రాజకీయ పార్టీలు పూర్తిగా వ్యాపార సంస్థలుగా మారిపోయాయి. ఉభయ తెలుగురాష్ట్రాల 'మానిఫాస్టోలు’ అంటే ఎన్నికల వాగ్ధానాల పట్టికలూ  పరిశీలిస్తే క్రింది తరగతి వైభవమే వైభవం. ఉన్నత వర్గాలకు కాంట్రక్టులను వ్యాపారాలకు లైసన్సులు పారిశ్రామిక వర్గాలకు పరిశ్రమల స్థాపనకోసం భూములు, మౌలిక సదుపాయాలు కలగజేస్తూ రాజకీయాలు మిలాకత్తై తమ వాటాలు తాము పోందుతున్నారు. ఇక మిగిలిన మద్యతరగతి తమ జీవితాలు జానకు ఎక్కువ బెత్తెడుకు తక్కువ అన్నట్లు కుక్కతోక తీరు ప్రదర్శిస్తున్నా, ఉద్యోగాలు చేస్తూ అందులో పనిచేస్తూ, సంపాదించిన జీతంపై కూడా పన్నుచెల్లిస్తూ ఈ రాజకీయ పార్టీలచే ఏర్పడ్ద ప్రభుత్వాలకు ఆర్ధికంగా దన్నుగా ఉంటుంది.

Image result for 2018-19 election manifestos of telugu states

మద్యతరగతి పై పని భారమే కాదు పన్ను భారంతో పాటు సొమరిపోతులను తమ వెన్నుపై మోయటం తప్పట్లేదు. నడుం వంగినా, వేన్ను విరిగినా వారి ఈ భారం వేసి రాజకీయం రాజ్యాధికారం సార్వభౌమత్వం ప్రదర్శిస్తుంది ఈ కుహానా ప్రజా స్వామ్యంలో. ఒక ప్రక్క జాతి సంపదను దోచుకుంటూ మద్యతరగతి స్వేదాన్ని తాగేస్తూ దేశాన్ని అప్పుల ఊబి లో తోసేస్తూ జాతిని నిర్వీర్యం చేస్తున్నాయి ప్రస్తుత ప్రభుత్వాలు. అంతే కాదు ఈ ధౌర్భాగ్యపు ఎన్నికల రాజకీయ రణక్షేత్రంలో "తరతరాలకు సరిపడా తాము సంపాదించుకుంటూ అధి కారాన్ని ఆస్తులను అనుభవిస్తూ రానున్న తరాలకు తమ వారసులనే రాజులుగా అందిస్తూన్న ఈ అపర రాజవంశాలతో నాడు మహాత్మా గాంధి అందించిన స్వాతంతాన్ని తిరిగి మరో రూపలో తమ చేతుల్లోకి తీసుకొని ప్రజలను శాశ్విత బానిసలుగా చేస్తున్నారు"


సంక్షేమ ఫలాలను అనుభవిస్తూ బిర్యాని పోట్లం, ₹2000/- నోటు, మందు మైకంలో ఎన్నికల్లో ఓట్లేసే వారొక వైపు, ఖర్మ సిద్ధాంతాన్ని నమ్ముతూ మనం ఓటేసినా వెయ్యక పోయినా మన ఖర్మ ఇంతే అంటూ ఎన్నికల రోజున ఓటేయటానికి ఇచ్చిన సెలవును వినోదం కోసం ఖర్చుపెట్టి తరవాత గాడుద చాకిరి చేస్తూ పన్నుల భారం మోసే మద్యతరగతి మరో వైపు - ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నాయి. మిగిలిన ఉన్నతవర్గాలు ప్రజా ధనాన్ని, భూములను ప్రకృతి వనరుల్ని దోపిడీ చేస్తూ, వారి స్వేధార్జనను పన్నుల రూపంలో హరిస్తూ, చెసే పాలన మరోసారి దేశాన్ని ఊబిలోకి లాగేస్తుంది.  


ఈ నిర్వీర్య ప్రయోగంలో ప్రజలు సోమరిపోతులై పనిచేసి ప్రగతి సాధించే అవకాశం కోల్పో తున్నారు ఎలా అంటే ఈ రాజకీయ పార్టీలు తమ ఆధిపత్య సాధనలో పడే పోటీ లో ప్రకటించే ఎన్నికల వాగ్ధానాలు 40% వరకున్న క్రింది తరగతి పనులు మానేసి, సంపద సృష్టి మానేసి సర్వకాలాల్లో వారుణీ వాహినిని తమ కడుపులో పోసేస్తూ ఎన్నికల్లో ఓట్లేసే పనిముట్లలా మారి పోయారు తప్ప దేశానికి కాని తమ కుటుంబాలకు గాని ఏవిధమైన ప్రయోజనాన్ని కలిగించ లేకపోతున్నారు.

Image result for KCR Babu jagan pavan uttam revanth

క్రింది తరగతి ప్రజలవి "రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు" అనే నానుడికి కాలం చెల్లిపోయింది. వీళ్ళు డొక్కని నింపు కోవటానికి గతంలో వ్యవసాయ కూలీలుగా, కార్మికులుగా, గృహావసరాలకు పనిచేస్తూ రెక్కాడిస్తూ చెసే కృషితో ఆర్ధిక రంగానికి చేయూత నిచ్చెవారు. దాంతో జాతికి సంపద సృస్టించబడేది. ప్రస్తుత పరిస్థితుల్లో ఓట్లకు నోట్లు పొందే మాయోపాయాన్ని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు బ్రీఫ్డ్ మీ తో నేర్పగా, దాన్ని వంటబట్తించుకున్న తెలంగాణా చందృడు అమలు చెసే అద్భుతమైన ఎన్నికల వాగ్ధానాల మానిఫెస్టోని తీర్చిదిద్దారు. ఇంకేం దీని ద్వారా ఓట్లెసే క్రింది తరగతి, బిపిఎల్ ప్రజలు పని చేయనవసరం లేకుండానే జీవితాలు గడచిపోతాయి. ఇది ఓట్లను దండుకోవటానికి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న రాజకీయ పార్టీల తీరుతో సంక్షేమ పథకాల పేరు తో వర్తమాన భవిష్యత్ తరాల ప్రజా జీవితాల సారాన్ని కూడా పిండుకోని తమ వారసులు పదవీ లాలసతో ఆడుకోవటానికి నేతలు వేస్తున్న ప్రణాళికలను చూస్తే ఒళ్లు జలధరించక మానదు.

Image result for KCR Babu jagan pavan uttam revanth

సగటు జీవి కిందా మీదా పడి నాలుగు రాళ్ల కోసం రోజు మొత్తం గొడ్డులా పని చేస్తుంటే. అతగాడు పని చేసిన దానికి ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇన్ కం ట్యాక్స్ వగైరా, వగైరా కట్ చేసి చేతిలో డబ్బులు పెడతారు. ఆ డబ్బుల్ని తీసుకొని ఏదైనా కొంటే, దానికి మళ్లీ జీఎస్టీ పన్ను వేస్తారు. ఇలా మొదల య్యే పన్ను బాదుడు, చివరకు రోగ మొచ్చి, ఆసుపత్రికి వెళ్లి, వైద్యం చేయించుకుంటే కూడా అక్కడా జీఎస్టీ పోటు తప్పదు. ఇలా పన్ను కట్టిన తర్వాత చేతికి వచ్చే ఆదాయానికి సైతం అదే పని గా పన్ను కట్టటం చూస్తే, పన్నులు కట్టేందుకే మన జాతి జనులు బతుకుతున్నారా? అన్న హృదయ వేదన కలగటం ఖాయం.

Image result for KCR Babu jagan pavan uttam revanth

ఇదంతా ఎందుకు?  పని చేస్తున్నందుకేగా?  గొడ్డులా పని చేస్తేనే బతుకుబండి లాగటం కష్టంగా ఉందనే వారికి, అసలు పని అనేది లేకుండానే బతికేయొచ్చు అంటే మీరంతా కామెడీగా చూస్తారు. కానీ, తాజాగా కేసీఆర్ ప్రకటించిన మానిఫెస్టో ప్రజలకిచ్చే తాయిలాల్ని చూస్తే, పని చేయాల్సిన అవసరం లేకుండానే అతి సునాయాసంగా మందు తాగుతూ తన మగువతో సంతానోత్పత్తి చేస్తూ జనాభాని పెంచుతూ ఆనందంగా బతికే పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్నారు.

Image result for KCR Babu jagan pavan uttam revanth

ఎన్నికల హామీల పేరుతో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన తాయిలాల నేపథ్యంలో ఒక సామాన్యుడి పని అన్నది లేకుండా ఎంత చక్కగా బతికేయొచ్చో చెప్పే లెక్క ఒకటి అంతర్జా లంలో వైరల్ అవుతోంది. ఆ లెక్కను చూస్తే, నిజమే కదా? అనిపించక మానదు.

Related image

ఒక ఇంట్లో వయోవృద్ధురాలైన అవ్వ, మధ్యవయసు దాటిన అమ్మా నాన్న, నిరుద్యోగి ఐన కొడుకు ఉన్నాడనుకుందాం?  వారి జీవితం ఎలా సాగుతుందన్న విషయం పరిశీలిద్ధాం:

*ఇంట్లో అవ్వకు వృద్ధాప్య పింఛన్ కింద ₹2016/-

*తల్లి బీడీ కార్మికులురాలు అయితే నెలకు ₹2016/-

*తండ్రికి వృదాప్య పెన్షన్ కింద నెలకు ₹2016/-

*ఇక ఉద్యోగం లేని కొడుక్కి నిరుద్యోగ బృతి కింద ₹3016/- లభిస్తాయి. అంటే ఈ కుటుంబానికి ₹9064/- ప్రతి నేలా వారికి ఆయాచితంగా పనిచేయకుండా ఉంటే నిరంతరం లభిస్తూనే ఉంటాయి. ఈ సంపాదనతో నలుగురు కుటుంబ సభ్యులున్న ఒక క్రింది తరగతి సామాన్యునికి గ్రామీన జీవితం ఆనందంగా గడిచి పోతుంది.

ఇంకా బోనస్ గా

Related image

*వృత్తి కార్మికుని పేరుతో గేదేలు, మేకలు, గొర్రెలు, కోళ్ళు ఇలా నిర్విరామ సంపాదన అందించే కల్ప వృక్షాలు ప్రభుత్వమే అందజేస్తుంది.

*ఇక గూడు కోసం రెండు బెడ్ రూముల వసతి గృహం, కిలో ₹1/- కి బియ్యమో లేక ఉచిత బియ్యమో దాంతోపాటు అతి తక్కువ ధరలకు రేషణ్ సామాన్లు లభించటం అదనంగా వస్తుంది.

*ఇవి కాక, వీరి సంతానానికి కెజి టు పిజి విద్య ఉచితం.

*ఆరోగ్యాని వైద్యం ఉచితం,

*స్త్రీ సంతాన వివాహానికి విభిన్న ప్రయోజనాలు ఇచ్చే పధకాలు ఉండనే ఉన్నాయి.

*మూడు తరాలుగా ఉంటున్న ఇంటికి కనీసం రెండు ఆప్లికేషన్లు పెట్టుకున్నా రెండు ఇళ్లు. అందులో ఒక ఇల్లు అద్దెకు ఇచ్చేస్తే, దాని అద్దె అదనపు ఆదాయం అవుతుంది.

*అప్పుడప్పుడూ తక్కువ ధరల్లో వస్త్రాలు చీరలు కూడా ఈ పధకాల్లో ఉన్నాయి.

ఈ తరగతులకు చదువుకోటం నైపుణ్యం పెంచుకోవటం పెద్దగా అవసరంలేదు కారణం వారికి "రిజర్వేషన్లు" ఉండనే  ఉన్నాయి కదా! ఇందులో కూడా "నీరసం, సోమరితనం" పెంచటమే ప్రభుత్వాల లక్ష్యం.   

Image result for free bees in telangana elections 2018

అంతే కాకుండా, ఈ చిన్న కుటుంబానికి ఒకవేళ రెండు ఎకరాల పొలం ఉందనుకుంటే, పంట పండించే అలవాటు కూడా లేదనుకున్నా, వారి సోమరిగా బ్రతకటానికి  ఎలాంటి ఇబ్బందేమీ కలగదు.


ఎలా అంటే....

*ఏటా ఎకరా వ్యవసాయ భూమికి ₹10000/- చొప్పున ₹20000/- వస్తాయి.

*ఇవి కాక.. ఎకరానికి హీనంగా వేసుకున్నా ₹15000/-చొప్పున కౌలు ఆదాయం వస్తుంది. అంటే రెండెకరాలకు ₹30000/- ఆదాయం అన్నమాట. (ఒక సంవత్సరానికి  వచ్చే మొత్తం ₹55000/).  అంటే.. పొలం మీద ఎలాంటి కష్టం లేకుండా నెలకు రమారమి  ₹5000/-

పైన చెప్పిన ₹10000/-వేలకు మరో ₹5000/- ఏమీ చేయకుండా బియ్యం, రేషన్, బట్టలు మొత్తం కలిపి నేలకు ₹15000/-   ఆదాయం అన్నమాట. అంటే రోటీ, కపడా, మఖాన్, విధ్య, ఆరోగ్యం సర్వం ఉచితం.


దీనికి తోడు,

*ఉద్యోగం లేని కుర్రాడు పెళ్లి చేసుకుంటే, సదరు భార్య ద్వారా వచ్చే కల్యాణలక్ష్మి మొత్తం అదనం.

*ఒకవేళ పిల్లల్ని కంటే కేసీఆర్ కిట్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎలాంటి పని చేయకుండా ప్రభుత్వం ఇచ్చే పథకాల్ని వినియోగిస్తేనే హ్యాపీగా బతికేయొచ్చు అంటారు. మీరేమంటారు?

Image result for telugu state Governments in the process of making its people lazy

ఎవడ్రా! పని చేస్తే కానీ బతలేరంది? ఒక మద్య తరగతి వాడు మాత్రమే గొడ్డులా పని చేస్తూ ఈ భారాన్ని మోస్తూ ఉండాల్సిందే.  ఇంక సంపాదనా పరంగా ఒక క్రింది తరగతి వ్యక్తి ఏపని చేయకుండా మందేసు కోని వినోదం కోసం పెళ్ళాం తో సంసారం చేస్తూ పిల్లల్ని కంటే చాలు!  పిల్లల్ని ఎందుకు కనాలంటే భవిష్యత్ లో ఈ రాజకీయ పార్టీ నాయకుల వారసులు పాలించాలంటే ప్రజలు.... సారీ! ఓటర్లు కావాలి గదా!  

Image result for Andhra Telangana Low Income Group is going to become lazy fellows by election manifestos

మరింత సమాచారం తెలుసుకోండి: