ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసిపి అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో దాడి చేసిన జానపల్లి శ్రీనివాసరావు‌ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తేనని అతని సొంతూరు ముమ్మడివరం వారే చెబుతున్నారు.
Image result for chandrababu naidu
నిందితుడు జానపల్లి శ్రీనివాసరావుది తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మండలం ఠానేలంక. అయితే నిందితుడి కుటుంబం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటుంటే, శ్రీనివాసరావు సోదరుడు మాత్రం, ప్రస్తుతం తాము టీడీపీలో ఉన్నామని ఒక టీవీ చానెల్‌ ప్రతినిధితో చెప్పారు. అంతే కాకుండా జానపల్లి శ్రీనివాసరావు తెలుగుదేశం కండువాతో దిగిన ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.
Srinivasa rao belongs to TDP - Sakshi

తెలుగుదేశం పార్టీ కండువాతో నిందితుడు శ్రీనివాసరావు


జానపల్లి శ్రీనివాసరావు అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన వాడేనని అతని సొంతూరు ముమ్మడివరం వాసులు చెబుతున్నారు. శ్రీనివాసరావుకు తెలుగుదేశం ప్రభుత్వం రెండు లోన్లు, పక్కా గృహం మంజూరు చేసిందని స్థానికులు తెలిపారు. ఊర్లో నేఱచరిత్ర కలిగిన వ్యక్తికి ఎయిర్‌-పోర్టులోని టీడీపీకి చెందిన ఒక నాయకుడి రెస్టారెంట్‌ లో ఉద్యోగం ఇచ్చి అతన్ని ఈ ఘటనకు ప్రోత్సహించి ఉంటారని ముమ్మడివరంవాసులు చెబుతున్నారు.
Image result for janapalli srinivasa rao attempted murder on YS Jagan
ఏడాదిగా పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని అంటున్నారు. వైఎస్‌ జగన్‌మోహనరెడ్డిపై దాడి అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికారులు, తెలుగు దేశం ప్రజా ప్రతినిధులు, ఇతర చోటా మోటా టిడిపి నేతలు, చివరికి పచ్చ మీడియా ఆన్లైన్ పత్రికల్లోనూ, పచ్చచానళ్ళలోను ఎవరూ ఇంకా అడగక ముందే మూకుమ్మడిగా స్పందించిన తీరు రాష్ట్ర ప్రజల్లో ఏవగింపు కలిగించడంతో పాటు పలు కొత్త అనుమానాలకు తెరలేపింది.
Image result for janapalli srinivasa rao attempted murder on YS Jagan
హత్యాయత్నం ఘటన అనంతరం ప్రభుత్వం రాజకీయంగా దాన్ని పక్కదారి పట్టించడానికి అనేక నాటకాలకు, తప్పుడు ప్రచారానికి దిగడం తెలిసిందే. రాష్ట్ర పోలీస్ బాస్ తనంతట తానే ఏ విచారణగాని సమాచార సేకరణ గాని జరగకుండానే మాట్లాడిన తీరు ఈ కేసు పక్కదారి పట్టిందనే అనుమానం జనాల్లో ప్రచారం లోకి వచ్చింది.
Image result for janapalli srinivasa rao attempted murder on YS Jagan
క్షణం ఆలస్యం చేయకుండానే జనం ఏ చానల్లో ఏ వార్త వచ్చింది? ఎవరెవరు మాట్లాడారు? ఏవరేమన్నారు? ఇలా అన్నీ గమనిస్తూ నిజాన్ని నిర్ధారించే సమర్ధత సాధించుకున్నారు.  బుద్ధా వెంకన్న, కాలవ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ఒక్కసారిగా మీడియాలో మూసబోసిన సమాధానాలు చెప్పటం చూసిన అమరావతి ప్రజలు దీని వెనక పెద్ద కథే నడిచిందని అంటున్నారు. 

Image result for janapalli srinivasa rao attempted murder on YS Jaganవైఎస్‌ జగన్‌పై దాడికి పాల్పడిన జానపల్లి శ్రీనివాసరావు‌, జగన్‌ అభిమాని కాదని, తెదేపా కార్యకర్త అని వైకాపా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. జగన్‌ పై దాడి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించిన తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. సీఎం స్పందన చూస్తుంటే ఆయనకు మానవత్వం ఉందా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. జగన్‌ పై జరిగిన దాడి "ఆపరేషన్‌ గరుడ" లో భాగమేనని, దానికి కథ, కథనం దర్శకత్వం  అంతా ముఖ్యమంత్రి చంద్రబాబాబు నాయుడే ఆరోపణలు చేశారు.

Image result for yv subba reddy

మరింత సమాచారం తెలుసుకోండి: