తెలుగు దేశం పార్టీ (టిడిపి) పేరును కొంచెం సవరించి తెలుగు గోబెల్స్ పార్టీ టిజిపి మారిస్తే సరి. ఎందుకంటే కొన్ని ప్రత్యేక ఉడిపి గ్రూప్ ఆఫ్ హోటల్స్ లో ఎక్కడ తిన్నా ఏ సమయం లో తిన్నా మనకిచ్చె టిఫిన్స్ టేస్ట్ ఒక లాగే ఉంటుంది పెద్దగా మార్పుండదు. అలాగే తెలుగుదేశం నాయకులంతా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుమారుడు మంత్రి చినబాబు కలిపి ఒకే లాగా అబద్ధాలు మాట్లాడేస్తూ ఉంటారు. ఇది ముఖ్యంగా టిడిపి, ఎన్-డి-ఏ నుండి బయటకు వచ్చాక ఈ తీరు బాగా ప్రస్పుటమౌతుంది.

Image result for political quotes in telugu

ఒక తప్పు బిజెపి చెస్తే అది తెలుగు ప్రజలకు ద్రోహం చేస్తున్న తీరులో ప్రచారంచేస్తూ అదే తప్పు తమ పార్టీ చెస్తే అది లోకకళ్యాణార్ధం చేసినట్లు మాట్లాడే తీరు ఎప్పుడూ ప్రశ్నార్ధకమే. అలాగే కర్ణాటకలో బిజెపికి వ్యతిరేఖంగా కక్షగట్టి చంద్రబాబు & కో ప్రచారం చేయగా లేని తప్పు ఆదాయపు పన్ను శాఖ చేసే దాడుల్లో సోదాల్లో అది శాసనాల వల్ల లభించిన అధికారాల తోనే చేస్తాయి కదా! అలా చేయగల హక్కు  శాసనలతో ఏర్పాటైన సంస్థలకు ఎప్పుడూ ఉంది. అయితే అందరిపై చేస్తున్నారా? టిడిపి వాళ్లపై నే చేస్తున్నారా? అనేది ప్రశ్నేకాదు. సందర్భమే కాదు. అది వాళ్ల చాయిస్.

Image result for AP losts all just because of Chandrababu politics on bjp

*ఒక పార్టీపై గెలిచిన శాసన పార్లమెంట్ ప్రజా ప్రతినిధులను ఆ పార్టీలకు రాజీనామా చేయించకుండా అధికార పార్టీలోకి తెచ్చుకోవటమే కాకుండా మంత్రి పదవులు యివ్వటం న్యాయమా?

*ఓటుకు నోటు కేసులో ప్రజలంతా వీక్షించిన చంద్రబాబు & రెవంత్ రెడ్ది నేరం సామాన్యమా?

*బిజెపి ప్రత్యేక హోదా యివ్వలేము - ప్రత్యేక పాకేజీ ఇస్తామన్నప్పుడు - చెలరేగిపోయి దాన్ని అంగీకరిస్తూ ప్రత్యేక హోదా సంజీవని కాదని శాసనసభ వేదికగా వెంకయ్యనాయుడి గారికి అరుణ్ జైట్లీ గారికి సన్మానం చేయలేదా?

*ఎన్నికల్లో 600 వాగ్ధానాలు చేసిన టిడిపి 60 వాగ్ధానాలు కూడ నెఱవేర్చకుండా - బిజెపిని వాగ్ధానాలు నెరవేర్చనందుకు ఆంధ్ర ప్రదేశ్ కు ద్రొహం చేసింట్లు చిత్రీకరించటం....ఇలా చెపుతూ పోతే వేలలో టిడిపి తప్పులున్నాయి.

అయితే పదే పదే చెప్పటం అదీ అందరూ టిడిపి వాళ్లు టిజిపి వాళ్లుగా మారటంతో అసలు పాయింట్ ఎన్నికల సమయానికి బలహీనమై పోవటం తధ్యం.  

Image result for babu in opposition to modi

ఏదేమైనా ఆదాయపన్ను శాఖ చెసే దాడులు టిడిపి లక్ష్యంగా జరిగినా "న్యాయం మాత్రం కాదు" అంటున్నారు. రేపు మీరు అధికారంలోకి వచ్చి వాళ్లను బయట పెట్టండి. టిడిపి ఎన్ని గోబెల్ ప్రచారాలు చేసుకున్నా "వీళ్ళు జగన్ ను మించిన నేఱగాళ్లు" అనే ముద్ర పడిపోయింది ఇప్పటికే.

Image result for AP losts all just because of Chandrababu politics on bjp 

అసలు విషయానికి వద్ధాం 

ఎన్నికల రాజకీయాలు కొత్త మలుపులు తీసుకుంటున్నాయా? వ్యూహాలు - ఎత్తుగడలు రాజకీయాలను దాటి మరింత ముందుకెళ్తున్నాయా? ఫ్యాక్షన్ తరహాలో ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రత్యర్థులపై పైచేయి సాధించే విధానాలు తెలుగు రాజకీయాల్లోకి ప్రవేశించాయా?

Image result for before modi strategy what is chandrababu

తాజా పరిణామాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఇవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఐటీ దాడుల పై కొందరు నేతలను లక్ష్యంగా చేసుకోవడం తెలిసిందే. వారు రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నారన్నదాన్ని బట్టి ఇది రాజకీయ కక్షతో జరుగుతున్న దాడులుగా చాలామంది చూస్తున్నప్పటికీ ఇందులో కొత్త కోణాలూ ఇప్పుడు బయటకొస్తున్నాయి.

Image result for before modi strategy what is chandrababu

కొద్దిరోజుల కిందట తెలంగాణలో రేవంత్ రెడ్డిపై ఐటీ దాడులు జరగడం తెలిసిందే. అక్కడ పాలక తెరాసకు సవాల్ విసురుతున్న ఆయన్ను దెబ్బతీయడానికి ఈ అస్త్రం ప్రయోగించారన్న ఆరోపణలు వినిపించాయి. అయితే తాజాగా ఏపీకి చెందిన ఇద్దరు రాజ్యసభ ఎంపీల పైనా ఐటీ దాడులు జరగడాన్ని కుట్రగా చెబుతున్నారు టీడీపీ నేతలు. ఇతర రాజకీయ పక్షాలు - ఇతర వర్గాల్లోనూ వీరిద్దరిపై దాడులకు ప్రత్యేక కారణాలున్నాయన్న మాట వినిపిస్తోంది.

Image result for AP losts all just because of Chandrababu politics on bjp

ముఖ్యంగా సుజనా చౌదరి - సీఎం రమేశ్ లు ఎవరన్నది చూస్తే ఇది నిజం కావడానికి గల అన్ని అవకాశాలూ ఉన్నాయనిపిస్తుంది. సీఎం రమేశ్ తెలుగుదేశం పార్టీలో చాలాకాలంగా చంద్రబాబు వెంట ఉంటూ చిత్తూరు జిల్లా నుంచి కడపకు మారి తెరవెనుక రాజకీయాల్లో త్వరత్వరగా ఎదిగి పార్టీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచిన నేత.

Related image

సుజనా కూడా టీడీపీకి ఆర్థికంగా అండగా ఉంటూ చంద్రబాబు మెప్పు సంపాదించి రాజ్యసభ సభ్యత్వం – కేంద్ర మంత్రి అయిన నేత. ఇద్దరూ పార్టీకి వందల కోట్లు పెట్టుబడి పెట్టినవారే. కాంట్రాక్టులు - కంపెనీలతో ఆర్జన భారీగా ఉండడంతో పార్టీకి డబ్బు పెడుతూ తాము సంపాదించుకుంటూ రాజకీయంగా - ఆర్థికంగా బలపడిన ఈ నేతలిద్దరినీ ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులు లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది.

Image result for AP losts all just because of Chandrababu politics on bjp

టీడీపీ ఎన్డీయే నుంచి బయటకొచ్చేయడం, అలాగే పొరుగు రాష్ట్రం తెలంగాణలో పాలక టీఆరెస్తో తలపడేందుకు చిరకాల ప్రత్యర్థి కాంగ్రెస్ తో కలిసేందుకు కూడా సిద్ధపడడం, అదే సమయంలో బీజేపీ - టీఆరెస్ లో అవగాహనతో పనిచేస్తుండడం తెలిసిందే. ఈ రాజకీయ లెక్కలే ఇప్పుడు బీజేపీ - టీఆరెస్ ల ఉమ్మడి ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీపై ఈ తరహా దాడులకు పురి గొల్పిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆ క్రమంలోనే టీడీపీకి ఖజానా లాంటి సుజనా - సీఎం రమేశ్ లను కేంద్ర సంస్థలను వాడుకుని బీజేపీ టార్గెట్ చేసిందని వినిపిస్తోంది.

Image result for AP losts all just because of Chandrababu politics on bjp

వాస్తవానికి ఏపీలో టీడీపీకి అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ డబ్బు - పోల్ మేనేజ్ మెంట్ ద్వారా చంద్రబాబు ఎన్నికలను తనకు అనుకూలంగా మార్చుకోగలరన్నది బీజేపీ అంచనా. పోల్ మేనేజ్మెంట్ సంగతి పక్కన పెడితే ఆర్థికంగా ఆ పార్టీకి ఇబ్బందులు పెట్టడమే ఈ దాడుల లక్ష్యంగా తెలుస్తోంది.

Related image

పోల్-మానెజ్మెంటే లక్ష్యంగా గెలిచే చంద్రబాబు ప్రజాస్వామ్య వ్యతిరేఖ విజయాలను ఇంతకాలంగా బిజెపి గమనిస్తూ వస్తుంది. ఇక్కడ ధన ప్రభావం ప్రధానం కావటంతో బిజెపి బహుశ చంద్రబాబు ఆర్ధిక మూలాలపై దెబ్బకొట్టాలని దాడులు చేస్తున్నట్లు కనిపిస్తున్నా - నేరాలు ఉంటేనే నేరాభియోగాలు ఉంటేనే ఆదాయపన్నుల విభాగం సోదాలు చెస్తుందనేది నిర్వివాదాంశం. 

మరింత సమాచారం తెలుసుకోండి: