్కువే. అందుకే స్నేహితులకు ఫెసిలిటేట్ చేయటానికి బిల్లుల్లో తగ్గింపులు, ఉచిత గదులు లాంటి సదుపాయాలు అందించక తప్పదు. పార్క్ హయాత్ బయటవాళ్లకు చేసే చార్జ్ వేరు. టాలీవుడ్ పరిశ్రమ వ్యక్తులకు చార్జ్ చేసే రేటు వేరుగా ఉంటుందని  సమాచారం.


సంవత్సర కాలంలో అనేక సమయాల్లో అన్-సీజన్ లాస్-లను కవర్ చేసుకోవటానికి కార్పోరేట్ కంపనీలకు ఇచ్చే రుసుము తగ్గింపును మానెజ్ చేయటానికి కొన్ని సార్లు కన్సిషన్ యివ్వకతప్పదు. కాని ఇలాంటి సదుపాయాలను వాడుకొనే  వ్యక్తుల నడవడి ప్రఖ్యాత హోటల్ ప్రతిష్ఠ మంటకలప కూడదు. 

Image result for TRS mla jeevan reddy park hyatt hotel sri reddy

శ్రీరెడ్డి  చెప్పిన  జీవన్ రెడ్డి కథ ఏమంటే: 
Image result for TRS mla jeevan reddy park hyatt hotel sri reddy

మీ... టూ... ప్రకంపనలు మన దేశంలో ప్రారంభం కావటానికి ముందే  "మీ..టూ.. ఉద్యమాన్ని కాస్టింగ్  కౌచ్" పేరుతో తెలుగుచిత్ర పరిశ్రమలో జరిగే తతంగాన్ని విప్లవాత్మ కంగా బట్టబయలు చేసింది సినీ నటి శ్రీరెడ్డి.  సినిమాల్లో అవకాశాలు కావాలంటే సాయంత్రాలు మా గెస్ట్‌-హౌస్‌ ల తలుపు తట్టాల్సిందే --అనే సినీ పరిశ్రమనేలే సినీ బడాబాబుల బాగోతం, ఆ ప్రసిద్ధ వ్యక్తుల పేర్లను సంఘటన వివరాలు సాక్ష్యాలతో సహా బయట పెట్టింది.

Image result for TRS mla jeevan reddy park hyatt hotel sri reddy

అంతే కాదు వీళ్లంతా నన్ను వాడుకుని కూడా అవకాశాలు ఇవ్వలేదంటూ పబ్లిక్ లో ఉప్పొంగిన ప్రజా సానుభూతితో  పెద్దవిస్పోటనమే సృష్టించింది. ప్రస్తుతం చెన్నైకి చేరిన శ్రీరెడ్డి కొంతకాలం నిశ్శబ్ధంగానే ఉన్నా, ఇప్పుడు మీ...టూ... పేరుతో దేశ వ్యాప్తంగా చెలరేగిపోతున్న ఉద్యమ ప్రభావం పుణ్యమా!  కాష్మోరా మళ్లీ నిద్ర లేచిందన్నట్లు మరోసారి ఆమె ఆరోపణల భీభత్సంతో చిత్రసీమలో ప్రకంపనలు పుట్టిస్తుంది. ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగం గా, జీవన్‌రెడ్డి పెద్ద అమ్మాయిల పిచ్చోడని, హైదరాబాద్‌ లోని పార్క్‌ హయత్ హోటల్‌ లో చాలా మంది అమ్మాయిలను తనదగ్గరకు రప్పించు కొని కామదాహం తీర్చు కోవటానికి వాడుకున్నాడని, అలా అతని అత్యాచారాలకు బలైన చాలామంది అమ్మాయిల వివరాలు తన వద్ద ఉన్నాయని శ్రీరెడ్డి ఈ వ్యాఖ్యానించింది. 


Image result for TRS mla jeevan reddy park hyatt hotel sri reddy


ఒక రోజు నిర్మాత బెల్లంకొండ సురేష్ పార్క్‌హయత్‌ లో ఒక సమావేశం ఏర్పాటు చేశాడని, దానికి జీవన్ రెడ్డి కూడా వచ్చాడని, ఆ సమయంలో తనను బలవంత పెట్టాలని చూశాడని,  కానీ తాను అందుకు ఒప్పుకోలేదని, రెండు మూడు సార్లు అక్కడే లైంగిక వేధింపులకు గురిచేసినా తాను లొంగలేదని అన్నారు. ఈ తరుణంలో తాను స్లీపింగ్ ప్రొడ్యూసర్‌ (ఎవరో ఒక బకరాని నిర్మాతగా బినామీగా ఉంచి నేపధ్యంలో తానే సర్వంగా ఉంటూ పెట్టుబడులుపెట్టే వాణ్నిస్లీపింగ్ ప్రొడ్యూసర్ అంటారు టాలీవుడ్ సాంప్రదాయంలో)  అధికార పార్టీలో ఉన్నాను కాబట్టి అంతా నా చేతిలోనే ఉందని ఏమైనా చేయగలని అన్నాడు. ఇదే సమయంలో నా స్నెహితురాళ్లను కొంత మందిని వాడుకున్నాడని శ్రీరెడ్డి బాంబు పేల్చింది.

Image result for TRS mla jeevan reddy park hyatt hotel sri reddy


ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఉభయ తెలుగు రాష్ట్రాల సినీ, రాజకీయ రంగాలతో పాటు కోలీవుడ్ లోను హాట్ టాపిక్‌ గా మారాయంటు న్నారు. శ్రీరెడ్డికి ఇచ్చిన ఇంటర్య్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. జీవన్‌రెడ్డికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంతో అత్యంతసన్నిహిత సంబంధాలున్నాయని తెలుస్తుంది. అందుకే జీవన్ రెడ్డి ప్రవర్తన ఈ విధంగా తయారైందని అంటారు. ఆయన మాటల్లో అధికారంతో కళ్ళుమూసుకుపోయి ఎదుటివాళ్ళకు భయం కలిగించే అహంకారం ఆహం తొంగిచూస్తుంటాయని టిఆరెస్ వాళ్లు కూడా అంటుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: