ఏపి రాష్ట్ర రాజకీయ భవిష్యత్ పై "ఆపరేషణ్ ద్రవిడ, ఆపరేషణ్ గరుడ.... అంటూ దాదాపుగా ఒక సంవత్సరం పైగా సినీనటుడు శొంఠినేని శివాజి చేస్తున్న వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిజమేనా? అన్నది విచారణ జరిపించాలి. అవసరమైతే రాజ్యాంగ వ్యవస్థలైన శాసన, న్యాయ వ్యవస్థలను ఉపయోగించుకొని దాని అంతేమిటో చూడాలి.
Image result for sivaji's operation garuda
చంద్రబాబు కూడా పదేపదే 'ఆపరేషన్ గరుడ' అంటూ తనవైఫల్యాలను సవరించుకుంటున్నారు ప్రజలకు గుండెదడ తెచ్చే శివాజి వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన ఎందుకు ఇవ్వదు?ఇందులోనిజమెంత? సాక్యాలున్నాయా? ఉంటే వాటిని బహిర్గతం చేసేవరకు మీడియా వత్తిడి తేవాలి. 


ముందు శివాజి చెప్పేదానిలో నిజమెంత? ఆయన విధానాలు చూస్తుంటే ఆయన దేశం కోసం, ప్రజలకోసం, దక్షిణ భారతం కోసం, ఆంధ్రప్రదేశ్ కొసం లేదా తన సామాజిక వర్గ రాజకీయ సుస్థిరత కోసం - వీటిలో వేటి కోసం అంతగా వేదన పడుతున్నారనేది  మాట్లాడుతున్నారు?  అనేది ప్రధాన ప్రశ్న- అందుకు ఆయన కున్న అర్హతలేమిటి? సాక్ష్యాదారాలు ఉన్నాయా? మీడియా ఆయన చెప్పింది ప్రమోట్ చేస్తుంది గదా! అని నోటికొచ్చింది చెపితే డేశ శ్రేయస్సుకు అంత మంచిది కాదు.
Image result for sivaji's operation garuda
ఎలాంటి పరిస్థితుల్లోనైనా డేశ విభజనకు దారి తీసే వ్యాఖ్యలు శాంతి భధ్రతలకు మంచిది కాదు. ఈయన ఇలాగే మాట్లాడితే సమాజం కులాల ప్రాతిపధికన నిలువునా చీలే ప్రమాదముంది. ఇప్పటికే ఒక సమగ్ర రాష్ట్రం,  ప్రాంతం ప్రాతిపధికన నిలువుగా చీలి పోయింది. ఖచ్చితంగా ఇది రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప ప్రజల జీవన వికాసం కోసం మాత్రం కాదని నాలుగున్నర సంవత్సరాల్లో ఋజువైంది. 
Related image
నలుగురున్న ప్రతి చోటా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చర్చించుకోవటం ఆనవాయితీగా వుంటూ వస్తుంది. ఆయనేదో త్యాగం చేస్తున్నట్లు మాట్లాడటం అందులో ఆలోచన కంటే ఆవేశం ముందుగా పరుగులు తీస్తున్నట్లు కనిపించటం సాధారణ ప్రజలనే కాదు రాజకీయ విశ్లేషకులను కూడా అబ్భురపరుస్తుంది. కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలు విడివిడిగా కాని కలిసిగాని ఆధారాలకోసం ఆయన్ను ప్రశ్నిస్తే మంచిది.
Related image
నాలుగు లక్షల కోట్లరూపాయల ప్రజాధనానికి లెక్కలు చెప్పాల్సిన అవసరం ఖర్చు పెట్టినవారికి ఎప్పుడూ ఉంటుంది. దాని కోసం నోటీసులు రావటం లో తప్పేముంది. నోటీసుకు చెప్పాల్సింది సమాధానం మాత్రమే. రాష్ట్రంలో కలకలం సృష్టించటం సమాధానం కాదు కదా! గోటితో పోయేదానికి గొడ్దలెందుకు? జస్ట్ ఒక సమాధానం సంబంధిత శాఖ ఇస్తే సరిపోతుంది. మొత్తం ఒక పార్టీ ప్రజాప్రతినిధులు - మంత్రిమండలి స్పందించనవసరం ఉందా? అలా జరిగితే నిర్ద్వందంగా అందులో నేఱం దాగున్నట్లే. 
 Image result for sivaji's operation garuda
చంద్రబాబు అసమర్ధుడా? కుట్ర జరిగితే ఊర్కోవటానికి. ఆయన నిప్పు, నిజాయతీపరుడు, ప్రతిక్షణం ప్రజాశ్రేయస్సే ఆయన జీవితం.  రోజుకు 20 గంటలు నిర్విరామంగా చేతికి గడియారం, వేళ్లకి ఉంగరాలు, జేబులో రూపాయి, కంటికి నిద్ర, కడుపుకు తిండి లేకుండా సేవజేసే తత్వం, మనస్తత్వం. సుధీర్ఘ నాలుగు దశాబ్ధాల అనుభవం. ఇంతటి నిజాయతీ పరుణ్ణి ఎవరైనా ఏం చేయగలరు? ఎందుకు ఇంత బెదురు వణకు కలవరం నటుడు శొంఠినేని శివాజీకి? శొంఠినేని శివాజీ మాటకు ఇంత ప్రచారం ఎందుకు? ఇదే మీడియా.. వేరే ఎవరైనా ఇలా మాట్లాడితే.. ఇంత ప్రచారం కలిపిస్తారా? అప్పుడే కదా! ప్రజలకు మీడియా కథా కమామిష్ ఏమిటో తెలుస్తుంది. 
  
లేకుంటే ఒక విలువైన సమాచారంలో నిజాయతీ ఉంటే, అది మరుగున పడకూడదు. ఏపిలో ఏ చిన్న ఊహించని సంఘటన జరిగినా ఈ ఆపరేషన్ గరుడ  అని ఒక సామాజిక వర్గ నాయకులు, అదే పదే పదే వల్లించటం, అదీ ఒకే ఒక సామాజిక వర్గ సమస్త వనరులను ఏకీకృతం చేయటం చూస్తే కేంద్రం నుంచి కాదు రాష్ట్రం నుండే "ఆపరేషన్ గరుడ" తో దేశం విస్తృత ప్రయోజనాలను ఒక సామాజిక వర్గ ప్రయోజనాలకు బలి చేసే రాజకీయ మీడియా మిళిత వ్యూహం న్యాయ ఎక్జెక్యూటివ్ వ్యవస్థలను తమ చేతులోకి తీసుకొని మరో సారి రాష్ట్ర విభజనకు ప్రణాళిక రచిస్తున్నాయా అనే అనుమానం పొడచూపుతుంది.  ప్రస్తుతం శొంఠినేని శివాజి ఈ విషయంలో ఆయన సుధీర్ఘ ఉపన్యాసంతో  మరల ఆయన గొంతుక సవరించారు ఆ కధేమిటంటే:  
Image result for sivaji's operation garuda
ఇంత భవిష్యత్ చెప్పగల శివాజిని జరగనున్నది నిఘాసంస్థల చేత విచారణ జరిపితే మంచిది. వెంటనే నేఱస్తులపై విచారణ జరపొచ్చు కదా! 
ఇక్కడ వైఎస్ జగన్మొహనరెడ్ది పై జరిగిన దాడిపై తక్షణ పారదర్శక విచారణ, సమాంతరంగా ఆయన ఆరోగ్య పరిరక్షణ. రాష్ట్రంపై ఆపరేషణ్ గరుడ పరేషాన్ గుఱించి కాదు ఆలోచించాల్సింది.  


అసలు ప్రభుత్వం ప్రతిపక్ష నాయకునిపై హత్యాప్రయత్నంలో అటు కేంద్రాన్ని ఇటు వైసిపిని వీలుంటే ఇరికించే ధారుణమైన ఆలోచన ఏమైనా ఉందా? అనే అనుమాన బీజం మొలకెత్తింది రాష్ట్ర శాంతి భద్రతలను యోగ క్షేమాలను పరిరక్షించాల్సిన "డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్" మాటల్లోనే. ఏమైనా లొసుగులున్నాయేమో? అనిపిస్తుంది చూస్తుంటే. లేకపోతే విచారణ మానేసి "శివాజి గారి కాష్మోరా లాంటి ఆపరేషన్ గరుడ" ను నిద్రలేపట మేమిటి- ఈ రాష్ట్ర ప్రభుత్వం? 

Image result for operation garuDa & chandrababu comments

వైసీపీ అధినేత జగన్‌పై దాడి విషయంలో ఆపరేషన్ గరుడలో హీరో శివాజీ చెప్పినట్లే జరగడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఆపరేషన్ గరుడలో భాగంగా తర్వాత ఏం జరగబోతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో హీరో శివాజీ స్పందించారు..


"ఏదో విధంగా నారా చంద్రబాబు నాయుడి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ కూలదోయాలన్న కుట్ర జరుగుతోంది. ఈ మూడు నెలల్లో సీఎంను కూలదోస్తారు" అని సినీ నటుడు శొంఠినేని శివాజీ అన్నారు. వైఎస్ జగన్‌మోహన రెడ్డిపై దాడి ఘటనపై విచారణ జరగాల్సిందేనని, రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేకపోతే కేంద్రమే విచారణ చేపట్టాలి"  అని అన్నారు.
Image result for operation garuDa & chandrababu comments
కేంద్ర భద్రతా దళాల పరిధిలో జరిగిన దాడి కాబట్టి సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపించుకోవచ్చునని ఈ సినీనటుడు అభిప్రాయపడ్డారు. జీవీఎల్‌ నరసింహా రావుకు ఏం తెలుసని మాట్లాడుతున్నారంటూ శొంఠినేని శివాజీ మండిపడ్డారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి దాడులు చేయించే మనస్తత్వం అయితే ఇంత వరకూ రాదని అన్నారు.
Image result for operation garuDa & chandrababu comments
తన ఆంధ్ర\ప్రదేశ్ రాష్ట్రంపై కుట్రలు జరిగినా, తప్పులు జరిగినా బయటపెట్టడం తనకున్న హక్కు అని సొంఠినేని శివాజీ స్పష్టం చేశారు. తన రాష్ట్రం పై అభిమానంతో సినీ జీవితాన్ని సైతం పక్కనబెట్టి, ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నానని తెలిపారు. తనకు ఏ పార్టీలతో సంబంధం లేదన్నారు. "ఆపరేషన్ గరుడ" గురించి ప్రజల కు క్లారిటీ ఉందని రాష్ట్రం మొత్తం దాని గురించే చర్చించుకుంటున్నారని శివాజీ స్పష్టం చేశారు.
Hero Shivaji Comments on Operation Garuda 

ఎందుకీ ఆవేశం మిస్టర్ శొంఠినేని శివాజి..ప్రశాంతంగా సమస్యలకు పరిష్కారం ఆలోచించలేరా? 

మరింత సమాచారం తెలుసుకోండి: