Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 21, 2018 | Last Updated 9:59 am IST

Menu &Sections

Search

రేపటి మధ్యంతర ఎన్నికల్లో అమెరికా ప్రజలు ట్రంప్ ను పసిపిక్ లో విసిరేయనున్నారా?

రేపటి మధ్యంతర ఎన్నికల్లో అమెరికా ప్రజలు ట్రంప్ ను పసిపిక్ లో విసిరేయనున్నారా?
రేపటి మధ్యంతర ఎన్నికల్లో అమెరికా ప్రజలు ట్రంప్ ను పసిపిక్ లో విసిరేయనున్నారా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇప్పటికి డొనాల్డ్ ట్రంప్‌ అధ్యక్ష పదవి చేపట్టి 22 నెలలౌతుంది. అయితే ఇప్పుడు జరిగే మధ్యంతర ఎన్నికలు అమెరికా అధ్యక్షుడుగా ఆయన పాలనపై రెఫరెండం- ప్రజాభిప్రాయంగా భావిస్తున్నారు. ఈ మధ్యంతర ఎన్నికల ప్రచారంలో డెమొక్రాటిక్‌ పార్టీ  
world-news-national-news-america-mid-term-polls-re

*ఒబామా కేర్‌ గా పేరొందిన ఆరోగ్య బీమా చట్టం  కొనసాగింపును ప్రచారాస్త్రంగా మలుచుకుంది.
*డొనాల్డ్ ట్రంప్‌ ప్రకటించిన పన్నుల కోతనూ తమకు అనుకూలంగా మార్చుకుని ప్రచారం చేస్తోంది.
*అటు రిపబ్లికన్లు వీసాలు, అక్రమ వలసలపై దృష్టి పెట్టడం 
*ఆర్థిక పునరుజ్జీవానికి ప్రాధాన్యత ఇస్తామంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
world-news-national-news-america-mid-term-polls-re
అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు ఓటేసిన వారిలో 51 శాతం మంది ఇప్పుడు ఆయనను వ్యతిరేకిస్తున్నారనీ, ఇది డెమొక్రాట్లకు ప్రయోజనం కలిగిస్తుందని వివిద సర్వేల లో వెల్లడయింది.


అమెరికా ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు, సెనెట్‌ లో ఉన్న 100 స్థానాల్లో 35 స్థానాలకు ఈ నెల 6న (రేపు) మధ్యంతర ఎన్నికలు లేదా మిడ్‌టర్మ్‌-ఎలక్షన్స్‌ జరగనున్నాయి. ఇలా అధ్యక్షుడి నాలుగేళ్ల పాలనాకాలం మధ్యలో జరిగే ఎన్నికలను మధ్యంతర ఎన్నికలు లేదా మిడ్‌-టర్మ్‌-ఎలక్షన్స్‌ అని పిలుస్తారు. ప్రతినిధుల సభ, సెనేట్‌తో పాటు 39 రాష్ట్రాలు, ప్రాదేశిక పాలనా మండళ్లకు కూడా ఇదే సమయంలో ఎన్నికలు జరుగుతాయి. ప్రధాన పార్టీలైన రిపబ్లికన్‌లు, డెమొక్రాట్లు ఎవరికి వారు తామే మెజారీటీ సీట్లు దక్కించుకుంటామని ధీమాతో ఉన్నారు.

అయితే ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌ నాయకత్వం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీ గెలిస్తే: 

*డొనాల్డ్ ట్రంప్‌  వివాదాస్పద నిర్ణయాలు, అమెరికా ఆధిపత్య చర్యలు పెరుగుతాయనీ, ఆయనకు అడ్డూ అదుపూ ఉండదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

*అదే ప్రతిపక్ష డెమొక్రాట్ పార్టీ గెలిస్తే డొనాల్డ్ ట్రంప్‌ దూకుడుకు బ్రేక్స్ పడతాయని, ఆయన తీరు అత్యధికులకు సహించటలేదని ప్రజాస్వామ్యవాదులు స్వాతంత్ర ప్రియులైన అమెరికన్లకు ఇలాంటి నియంతృత్వ పోకడలు సహజంగా నచ్చవన్న సంగతి ఈ 22 నెలల ఆయన పాలన తీరుతో స్పష్టమవుతుందని వారంటున్నారు. 


ప్రస్తుతం ప్రతినిధులసభ, సెనేట్‌లలో రిపబ్లికన్ పార్టీకే ఆధిక్యత ఉంది. ప్రతినిధులసభలో రిపబ్లికన్‌ పార్టీకి 241 స్థానాలు, డెమొక్రాట్లకు 194 స్థానాలు ఉన్నాయి. సెనెట్‌ లో 52 స్థానాలు రిపబ్లికన్లవయితే, 48 స్థానాలు డెమొక్రాట్లవి. అయితే అమెరికా చరిత్రలో "అధికారంలో ఉన్న పార్టీకి మధ్యంతర ఎన్నికలు" కలసిరావటం లేదనేది గత చరిత్ర చెపుతుంది. 1934నుంచి ఇప్పటి వరకు 21సార్లు మధ్యంతర ఎన్నికలు జరగ్గా కేవలం మూడు సార్లు మాత్రమే అధికారంలో ఉన్న పార్టీ గెలిచింది. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టాక డొనాల్డ్ ట్రంప్‌ తీసుకున్న అనేక నిర్ణయాలు దేశంలోనే కాక అంతర్జాతీయంగానూ బహుముఖంగా వివాదాస్పదమయ్యాయి. 

world-news-national-news-america-mid-term-polls-re

*అమెరికన్లకు ఉద్యోగ ప్రయోజనాలు కలిగేలా వలస నిబంధనలను కఠినతరం చేస్తుండటం, 

*ఏడు ముస్లిం దేశాల పౌరులకు అమెరికాలోకి ప్రవేశాన్ని నిరాకరించడం, 

*చైనాతో వాణిజ్యయుద్ధం, 

*గత ప్రభుత్వం ఇరాన్‌తో  కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి వైదొలగడం, 

*ఐక్యరాజ్యసమితి సంస్థల నుంచి కూడా తప్పుకోనున్నట్టు ప్రకటించడం 

పైన వివరించిన తీవ్ర, వివాదస్పద నిర్ణయాలను డొనాల్డ్ ట్రంప్‌ పాలనా కాలంలో తీసుకున్నారు. వీటిని డొనాల్డ్ ట్రంప్‌ కే చెమందిన రిపబ్లికన్ పార్టీలోనే చాలా మంది బహిరంగంగానే తప్పుబడుతున్నారు, అవకాశం దొరికితే ట్రంప్ ను చీల్చి చెండాడుతున్నారు.
world-news-national-news-america-mid-term-polls-re 
డొనాల్డ్ ట్రంప్ ను అధికారంలోకి తెచ్చిన 2016 అధ్యక్ష ఎన్నికల్లో "రష్యా జోక్యం" చేసుకుందనీ, దాని రహస్య గూడచర్య ప్రభావం తో ఫలితాలు తారుమారయ్యాయని ఆరోపణలు వచ్చాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మధ్యంతర ఎన్నికల్లో కూడా రష్యా, చైనాల జోక్యం అనివార్యమని పలు ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి. 
అమెరికా ఎన్నికలను రష్యా నియంత్రిస్తోందని ఆరు అమెరికన్ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు తమ ఉమ్మడి నివేదికలో స్పష్టం చేశాయి. సామాజిక మాధ్యమాల ద్వారా రష్యా అమెరికన్లను ప్రభావితం చేస్తోందని ఆ సంస్థలు పలుసార్లు ఆరోపించాయి.
world-news-national-news-america-mid-term-polls-re
మధ్యంతర ఎన్నికల్లో రష్యా చురుకుగా జోక్యం చేసుకుంటుండటం వాస్తవమేనని, అది ఇంకా కొనసాగుతోందనేది యధార్ధమని గత ఆగస్టులో నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ డాన్‌ కోట్స్‌ అధ్యక్షభవనంలోనే మీడియాకు వివరించారు. ఈ నేపథ్యంలో మధ్యంతర ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనేది అక్కడే కాదు ప్రపంచదేశాలు అన్నింటా ఉత్కంఠత గొలిపే అంశమే. 
world-news-national-news-america-mid-term-polls-re

మధ్యంతర ఎన్నికలకు పోలింగ్‌ మంగళవారం అంటే రేపు 06/11/2018 న జరగనున్నప్పటికీ ముందుగానే వీలువెంట ఓటు వేసే అవకాశం ఓటర్లకు ఉంటుంది. పోలింగ్‌ రోజు రద్దీని తగ్గించేందుకు ఈ ఏర్పాట్లు చేస్తారు. ఈ ముందస్తు పోలింగ్‌ ను గతంలో కన్నా ఈసారి చాలా ఎక్కువ మంది వినియోగించుకుంటున్నారనీ, ముఖ్యంగా యువత ముందున్నారని అధికారులు చెబుతున్నారు. 
world-news-national-news-america-mid-term-polls-re

కొన్ని రాష్ట్రాల్లో గతం కన్నా, ఈసారి రెట్టింపు సంఖ్యలో ముందస్తు ఓటింగ్‌ నమోదైందని తెలుస్తుంది. అమెరికా వ్యాప్తంగా 3.15 కోట్ల మంది ఇప్పటికే ముందస్తు ఓటింగ్‌ అవకాశాన్ని ఉపయోగించుకుని ఓటేశారు. దీన్ని బట్టి డొనాల్డ్ ట్రంప్ కు కష్టకాలం మొదలైందని అంటున్నారు. 

world-news-national-news-america-mid-term-polls-re

world-news-national-news-america-mid-term-polls-re
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మహాకూటమిలో మహామాయ - బాగస్వామ్య పక్షాలకు కాంగ్రెస్ - టిడిపి మార్క్ వెన్నుపోటు!
జాబితాలో పేరు లేకున్నా ఓటరుగా నమోదై ఉన్నవారు ఓటు వేయవచ్చు! ఎలా అంటే!
భారత్ చైనాకు గుణపాఠం - మాల్దీవ్స్ లో ప్రజాస్వామ్య ప్రతిస్ఠాపన
తారస్థాయికి చేరిన రాష్ట్ర అవినీతి: మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం తదితరుల ఆవేదన
టిడిపి జోకర్ల నిలయమౌతుందా! అల్లుణ్ణి మించిన మామ కథ!
న్యాయ వ్యవస్థకు మకిల పట్టించారు! ఇక ఎన్నికల్తో కడిగెయ్యటమనా?
శబరిమల ప్రవేశం కంటే మహిళలకు ముఖ్య సమస్యలు లేవా? బంగ్లా రచయిత్రి తస్లిమ నస్రీన్
జగన్ హత్యాయత్నం వెనకున్నది సాక్షాత్తు ముఖ్యమంత్రే!
సన్నీ లియోన్ స్టెప్స్ - సిల్వర్ స్క్రీన్ షేక్స్
చంద్రబాబు క్లీన్ బౌల్డ్ – ఇక నందమూరి కుటుంబం మాత్రమే టిడిపికి శ్రీరామరక్ష
దేశ వ్యాప్తంగా "సిబీఐకి నో ఎంట్రీ" యేనా?  ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నిర్ణయం
చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం తప్పే: మాజీ జేడీ లక్ష్మీనారాయణ
చంద్రబాబు నమ్మక ద్రోహి-రాజకీయం అంటే ప్రతిపక్షాన్ని అంతం చేయటం కాదు: రోజా భర్త
ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు “రాష్ట్రపతి పాలన” కు దారి తీస్తున్నాయా?
ఆయనకు వ్యూహాలు రాజకీయాలే ఊపిరి! చంద్రబాబు పడగనీడలో తెలంగాణా!
చంద్రబాబు కుటుంబ రాజకీయం - అదే లేకపోతే ఆయన ఏమైపోతారో?
ఆంధ్రప్రదేశ్ లో సీబీఐ కి ప్రవేశం నిషేధం: జి.ఓ ఒక టిష్యూ పేపర్
About the author