అవును! కేసీఆర్ ఆశ‌ల‌ను సిట్టింగులే ముంచేస్తార‌నే వ్యాఖ్య‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. దాదాపు 40కి పైగా నియోజ‌క‌వ‌ర్గా ల్లో టీఆర్ ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల‌పై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంద‌ని తాజాగా ఓ నివేదిక వెల్ల‌డించింది. ముంద‌స్తు ఎన్ని క‌లకు తెర‌దీసిన తెలంగాణాలో కేసీఆర్ తిరిగి అధికారం నిల‌బ‌ట్టుకుని తెలంగాణాలో న‌వీన చ‌రిత్ర‌కు బీజం వేయా ల‌ని భావిస్తున్నారు. అయితే తెలంగాణ ఇచ్చింది మేం.. ! అనే నినాదంతో కాంగ్రెస్ కూడా అధికారంలోకి వ‌చ్చేందుకు ప్ర‌యాస‌ప‌డుతోంది. ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏదైనా జ‌ర‌గొచ్చ‌ని భావించిన కాంగ్రెస్ నాయ‌కులు మిగిలిన ప‌క్షాల‌ను కూడా క‌లుపుకొని ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. ముందుకు సాగుతున్నారు. మ‌హాకూట‌మి పేరుతో చిన్నా చిత‌కా పార్టీల‌ను సైతం క‌లుపుకొని పోతున్నారు. 


ఇది ఒక‌ర‌కంగా కేసీఆర్‌కు ఎఫెక్ట్ అవుతుందా?  లేదా ? అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. కేసీఆర్ ఈ ఎన్నిక‌ల సంద‌ర్భంగా చేసిన ప్ర‌యోగ‌మే ఆయ‌న‌కు మైన‌స్‌గా మారిపోయింద‌ని అంటున్నారు. ఎన్నిక‌ల్లో దాదాపు 100 మంది సిట్టింగ్ ఎమ్మెల్యే ల‌కు కేసీఆర్ టికెట్ ఇచ్చారు. ముఖ్యంగా మాజీ డిప్యూటీ సీఎం రాజ‌య్యకు కూడా టికెట్ ఇవ్వ‌డం వివాదానికి దారి తీసింది. ఇటీవ‌లే ఆయ‌న‌పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు సైతం వెలుగు చూశాయి. ఇక‌, మిగిలిన సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలా మందికి ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేకత ఉంది. దీనిని గ‌మ‌నించ‌కుండానే కేసీఆర్ టికెట్లు ఇచ్చారా?  అంటే ఎలా చెప్ప‌గ‌లం? అనేది వినిపిస్తున్న స‌మాధానం. కానీ, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. 


ఇటీవ‌లే ఇద్ద‌రు ముగ్గురు ఎమ్మెల్యేల‌కు ప్ర‌చారానికి వెళ్లిన‌ప్పుడు ప్ర‌జ‌లు దూషించిన‌ట్టు వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఇక‌, దాదాపు 40 స్థానాల్లో ఇదే ప‌రిస్థితి ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఈ నేప‌థ్యంలో వారిని గెలిపించ‌డం సాధ్య‌మా? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. అదే స‌మ‌యంలో ఆందోల్‌, వ‌రంగ‌ల్ వంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో సిట్టింగుల‌కు టికెట్లు ఇవ్వ‌క‌పోవ‌డం కూడా కేసీఆర్ చేసిన పొర‌పాటుగా ఇప్పుడు విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. న‌టుడు బాబు మోహ‌న్‌కు టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డం ఎఫెక్టేన‌ని అంటున్నారు. మొత్తానికి ఈ ప‌రిణామాలు కేసీఆర్‌కు మైన‌స్‌గా మారుతున్నాయ‌ని అంటున్నారు. మ‌రి కేసీఆర్ మాత్రం గెలుపుపై ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: