Image result for rahul gandhi rafale deal
రాహుల్ గాంధికి నరేంద్ర మోడీపై పిర్యాదు లేవీ లేనట్లుంది. ఎప్పుడు రాఫేల్ డీల్ పైనే మాట్లా డుతూ ఉంటారు. ఆయన ఈ విషయాన్ని ఇక చట్టాలకు వదిలేసి, మిగతా విషయాలపై దృష్టి సారించితే,  ఆతనికే మంచిది. ఆయన పార్టీ కూడా పుంజుకునే విషయాలపై శ్రద్ద పెడితే ఇంకా మంచిది.  రాహుల్ గాంధీ వివాదస్పద ‘రాఫెల్ డీల్’ ను ఏ మాత్రం వదలకుండా సజీవంగా ఉంచటానికి తన సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ డీల్ ద్వారా నరేంద్ర మోడీ ఏకంగా అనిల్ అంబానీ జేబు లో ₹ 30వేల కోట్లు వేసేశారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. దానికి బదులు తాను రిసెర్చ్ చేసి తనవాదనకు సానుకూల ఋజువులు హోం వర్క్ చేసి సాధించితే మంచిది. 


రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అంత అత్యవసరంగా ఫ్రాన్స్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది?  ఇది రాహుల్ గాంధీ ప్రధాన ప్రశ్న. ఆయన ఇటీవల ఢిల్లీలో మీడియా మాట్లాడుతూ, అనిల్ అంబానీ కంపెనీ ఆప్-సెట్ భాగస్వామిగా ఉంటేనే ఒప్పందం ఖరారు చేసుకుంటామని, భారత్ ప్రభుత్వం షరతులు పెట్టినట్లు ఫ్రాన్స్ పత్రిక ‘మీడియా పార్ట్‌’  వెల్లడించినట్లు వార్తలు వెలువడ్డాయని అన్నారు.
Image result for rahul gandhi rafale deal
ఈ సమయంలో రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ పర్యటన ఆసక్తిని రేపుతోందని, దసా ఏవియేషన్‌ ఫ్యాక్టరీకే ఎందుకు వెళ్తున్నారని రాహుల్ ప్రశ్నించారు. రాఫెల్‌ కాంట్రాక్ట్‌, దసాకి ఇవ్వడానికి  రిలయన్స్‌ డిఫెన్స్‌ సంస్థ ను తప్పని సరిగా భాగస్వామిని చేసుకోవాలని వత్తిడి చేయటంతోనే అలా చేయాల్సి వచ్చిందని ఆ కంపెనీ డిప్యూటీ సీఈఓ చెప్పారని ఫ్రెంచ్‌ మీడియాలో వచ్చిన కథనాలను ఉదహరించారు.


కేవలం ఈ కాంట్రాక్టుకు 10రోజుల ముందే అనిల్‌ అంబానీ, "రిలయన్స్ డిఫెన్స్‌ సంస్థ"  ను అనిల్ ఆద్వర్యంలోని అడాగ్  ఏర్పాటు చేసిందని వెల్లడించారు. కాంట్రాక్ట్‌ వారికే అప్పగించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ రిలయన్స్‌ జేబు లో ₹ 30 వేల కోట్లు వేశారని ఆరోపించారు. నరేంద్ర మోదీ దేశానికి ప్రధాని కాదని, అంబానీలకే ప్రధాని అని ఎద్దేవా చేశారు. 
Image result for rahul gandhi rafale deal
భారత ప్రభుత్వం ఏం చెప్పమంటే అదే చెప్పేలా దసా కంపెనీపై తీవ్రమైన ఒత్తిడి ఉందని ఆరోపించారు.  మీడియాపైన కూడా ఇదే రకమైన ఒత్తిడి తీసుకొస్తున్నారని విమర్శించారు. గతంలో ఫ్రెంచ్‌ పోర్టల్‌ ‘మీడియా పార్ట్‌’ లో వచ్చిన కథనాల ప్రకారం దసా కంపెనీ తప్పనిసరిగా రిలయన్స్‌ తో జోడీ కట్టాల్సి వచ్చిందని రాసిందని పేర్కొ న్నారు. ప్రతిపక్షం డిమాండ్‌ చేస్తున్నట్లు ఈ వ్యవహారంపై నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎందుకు దర్యాప్తు చేయించటం లేదని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: