తెలుగు ప్రజల ఆత్మాభిమాన సంరక్షణ కోసం జన్మెత్తిన సాంప్రదాయ తెలుగుదేశం పార్టీ నందమూరి తారకరామారావు మరణంతోనే అంతరించిపోయింది. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడి అధినేతృత్వంలో మిగిలి ఉన్నది అవకాశవాద తెలుగు దేశంగా పార్టీ మాత్రమే. నందమూరి తెలుగుదేశం, నారా తెలుగు దేశం గా రూపాంతరం చెంది ఎవడితోపడితే వాడితో తిరిగే వారకాంత లాగా మారిపోయింది నేడు.

rahul gandhi chandrababu naidu కోసం చిత్ర ఫలితం

అసలు తెలుగుదేశం అహంకార కాంగ్రెస్ ను నిలువరించే ఉద్దేశంతోనే జన్మమెత్తింది. ఒకనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కాంగ్రెస్ అధినేతల చెప్పులు మోశారు. అందుకే నందమూరి కాంగ్రెస్ ను విభేధించారు. అంతే సామర్ధ్యంతో తొమ్మిది నెలల తెలుగుదేశం పసికందు నూరేళ్ల కాంగ్రెస్ ను ఎడమకాలితో తంతే బంగాళా ఖాతంలో పడిపోయింది.

ntr back stabbed by chandrababu photos కోసం చిత్ర ఫలితం

అదే టిడిపిని నేడు సిగ్గుశరం వదిలేసి కాంగ్రెస్ వారసత్వ  "కుక్కమూతిపిందె" రాహుల్ గాంధి  పాదాల చెంతకు చేర్చిన నారా చంద్రబాబు నాయుణ్ణి అనుసరిస్తే తెలుగుదేశం వాళ్లని ఆసాంతం అవకాశవాదులనే అనాలి. అధికారం కోసం ఎవడితో పడితే వాడితో తిరిగే వెలయాలితో సమానము టిడిపి బ్రతుకు. 

గతం గతః వర్తమానం, భవిష్యత్తు కోసం పనిచేస్తాం 

"నేను రేసులో లేను. నాకు నా రాష్ట్రం ముఖ్యం. కొత్త రాష్ట్రాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత నాపై ఉంది. నేను దానిని విడిచి రాను. దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల దృష్ట్యా వాటి నుంచి దేశాన్ని కాపాడేందుకు బీజేపీయేతర పార్టీలను ఒక తాటిపైకి తేవడానికి ప్రయత్నిస్తున్నాను. దేశాన్ని కాపాడాలి. ప్రజాస్వామాన్ని కాపాడాలి అన్నది నా నినాదం. ఇది మనందరి ఉమ్మడి నినాదం కావాలి. ఎవరో ఒకరు పూనుకోవాలి కాబట్టి నేను ముందు కొచ్చాను. అందరం కలిసికట్టుగా ప్రయాణం చేయడానికి నా వంతు సహకారం అందించడం వర కే నా పాత్ర’ అని ఆయన వారికి చెబుతున్నారు. తనను ప్రధాని అభ్యర్థి అని గానీ లేదా జాతీయ కన్వీనర్‌ అని గానీ ఎక్కడా చెప్పవద్దని, ప్రచారం కూడా చేయవద్దని వారికి గట్టిగా సూచించారు.....చంద్రబాబు 

chandrababu with sanjay gandhi కోసం చిత్ర ఫలితం

1975 లో భారతదేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో అతను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ గాంధీకి సన్నిహిత మద్దతుదారునిగా ఉండి అత్యవసర పరిస్థితిని సమర్ధించారు. అలాంటి వ్యక్తి నేడు ప్రధాని నరెంద్ర మోడీ పాలనను నిరంకుశ పాలన అంటున్నాడు. ఈయన, ఈయన పార్టీ సహచరులపై ఐటి దాడులు జరిగితే అది తెలుగు జాతిపై, ఆంధ్రప్రదేశ్  పై జరిగిన దాడులు ఏలా అవుతాయి? ద్రోహం చేయటం, విద్రోహ చింతన,  ఈ యూ-టర్న్ బాబు నైజం.

chandrababu with sanjay gandhi కోసం చిత్ర ఫలితం

శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎన్నికలలో చంద్రబాబు నాయుడు కుల రాజకీయాలను ప్రోత్సహించిన చరిత్రను మూటగట్టుకున్నారు. విశ్వవిద్యాలయాల్లో కుల రాజకీయాలను ప్రోత్సహించి కుల ప్రాధమ్యంగా ఎదిగిన తొలి తరం దుర్మార్గుడుగా నిలచిన వ్యక్తి.  ప్రతిభ, రాజకీయ వ్యుహచతురత, అంతర్లీనంగా నిబిడీకృతంగా ఉన్నా ఆయన కుల దురభిమాన్ని నివురుతో కప్పేసి, దాన్ని అలాగే గుంభనంగా ఉంచుతూ,  నిప్పులా బయటకు కనిపించారు.

chandrababu with sanjay gandhi కోసం చిత్ర ఫలితం

కాల గమనంలో సంజయ్ గాంధి సహకారంతో తరువాత 1975 శాసనమండలి ఎన్నికలలో పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీచేయాలని ఆసక్తి చూపి నామినేషన్ వేసినా స్థానిక కాంగ్రెస్ నేతల కారణంగా విరమించుకోవలసి వచ్చింది. గల్లా రాజగోపాలనాయుడి శిష్యరికంతో 1978 లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ సాధించి, చంద్రగిరి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. అనంతరం రాజకీయ భిక్ష పెట్టిన గల్లా రాజగోపాలనాయుడికి తీవ్రద్రోహం చేశారనే విమర్శలూ ఉన్నాయి.

ntr back stabbed by chandrababu photos కోసం చిత్ర ఫలితం

మితృడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి సహకారంతో టి.అంజయ్య మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న చంద్రబాబు, ఆ తర్వాత కనీసం కృతజ్ఞత కూడా ప్రదర్శించని కరుడు గట్టిన కుల రాజకీయవాదిగా, పదును తగ్గని స్వార్థపరుడుగా రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.  

ntr chandrababu photos కోసం చిత్ర ఫలితం

కాంగ్రెస్ మంత్రివర్గంలో సినిమాటోగ్రఫి మంత్రిగా ఉన్న సమయంలోనే, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ఆంధ్రుల ఆరాద్య దైవం ఎన్‌ టీ రామారావు కుమార్తె భువనేశ్వరిని చంద్రబాబు వివాహం చేసుకున్నారు. 1983 లో ఎన్‌టీ రామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించారు. నాడు జరిగిన ఎన్నికలలో తన మామ ఎన్‌టీ రామా రావు పైనే పోటీ చేస్తానంటూ బీరాలు పలికిన చంద్రబాబు, చంద్రగిరి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఘోర పరాజయం పాలయ్యారు.

సంబంధిత చిత్రం

రాజకీయ అస్థిత్వం కోసం, అధికారానికి దూరంగా ఉండటం మంచిదికాదని నమ్మిన చంద్రబాబు, ఎన్‌ టీ రామారావును బతిమాలో, బెదిరించో టీడీపీలో చేరారు. చంద్ర బాబు నైజం తెలిసిన అతిదగ్గరి వ్యక్తులు వద్దని వారించినా అల్లుడ నే ప్రేమతో చంద్రబాబును ఎన్‌ టీ రామారావు చేరదీశారని టీడీపీ సీనియర్‌ నేతలు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన సంగతి అందరికీ తెలిసిందే

ntr back stabbed by chandrababu photos కోసం చిత్ర ఫలితం

విషయలాలస, అధికారదాహం, పదవీకాంక్ష, తనివి తీరని స్వార్ధపరత్వం ఈయన అంతిమ లక్ష్యం. అంతేకాదు ఈయన తరవాత ఈయన కుమారుడు లోకెష్ నాయుడు ఆతరవాత మనవడు దేవాన్ష్ నాయుడు ముఖ్యమంత్రులుగా అధికారం చలాయించటానికి పునాదులు వేసే క్రమంలో ఎంతటి నైచ్యానికైనా సిద్ధపడే అనైతిక, కుశ్చిత, మనస్తత్వం చంద్రబాబు స్వంతమని, ఆయనను బాగా ఎరిగిన అతిదగ్గరివారనే మాట. 

galla rajagopala naiDu and chandrababu కోసం చిత్ర ఫలితం

అందుకే అలాంటి లక్ష్యాలున్న నెహౄ-గాంధి కుటుంబ వారసత్వ రాజకీయాల నాయకత్వంతో విలసిల్లే కాంగ్రెస్ పార్టీ తో ప్రజల ఆత్మాభిమానాన్ని ప్రజా ప్రమేయం లేకుండా  ఫణంగా పెట్టి పొత్తుకు అహరహరం తహతహలాడుతున్నారు.

ntr back stabbed by chandrababu photos కోసం చిత్ర ఫలితం

"కలసి నడుద్దాం - గతం గతః  వర్తమానం - భవిష్యత్తు కోసం పనిచేస్తాం - భాజపాను ఓడించి దేశాన్ని కాపాడతాం - ప్రజాస్వామ్యం, వ్యవస్థ లను నిలబెడతాం - సమస్యలపై కలిసికట్టుగా ఉద్యమిస్తాం"  అంటూ రాహుల్‌ గాంధీ, చంద్రబాబు ఇరువురు చంద్ర గాంధి, రాహుల్ బాబు లుగా నిస్సిగ్గుగా మారి తొలిసారిగా భేటీలో స్పష్టీకరించిన విషయం క్రింద పొందుపరచాం    

chandrababu with sanjay gandhi కోసం చిత్ర ఫలితం

"భారత దేశ భవిష్యత్ కోసం తెలుగుదేశం తో కలిసి పనిచేయాలనే అభిప్రాయానికి వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. రెండు పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆయన తెలిపారు. గంటకు పైగా మా మధ్య ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చర్చించామని  కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చెప్పారు.  గతాన్ని వదిలేసి భవిష్యత్ కోసం కృషి చేస్తామన్నారు"

సంబంధిత చిత్రం

న్యూఢిల్లీ లో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీతో  సమావేశం ముగిసిన తర్వాత  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఇరువురు కలసి మీడియాతో మాట్లాడారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: