Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 1:58 am IST

Menu &Sections

Search

సిబిఐ ని కూడా మానేజ్ చేసే స్థాయి కెదిగిన టిడిపి - సానా సతీష్ బాగోతం లో సిఎం రమేష్

సిబిఐ ని కూడా మానేజ్ చేసే స్థాయి కెదిగిన టిడిపి - సానా సతీష్ బాగోతం లో సిఎం రమేష్
సిబిఐ ని కూడా మానేజ్ చేసే స్థాయి కెదిగిన టిడిపి - సానా సతీష్ బాగోతం లో సిఎం రమేష్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అవినీతి తెలియని వాళ్ళకు అది నేర్పగల అత్యంత సమర్ధులు మన టిడిపి వాళ్లు. అలాంటి వాళ్లనే అవినీతి ద్వారా సిబిఐ కేసులో ఇరికించిన వాడు మామూలోడు కాదు తాడిని తన్నేవాడై ఉంటాడు. మాంసం వ్యాపారి 'మొయిన్ ఖురేషీ' మనీ లాండరింగ్ కేసును నీరుగార్చేందుకు తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుడు ఈ మద్య సిబి ఐ దాడుల్లో ₹800 కోట్ల అక్రమ లెక్కచూపని ఆస్తులు, సంపాదన కలిగిఉన్నట్లు బయటపడ్డ సీఎం రమేష్ పేరు ప్రస్తావనకు రావడం ప్రస్తుతం రాజకీయంగా టీడీపీకి ఇబ్బందిగా పరిణమించింది. 
 
మెయిన్ ఖురేషీ మనీలాండరింగ్ కేసును సాంద్రత తగ్గించి క్రమంగా మరుగున పడేసేందుకు సీబీఐ అత్యున్నత అధికారి ఒకరు ₹2 కోట్లు లంచం తీసుకొన్నారని ఆరోపణ లు వచ్చాయి.ఈ విషయమై మరో సీబీఐ అత్యున్నత అధికారి బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఈ విషయమై ఎఫ్ఐఆర్ కూడ నమోదైంది. అయితే ఈ కేసులో మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీకి మద్దతుగా 'సతీష్ సానా' రంగం లోకి దిగినట్టుగా సీబీఐ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది ఆగష్టు 24వ తేదీన హైద్రాబాద్‌కు చెందిన సతీష్ సానా ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ను  సీబీఐ స్పెషల్  డైరెక్టర్  రాకేష్ ఆస్థానా కేంద్ర కేబినెట్ సెక్రటరీకి ఫిర్యాదు చేశాడు.
national-news-satish-sana-cold-war-in-cbi-cm-rames
సీబీఐ ఉన్నతాధికారి ఒకరు, మొయిన్ ఖురేషీ కేసును నీరుగార్చేందుకు టీడీపీ ఎంపీ సీఎం రమేష్  ద్వారా   ప్రయత్నాలు సాగించారని, ఈ మేరకు  సతీష్ సానా సీఎం రమేష్‌తో చర్చించారని ఆ ఫిర్యాదులో  పేర్కొన్నారు. ఈ కేసులో  ఈ ఏడాది అక్టోబర్ 15వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదైంది. మధ్యవర్తి ద్వారా లంచం రూపంలో  ₹2 కోట్లను అడ్వాన్స్‌గా తీసుకొన్నారని సీబీఐ అధికారులు గుర్తించి కేసు నమోదు చేశారు.


ఈ కేసులో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ తో పాటు  సతీష్ సానా కీలకంగా వ్యవహరించారని సీబీఐ ఆరోపిస్తోంది.  ఇదిలా ఉంటే ఈ ఏడాది సెప్టెంబర్ 20వ తేదీన సతీష్ సానా ను అరెస్ట్ చేసి విచారణ చేయాలని భావించారు. ఈ మేరకు అనుమతి కోసం సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ వద్దకు ఫైల్ ను పంపారు. అయితే ఈ ఫైల్ ను అలోక్ వర్మ తన వద్దే ఉంచు కొన్నాడు.
national-news-satish-sana-cold-war-in-cbi-cm-rames
ఈ విషయం ఉప్పందుకొన్న సతీష్ సానా సెప్టెంబర్ 25వ తేదీన దుబాయ్‌కు పారిపోవాలని ప్రయత్నించాడు. కానీ, ఎయిర్‌పోర్ట్‌ ల్లో 'లుకౌట్ నోటీసు' జారీ చేయడంతో సతీష్ తప్పించుకొనే పరిస్థితి లేకుండా పోయింది. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 27వ తేదీన సతీష్ సానా ఈ కేసు విచారణ అధికారితో ఫోన్‌ లో మాట్లాడాడు. తనపై ఎందుకు లుకౌట్ నోటీసును జారీచేశారని ప్రశ్నించారని  సమాచారం. కేసు విచారణలో పాల్గొనాల్సిందిగా విచారణాధికారి సతీష్కు ఫోన్ లో చెప్పారు. ఈ ఏడాది పిబ్రవరి 21నుండి  విచారణకు ఎందుకు హాజరు కాలేదనే విషయాన్ని ఆయన ప్రశ్నించారు.


దీంతో  సతీష్ సానా  విచారణ అధికారి ముందు ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీన హాజరయ్యారు.  ఈ సమయంలో ఈ ఏడాది ఏప్రిల్, మే మాసాల్లో  టీడీపీ ఎంపీ  ద్వారా సీబీఐ డైరెక్టర్‌ను మేనేజ్ చేసినట్టుగా స్టేట్ మెంట్ ఇచ్చారని సీబీఐ వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. ఆ మరునాడే అక్టోబర్ 4వ తేదీన ఈడీ అధికారుల ఎదుట సతీష్ హాజరయ్యారు.
national-news-satish-sana-cold-war-in-cbi-cm-rames
అక్టోబర్ 4నుండి 15వ తేదీ వరకు ఈడీతో పాటు ఎంపిక చేసిన సీబీఐ అధికారుల కనుసన్నల్లో సతీష్ పనిచేశారని సీబీఐ గుర్తించింది. సతీష్ ఇచ్చిన తప్పుడు సమాచారం ఆధారంగా  కేసు నమోదు చేసినట్టు కనుగొన్నారు. ఇదిలా ఉంటే ఖురేషీ కేసును నీరుగార్చేందుకు సీబీఐ ఉన్నతాధికారిని తాను మేనేజ్ చేసేందుకు ప్రయత్నించినట్టుగా వస్తున్న వార్తలను టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఖండిస్తున్నారు.ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని ఆయన ప్రకటించారు.


సిబిఐ అధికారుల మద్య ఇంత గొడవకు కారణమైన సతీష్ సానా ఎవరు? 


సీబీఐలో అత్యున్నత అధికారుల  మధ్య కొనసాగుతున్న ప్రచ్ఛన్నయుద్ధంలో   సానా సతీష్ బాబు పేరు  ప్రముఖంగా విన్పిస్తోంది. అసలు సానా సతీష్ ఎవరనే చర్చ ప్రస్తుతం అందరినీ వేధిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సతీష్ ప్రస్తుతం  హైద్రాబాద్‌లో నివాసం ఉంటున్నాడు.  తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన సతీష్ బాబు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌ లో పాలిటెక్నిక్ పూర్తి చేసి, తర్వాత విద్యుత్ శాఖలో ఉద్యోగిగా చేరారు.  ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన కొద్ది కాలానికే ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాడు.


హైద్రాబాద్‌ కు  తన  నివాసాన్ని మార్చి స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాడు, బహుముఖంగా విస్తరించాడు  . రాసామా ఎస్టేట్స్‌, గోల్డ్‌కోస్ట్‌ ప్రాపర్టీస్‌, మ్యాట్రిక్స్‌ నేచురల్‌ రిసోర్సెస్‌, తూర్పు గోదావరి బ్రూవరీస్‌ కంపెనీలకు ఆయన డైరెక్టర్‌గా కొనసాగుతున్నారని సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న కాలంలో సతీష్ ఆయనతో సన్నిహితంగా ఉండేవాడని  ఆనాడు ప్రచారంలో ఉంది.

national-news-satish-sana-cold-war-in-cbi-cm-rames

జగన్ అక్రమాస్తులో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిమ్మగడ్డ ప్రసాద్‌తో కూడ సతీష్‌కు  సంబంధాలు ఉన్నాయని  చెబుతుంటారు. మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీ కేసులో  సతీష్‌కు సంబంధాలు ఉన్నాయని సీబీఐ గుర్తించింది.  2015లో సతీష్‌ పేరును మొయిన్ ఖురేషీ కేసులో  సీబీఐ చేర్చింది. సీబీఐ  కేసుల్లో సతీష్ మధ్యవర్తిగా వ్యవహరించారనే ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి. గతంలో హైద్రాబాద్ కు చెందిన ఒక వ్యాపారిపై సీబీఐ కేసు నమోదు చేస్తే, బెయిల్ ఇప్పించేందుకు  ప్రయత్నించారని ఆయనపై అప్పట్లో ఆరోపణలు కూడ వచ్చాయి.

national-news-satish-sana-cold-war-in-cbi-cm-rames

ఎమ్మార్ కేసులో సతీష్ మధ్యవర్తిత్వం చేశారని చెబుతుంటారు. హైద్రాబాద్‌లోని గచ్చిబౌలిలోని  ఐఎస్‌బీ సమీపంలోని  హిల్‌రెడ్డిలో గల 72 నెంబర్ విల్లాలో  సతీష్ నివాసం ఉంటున్నారు.  ఈ ఇంటికి వెళ్లిన మీడియా ప్రతినిధులకు  సార్ లేరని సమాధానం వస్తోం

national-news-satish-sana-cold-war-in-cbi-cm-rames

national-news-satish-sana-cold-war-in-cbi-cm-rames
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టిఎస్ ఆర్టీసి ఉద్యోగులను ‘సెల్ఫ్ డిస్మిస్’ అయ్యారన్న కేసీఆరే ‘సెల్ఫ్ డిస్మిస్ అయిపోతారా?’
మోడీ పై దాడి - ఈ రేంజ్ లో మోడీ శతృవులు కూడా కేంద్రంపై దాడి చేయలేదేమో!
పాన్ ఇండియా హీరోగా స్థిరపడ్డ ప్రభాస్ - ప్రాంతీయ హీరోగా మిగిలిపోయిన చిరంజీవి
బాబోర్లకు దిమ్మదిరిగి బొమ్మ కనిపిస్తుందట – మరేంచేస్తాం! మనకప్పుడు అధికారమధంలో కళ్ళు కనపళ్ళేదు!
కేసీఅర్ ప్రభుత్వ పతనం ప్రారంభమైందా! ఇదే దానికి చిహ్నం!
అబద్ధాలాడే కేసీఆర్ ది పక్కా దోర మనస్తత్వం : విజయశాంతి & ప్రొ. కోదండరాం
తలసాని, పువ్వాడ లాంటి అవకాశవాదులకు నిలయం కేసీఆర్ కాబినెట్: ఆర్టీసీ ఉద్యోగులు
కేసీఆర్ చెవిలో ఇక ప్రతిక్షణం రాజకీయ బాజా మోతలే!
ఇదే ఆర్ధిక మాంద్యం దెబ్బ - నడి సముద్రంలో పరిశ్రమ ! కల్లోల కడలిలో ఆటోమొబైల్ ఉద్యోగులు
కేసీఆర్ పాలనకు కష్టకాలం దాపురించినట్లేనా! నగరవాసులు సున్నం పెట్టటానికి రడీగా ఉన్నారా!
ఆర్థిక మాంద్యమా! నీవెక్కడ? 3 సినిమాల లాభాలే సాక్ష్యం!
“శ్రీరాముడిని వదిలేసినా! శ్రీరాముడు వదిలేసినా!” మునిగిపోక తప్పదు
ఆర్టీసీ తరవాత కేసీఆర్ లక్ష్యం రెవెన్యూయేనా? అయితే జనం ఓట్లు కేసీఆర్ కే!
వివాహేతర సంభందం నేఱం కాదన్న, సుప్రీం తీర్పు శిరోధార్యమా?
ముద్దు ముద్దుకు తేడా ఉంది - మురిపించే అదృష్టం నాకే ఉంది
కేసీఆర్ పాలనలో ఓటర్లు కూడా 'సెల్ఫ్-డిస్మిస్' అవుతారేమో? : విజయశాంతి
వజ్రం లోపల మరో వజ్రం - ప్రపంచ అద్భుతం
పొరుగు దేశాలు - పాక్, చైనా - రెండింటికి భారత్ తీవ్ర హెచ్చరిక
అన్నీ మంచి శకునములే: మందగమనం ఉన్నా భవిష్యత్ ఆశాజనకం: ఐటీసి
జగన్ పై ప్రతిపక్షాల పొగడ్తల వరద - హుజూర్నగర్ ఉపఎన్నిక మద్దతులో టీఅరెస్ కు సీపీఐ ఝలక్?
About the author