సీబీఐలో సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సీబీఐ ఇన్-చార్జ్ డైరెక్టర్‌గా తెలుగు వ్యక్తి మన్నెం నాగేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించారు ప్రధాని నరేంద్ర మోడీ. మంగళవారం (అక్టోబరు 23) రాత్రి అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన ప్రధాని మోడీ, రాత్రికి రాత్రే సీబీఐ బాస్‌ను మార్చేశారు.
Image result for mannem nageswara rao New CBI Director
ప్రస్తుతం సీబీఐ జాయింట్ డైరెక్టర్‌ హోదాలో పనిచేస్తున్న నాగేశ్వరరావు వరంగల్‌ జిల్లావాసి. మంగపేట మండలం బోర్‌ నర్సాపూర్ గ్రామం ఆయన సొంతూరు. 1986 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన నాగేశ్వరరావు, ఒడిషా క్యాడర్‌కు చెందిన వ్యక్తి, వివిధ హోదాల్లో పనిచేయడంతో పాటు ఒడిషా డీజీపీ గా కూడా పనిచేశారు. 
Image result for mannem nageswara rao New CBI Director
Mannem Nageswara Rao & his wife Mannem Sandhya

ప్రస్తుతం సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న అలోక్‌వర్మకు స్పెషల్ డైరెక్టర్ ఆస్తానాకు మధ్య అవినీతి పోరు నడుస్తుండడంతో ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకుంది. పరిస్థితిని సమీక్షించిన ప్రధాని,  డైరెక్టర్ బాధ్యతల నుంచి అలోక్ వర్మను తప్పించారు. మన్నెం నాగేశ్వరరావు వెంటనే సీబీఐ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.


గతంలో సీబీఐ డైరెక్టర్‌గా పనిచేసిన కె.విజయరామారావు తర్వాత తెలుగు అధికారికి మరోసారి సీబీఐ డైరెక్టర్ అవకాశం దక్కింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: