రాజ‌కీయాల్లో పైచేయి సాధించ‌డ‌మే ప్ర‌ధానం. దీనికి ఏ అవ‌కాశం వ‌స్తే.. దానిని వినియోగించుకోవ‌డం నేత‌లకు వెన్నతో పెట్టిన విద్య‌. ముఖ్యంగా అప‌ర‌చాణిక్యుడైన చంద్ర‌బాబుకు ఈ విద్య తెలిసినంతగా మ‌రెవ‌రికీ తెలియ‌దు కూడా. ఏ అవ‌కా శాన్న‌యినా.. ఆయ‌న త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకుని ముందుకు సాగుతుంటారు. ఇక‌, విశాఖ విమానాశ్ర‌యంలో జ‌గ న్‌పై జ‌రిగిన దాడి విష‌యాన్ని కూడా చంద్ర‌బాబు త‌న‌కు అనుకూలంగానే మ‌లుచుకున్నారు. దాడి జ‌రిగిన వెంట‌నే ఆయ‌న త‌న త‌మ్ముళ్ల‌ను రంగంలోకి దించారు. వ్యూహాత్మ‌కంగా ఎదురు దాడి చేయించారు. వాస్త‌వానికి ఇప్పటికీ.. శ్రీనివాస్ అనే యువ‌కుడితో ఈ దాడిని ఎవ‌రు చేయించార‌నే విష‌యాన్ని పోలీసులు సైతం రాబ‌ట్ట‌లేక పోయారు. 


అయితే, చంద్ర‌బాబు అండ్ త‌మ్ముళ్లు మాత్రం జ‌గ‌న్ త‌న‌పైనే తాను త‌న అభిమానితో చేయించుకుని డ్రామాలు ఆడుతు న్నార‌ని చెప్పుకొచ్చారు. ప్ర‌చారం చేశారు. ఇక‌, ఎక్క‌డిక‌క్క‌డ తెలుగు దేశం పార్టీ నాయ‌కులు, అధికార ప్ర‌తినిధులు బాబు పులి అంటే.. వీరు తోక అంటూ వ్యాఖ్య‌లు సంధించారు. ఇది వ్యూహం! రాష్ట్రంలో ఏదో ఒక విష‌యంపై చ‌ర్చ‌ను ర‌గిలిం చి.. త‌న రాజ‌కీయాలు సానుకూలం చేసుకోవ‌డానికి చంద్ర‌బాబు వేసిన ఎత్తుగ‌డ‌. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఢిల్లీకి వెళ్ల‌డం, కాంగ్రెస్ పెద్ద‌ల‌తో చేతులు క‌ల‌ప‌డం జ‌రిగిపోయాయి. అయితే, అదేస‌మ‌యంలో పోల‌వ‌రం, రాజ‌ధాని అమ‌రావ‌తికి సంబంధించి కేంద్రం నుంచి రెండు బృందాలు అమ‌రావ‌తికి వ‌చ్చాయి. ఆయా నిర్మాణాలు, బ‌డ్జెట్‌ల‌కు సంబంధించి లెక్క‌లు కోరాయి. 


ఈ రెండు ప్రాజెక్టుల విష‌యంలోనూ రాష్ట్ర ప్ర‌భుత్వం అవినీతికి పాల్ప‌డింద‌ని గ‌తంలో కాగ్ సంస్థ నిగ్గుతేల్చింది. ఎవ‌రి నైనా త‌ప్పు ప‌ట్టే అవ‌కాశం ఉంది కానీ, రాజ్యాంగ సంస్థ, నేరుగా రాష్ట్ర‌ప‌తి చేతిలో మాత్ర‌మే ఉండే కాగ్‌పై ఎద‌రు దాడి చేసేం దుకు చంద్ర‌బాబుకు అవ‌కాశం లేదు. ఈ నేప‌థ్యంలోనే  కాగ్ సిఫార‌సులు ఆధారంగా ప‌ర్య‌ట‌న‌కు ప‌రిశీల‌న‌కు వ‌చ్చిన కేంద్రం బృందం దృష్టిని మ‌ళ్లించారు చంద్ర‌బాబు. ఇక‌, పోల‌వ‌రంపై 60 వేల‌కు పైగా పేజీల‌తో ఓ నివేదిక‌, రాజ‌ధానిపై 50 వేలకు పైగా పేజీల‌తో మ‌రో నివేదిక కేంద్రం నుంచి వ‌చ్చిన అధికారుల చేతిలో పెట్టేలా ప్ర‌ణాళిక సిద్ధం చేశారు. ఇక‌, తాను అదేస‌మ‌యంలో అమ‌రావ‌తిలో ఉంటే ఖ‌చ్చితంగా ఈ విష‌యం హైలెట్ అవుతుంద‌ని భావించిన చంద్ర‌బాబు.. అనూహ్యంగా రెండు రోజుల పాటు ఢిల్లీ టూర్ వేశారు. 


ఈ క్ర‌మంలోనే తీర్థం, ప్ర‌సాదం రెండూ ద‌క్కిన‌ట్టు.. రాష్ట్రంలో కేంద్ర ప్ర‌భుత్వ అధికారులు చేసిన త‌నిఖీలు మీడియా లో ప్ర‌చారానికి నోచుకోలేదు. అదే స‌మ‌యంలో ఢిల్లీలో చంద్ర‌బాబు కాంగ్రెస్‌తో చారిత్ర‌క అవ‌స‌రం, ప్ర‌జాస్వామ్య ర‌క్ష‌ణ పేరిట క‌ల‌యిక‌కు మీడియా అదిక ప్రాధాన్యం ఇచ్చింది. ఇదిమొత్తం ఒక కొలిక్కి రాగానే చంద్ర‌బాబు నేరుగా త‌న త‌మ్ముళ్ల‌కు.. ఇక‌, జ‌గ‌న్ ఎపిసోడ్ అవ‌స‌రం తీరిపోయింది! మ‌ళ్లీ నేను చెప్పే వ‌ర‌కు నోరు తెర‌వ‌ద్దు! అంటూ హుకుం జారీ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ త‌మ్ముళ్ల గొంతులు మూగ‌బోయాయి. మొత్తానికి బాబు వ్యూహం ఇద‌న్న మాట‌! 


మరింత సమాచారం తెలుసుకోండి: