ఓటుకు నోటులో ఇరుక్కున్నా- బాబుకు బుద్ధిరాలేదు -కాంగ్రెస్ వాళ్ళు గుండు గీయించుకోవాలి.  ముందస్తు ఎన్నికల తరవాత కాంగ్రెస్ వాళ్ళు గడ్దం చేయించుకోవటానికి, గుండు గీయించుకోవటానికి సిద్ధంగా ఉండాలని ఓటుకు నోటు కేసు లో ఇరుక్కున్న తెలుగు దేశం కథానాయకుడు మాత్రం జైలుకు పోవటానికి చిప్పకూడు తినటానికి సిద్దమవాలని అన్నారు కేసిఆర్.


కాంగ్రెస్ నాయకుల అవినీతి పై పక్కా ఆధారాలున్నా తాము ఇప్పటి వరకు ఎవర్ని ఏమనలేదని, ఈసారి తిరిగి అధికారంలోకి వచ్చాక మాత్రం ఎవర్ని వదిలిపెట్టేది లేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. ఓటుకు నోటు కేసుల్లో ఇరుక్కున్నా చంద్రబాబుకు బుద్ధి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.  తెలంగాణ భవన్‌ లో మంగళవారం కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నీకు దున్నుకోవడానికి పొలం లేదా? ఇక్కడికొచ్చి దున్నుతావా! అని మండిపడ్డారు.
Image result for KCR says chandrababu to jail Congress to get shaved head

తెలంగాణలో ఉన్న ఆంధ్రబిడ్డలు తాము ఇక్కడివారమేనన్న భావన పెంచుకోవాలన్నారు.  తెలంగాణ ఉద్యమసమయంలో రాష్ట్రం వస్తే ఆంధ్రవాళ్ల కు ఏమో? అవుతుంద న్న లేనిపోని దుష్ప్రచారం చేశారు. మరీ రాష్ట్రం వచ్చాక ఏమైనా జరిగిందా? అని కేసీఆర్ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు వంటి వారి వల్లనే అసలు సమస్యలు వస్తున్నా యని అన్నారు. 


తెలంగాణలో ఉన్న ఆంధ్రవాళ్లకు చంద్రబాబు శనిలా దాపురించారన్నారు. టీడీపీ హయాం లో హైదరాబాద్‌ లో చిటికిమాటికి కర్ఫ్యూలు ఉండేవన్నారు. తాము అధికారం లోకి వచ్చాక  అలాంటి పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. 
Image result for KCR says chandrababu to jail Congress to get shaved head

రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారానికి వస్తే ఏమో అయిపోతుందన్నట్టుగా మాట్లాడుతున్నా రన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పుడు ఎవరు ప్రచారానికి వస్తారో తెలియ కుండానే నిర్ణయం తీసుకున్నామా? అని ప్రశ్నించారు.  ఈ కేసీఆర్ గట్స్ ఉన్నోడు ఎవరికి భయపడరన్నారు. వంద సీట్లు గెవలడం కాదు, వంద ఆరు, వంద ఏడు సీట్లు గెలుచుకోవాలని టార్గెట్ పెట్టుకున్నామన్నారు. 
Image result for KCR says chandrababu to jail Congress to get shaved head

నూటికి నూరు పాళ్లు తిరిగి అధికారంలోకి వచ్చేది తామేనని ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. డిసెంబర్‌లో చూస్తారు కదా! ఎవడెవడు గడ్డం గీసుకుంటాడో, ఎవడెవడు గుండ్లు చేయించు కుంటారోనని కేసీఆర్ ఎద్దేవా చేసారు. రాములు నాయకే కాదు, పార్టీ వ్యతిరేక కార్యకలాపా లకు పాల్పడితే ఎవర్ని సహించేది లేదని కేసీఆర్ హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: