హత్యాయత్నం కేసులో కొత్త ట్విస్ట్  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహనరెడ్డి దీనిపై బుధవారం హైకోర్టుకు వెళ్లారు. తనపై కుట్ర జరిగిందని, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యం ఉందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.  అలాగే కేసు సక్రమంగా జరపడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. కేంద్ర దర్యాఫ్తు సంస్థతో విచారణ జరగాలని డిమాండ్ చేశారు. 
why ap state govt did not stopped operation garuDa కోసం చిత్ర ఫలితం
కేసును ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని పేర్కొన్నారు. ఇందులో ప్రతివాదిగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పేరును చేర్చారు. మొత్తం 8మందిని చేర్చారు. చంద్రబాబుతో పాటు డీజీపీ, విశాఖ ఏసీపీ, ఎయిర్ పోర్టు పీఎస్ ఎస్‌హెచ్ఓ తదితరులను పేర్కొన్నారు. 


శ్రీనివాస్ దగ్గర స్వాధీనం చేసుకున్న లేఖలో మూడు చేతి రాతలు ఉన్నాయని జగన్ పేర్కొన్నారు. నేరుగా తన మెడపై దాడి చేయబోయాడని, ప్రతిఘటించడంతో భుజాని కి గాయమైందని అన్నారు. కేసు త్వరగా క్లోజ్ చేసేందుకు నార్త్ విశాఖ ఏసీపీ ని నియమించారని చెప్పారు. నాపై హత్యాయత్నం జరిగిందని స్వయంగా పోలీసులే రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారని చెప్పారు. కుట్ర కోణం విస్మరించారు కుట్ర కోణాన్ని సజావుగా దర్యాఫ్తు చేయాలని హైకోర్టుకు ఆయన విజ్ఞప్తి చేశారు. 
why ap state govt did not stopped operation garuDa  కోసం చిత్ర ఫలితం
ఇది రేపు హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశముంది. తాను ప్రజాసంకల్పయాత్ర పేరుతో ఏపీలో పాదయాత్ర చేస్తున్నానని, ప్రభుత్వవైఫల్యాలను, తప్పిదాలను, పాలకు ల అక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నానని జగన్ చెప్పారు. జగన్‌పై దాడి ఆరోజే ఎందుకు? నాపై దాడి చేస్తారని గతంలో సినీ నటుడు శొంఠినేని శివాజీ ప్రకటించాడు. చంద్రబాబు సర్కారు, టీడీపీ దుర్మార్గాలను ఎండగడుతున్నానని జగన్ చెప్పారు. 


ఆపరేషన్ గరుడ పేరుతో ఒక కొత్త డ్రామాను తెరపైకి టీడీపీ నేతలు తెచ్చారని అన్నారు. ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రప్రభుత్వం పడగొట్టే ప్రణాళిక ఉందంటూ చెబుతున్నారని, టీడీపీ సానుభూతిపరుడైన సినీ నటుడు శొంఠినేని శివాజీ మాత్రమే "ఆపరేషన్ గరుడ" సూత్రధారి అన్నారు. పాదయాత్ర లో నాపై ఒక దాడి చేస్తారని శివాజీ గతంలో ప్రకటించారని చెప్పారు. 
why ap state govt did not stopped operation garuDa  కోసం చిత్ర ఫలితం
నన్ను చంపి "ఆపరేషన్ గరుడ" పేరుతో ఇప్పటికే ప్రచారం చేసినట్లు దాన్ని కేంద్ర ప్రభుత్వంపై నెట్టేసే వ్యూహం టిడిపి అల్లింది. అలా మీద నిర్మించే ఈ వ్యూహం టీడీపీ ప్రభుత్వ పతనానికి దారి తీస్తుందని శివాజీ అప్పుడు చెప్పారని జగన్ పేర్కొన్నారు. తాజా పరిణామాలు చూస్తుంటే ఆపరేషన్ గరుడ టీడీపీ భారీ కుట్ర అని అర్థమవు తుంది అని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతను హత్య చేసి ఆఫరేషన్ గరుడ లో భాగమని చెప్పే ప్రయత్నమని ఆయన ఆరోపించారు. 


ఆ రోజు ఏం జరిగిందంటే? అక్టోబర్ 25న ఇద్దరు భద్రతా సిబ్బందితో తాను విశాఖపట్నం విమానాశ్రయానికి వచ్చానని జగన్ పేర్కొన్నారు. లాంజ్‌ లో కూర్చొని ఉండగా రెస్టారెంటులో పని చేసే వ్యక్తి తన వద్దకు సెల్ఫీ తీసుకుంటానని వచ్చి దాడి చేయబోయాడని, పదునైన కత్తి తో నాపై దాడి చేయగా నేను ఆత్మరక్షణ కోసం తాను కిందకు వంగడంతో గొంతుకు తగలాల్సిన కత్తి భుజంలో గుచ్చుకుందని చెప్పారు.
why ap state govt did not stopped operation garuDa  కోసం చిత్ర ఫలితం
దాడి చేసిన వ్యక్తిని భద్రతా సిబ్బంది పట్టుకొని వెళ్లి పోలీసులకు అప్పగించారని, ప్రాథమిక చికిత్స అనంతరం తాను హైదరాబాదుకు వచ్చానని జగన్ పేర్కొన్నారు. సిటీ న్యూరో ఆసుపత్రిలో తనకు చికిత్స చేసి 9 కుట్లు వేశారని, తనపై దాడి జరిగిన గంటలోపే, ఏపీ డీజీపీ ప్రెస్-మీట్ పెట్టారని, ప్రచారం కోసం దాడి జరిగినట్లుగా కేసు నీరు గార్చే ప్రయత్నం చేశారని, ఆ తర్వాత సీఎం ప్రెస్-మీట్ పెట్టి ఇదంతా ఆపరేషన్ గరుడ లో భాగమని చెప్పారని తెలిపారు.


మొత్తం మీద "ఆపరేషన్ గరుడ" నిజమైతే ఒక ప్రభుత్వ అధినేతగా, ప్రభుత్వ అధికారం వినియోగించి, ఆ ఉపద్రవాన్ని ఎందుకు నివారించలేక పోయారని ప్రజల ప్రధాన ప్రశ్న. కుట్రలు జరుగుతాయని తెలిసినా ఏపి ప్రభుత్వం, ఇంటెలిజెన్స్, పోలీస్ యంత్రాంగం చోద్యం చూస్తూ ఉండటానికి కారణం ఏమిటనేది  ఇప్పుడు ఆరు కోట్ల ఆంధ్రుల ప్రధాన ప్రశ్న. ఇక ముందు ముందు టిడిపి పాలన గాలిలో దీపం గానే ఉండబోతుందా? 

sivaji's operation garuda a mad act కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: