వెనక నుండి బలంగా వేటేసి స్వంత మామ చేతి లోని పార్టీ అధికార పగ్గాలను గుంజేసు కొన్ననాటి నుండి నాలుగు దశాబ్డాల సుధీర్గ రాజకీయ అనుభవం గడించిన, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై ఒక దశాబ్ధం కూడా అనుభవం లేని వైసీపీ అధినేత జగన్మోహన రెడ్డి సునామీలా విరుచుకుపడ్డారు. తన ప్రజాసంకల్ప యాత్ర మార్గంలో ఆయన విజయనగరం జిల్లా బొబ్బిలి లో పాదయాత్ర చేస్తున్న జగన్మోహన రెడ్డి  అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ముఖ్యమంత్రి చంద్రబాబును కడిగి పారేశారు.

 Image result for mahishasura vs mahishasura mardini

గత ఎన్నికలకు ముందు బొబ్బిలిలో 100 పడకల ఆస్పత్రి నిర్మిస్తానని వాగ్ధానం చేసిన నారా చంద్రబాబు నాయుడు ఆ ఆస్పత్రిని ఎక్కడ నిర్మించారో? చెప్పాలని డిమాండ్ చేశారు.  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో బొబ్బిలి నియోజక వర్గంలో 38150 ఇళ్లు నిర్మిస్తే తెలుగుదేశం పాలనలో ఒక్క ఇల్లైనా నిర్మించారా? అని ప్రశ్నించారు.

Image result for mahishasura vs mahishasura mardini

అభివృద్ధి కోసం పార్టీ మారాను అని చెప్తున్న మంత్రి సుజయ కృష్ణ రంగా రావు ఊరికి నాలుగు ఇళ్లు అయినా ఇప్పించారా? ఎవరి అభివృద్ధి కోసం పార్టీ మారావు నీవు? అని జగన్మోహన రెడ్డి నిలదీశారు. బొబ్బిలి నియోజకవర్గంలో పాలన ఎంతో అధ్వాన్నంగా ఉందని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా నారావారి పాలనను, నాటి మహిషాసురు ని పాలనతో పోల్చుతూ - జగన్ సోదాహరణంగా ఒక పాయింట్ చెప్పారు. దసరా పండుగలో మహిషాసుర సంహారం  చేసి సురాజ్యస్థాపన చేసిన మహిషాసురమర్ధిని లాగా ఈ రాష్ట్రంలో ఈ నారాసుర పాలనను కూడా తుదముట్టించాలని ప్రజలు ఆదుర్గా దేవి శక్తిలా ఆ పని చేయాలని పిలుపు నిచ్చారు. గతంలో మహిషాసరుడు రాక్షసుడు అయితే, ఇప్పుడు ఈ నారాసురుడు అంతకు మించిన దానవుడయ్యాడంటూ ధ్వజమెత్తారు. 

Image result for chandrababu as narakasura

చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఏ గడ్డి అయినా తినడానికి వెనుకాడరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం ఏ పార్టీతో నైనా పొత్తుపెట్టుకు నేందుకు సిగ్గు పడడని,  ఆ సంధర్భంగా సిద్ధాంతాలు విధానాలు మూలాలు అన్నీ పట్టించు కోరని కనీస మర్యాద కూడా మర్చిపోతారని మండిపడ్డారు.

 


ఏ వ్యవస్థనైనా తనకు తగ్గట్తు మేనేజ్ చెయ్యడానికి, జాతికి దేశానికి ఎంత నష్టం జరుగుతున్నా ఎలాంటి సిగ్గుఏగ్గూ ప్రదర్శించ రంటూ తూర్పారబట్తారు.  అధికారం కోసం ఎన్ని అబద్ధాలు చెప్పడానికైనా, అడ్దదారులు తొక్కటానికైనా వెనకడుగు వేయరని అన్నారు. ఆ కాలంలో ఆ రాక్షసుడు మహిషాసురుడైతే ఈ కాలంలో రాక్షసుడు నారాసురు డంటూ పోల్చారు.

 

దేవుడు ఇచ్చిన పవిత్ర శక్తులను దౌర్జన్యాలకు దుర్మార్గాలకు అబద్ధాలకు ఈ మహిషా సురుడు వినియోగిస్తే, ప్రజలు ఇచ్చిన హక్కులను, అధికారాలను  కాల రాస్తూ వైసీపీ జండా కింద గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల ను కొన్నట్లు ప్రలోభాల వలలో చిక్కించుకొని కొనేసి రాజ్యాంగ ధర్మానికి  తూట్లు పొడిచారంటూ మండి పడ్డారు.

 Image result for chandrababu as asura

నాడు మహిషాసరుడెక్కడ అడుగేస్తే అక్కడ అంధకారం ఆవరిస్తుందని, ఈ నారాసురుడు ఎక్కడ కాలుపెడితే అక్కడ కరువు తాండవం ఆడుతుందని అలాగే ప్రకృతి విపత్తులు ముంచుకొస్తాయని జగన్మోహన రెడ్డి ధ్వజమెత్తారు

మరింత సమాచారం తెలుసుకోండి: