అంతా అనుకున్నట్లే జరుగుతుంది. కష్టపడ్దారు, సాగదీశారు, నాంచి నాంచి మురిగిపోతున్న పరిస్థితుల్లో సోనియాసుతుణ్ణి అంటే రాహుల్ గాంధిని కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడి గా చేసేశారు. కానీ,  రాహుల్ గాంధీని కాంగ్రెస్ మాత్రం ప్రధాని అభ్యర్థి అని ప్రకటించలేక పోవటం మాత్రమే కాదు, అంగీకరించ లేక పోతున్నారు కాంగ్రెస్ జనాలు. తమ పార్టీకైతే అధ్యక్షుడిగా చేసుకున్నంత అతితేలికగా రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి అభ్యర్థిని చేయలేమని బిఎస్పి, టిఎంసిలాంటి పార్టీల ప్రవర్తనతో కాంగ్రెస్ కు సంపూర్ణం గా అర్థం అయ్యింది. 
Image result for rahul Prime ministerial congress

Congress has not “officially” said Rahul should be installed as PM, says Chidambaram

Image result for mayawati mamata banerjee

ప్రధాని అభ్యర్థి అని రాహుల్ గాంధి పేరును ప్రకటించేస్తే జనాలు ఓట్లు వేయడం సంగతలా ఉంటే, తాము మిత్రులు అనుకుంటున్న వాళ్లంతా దూరం జరుగుతారని కాంగ్రెస్ కు స్పష్టత వచ్చింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధి తమ ప్రధానమంత్రి అభ్యర్థి కాదు, అని నిర్ద్వంధంగా ప్రకటిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. రాహుల్ గాంధిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే ఆలోచన ఏమీ లేదని వీరు స్పష్టం చేస్తున్నారు.
 Image result for mayawati mamata banerjee
ఇది వ్యూహాత్మక ప్రకటన మాత్రమే కాదు, ఒకరకంగా రాహుల్ గాంధి విషయంలో కాంగ్రెస్ కు కూడా ఏ మాత్రం నమ్మకంకాని, భ్రమలు కాని లేవట. రాహుల్ గాంధిని  ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే, తమతో ఇతర పార్టీలేవీ కలిసిరావని కాంగ్రెస్ కు భయం పట్టుకుంది. రాహుల్ గాంధి నాయకత్వంలో పని చేయడానికి మాయావతి బహుజన సమాజ్ పార్టీయే కాదు చివరకు మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కూడా కలిసిరావని కాంగ్రెస్ కు తేటతెల్లమైందట. బీజేపీని ఓడించాలని ఆ పార్టీలకు ఉన్నా, దానికోసం రాహుల్ గాంధిని నెత్తిన పెట్టుకోనే సాహసం డిగట్టే స్థితిలో ఆ పార్టీలు సిద్ధంగా లేవు. అందుకే కాంగ్రెస్ పార్టీ చివరకు చేతులు ఎత్తేసింది. రాహుల్ ప్రధాని అభ్యర్థి కాదని తేల్చేసింది.
Image result for rahul Prime ministerial congress
మరి ఇంతకీ రాహుల్ గాంధి కాకపోతే ప్రధాని అభ్యర్థి ఎవరు? అంటే, ఆ విషయం ఇప్పటికిప్పుడే తేల్చమని ఎన్నికల ఫలితాల తర్వాత మిత్రపక్షాలతో చర్చించి తేలుస్తా మని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. ఒక వేళ రాహుల్ కాపోతే ఎక్స్, వై , జెడ్ ప్రధాన మంత్రి అభ్యర్ధి అనగానే పార్టీ కూలిపోవటం ఖాయం అని తెలుసు కాబట్టి  ప్రస్తుతానికి మిన్నకుండి పోవటం వినా గత్యంతరం లేదు. అయినా అంత వరకూ వస్తుందా వ్యవహారం?

Image result for mayawati mamata banerjee

పై లిస్ట్ లోని వాళ్లంతా ప్రధాన మంత్రి కావాలని ఉబలాటపడే వాళ్ళే

మరింత సమాచారం తెలుసుకోండి: