ఎన్ టి ఆర్ బయోపిక్ - కథానాయకుడు - సినిమా జనవరి 9న విడుదలౌతుందని ప్రకటన వచ్చింది. ఒక సినిమా కథానయకుడు గా కాకుండా, ఒక రాజకీయ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడుగా నందమూరి తారక రామారావు కాంగ్రెస్ పార్టీకి ఆ సంస్కృతికి బద్దవ్యతిరేకి. కాంగ్రెస్ పార్టీ పాలనపై ఆంధ్ర ప్రదెశ్ ప్రజల్లో  నాడు బళ్ళున బ్రద్దలైన వ్యతిరేకత పునాదులపైనే ఎన్టీఆర్ తన రాజకీయ మహా సౌధాన్ని నిర్మించుకున్నాడు. అంతవరకూ కాంగ్రెస్ పాలనతో విసిగి వేసారిన వారే టీడీపీకి ఓటేశారు. అంతే కాదు, కాంగ్రెస్ పార్టీ పాలనలో అణగారిన వర్గాలే టీడీపీని ఆదరించాయి. ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రిని చేశాయి. 
సంబంధిత చిత్రం 
కేవలం అప్పుడు మాత్రమే కాదు, ఆ తర్వాత దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత అనే భావన పైనే టీడీపీని నిలబెట్టింది. టీడీపీ రాజకీయానికి ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతే మూలం. దీనికి మరోపేరే ఆంధ్రుల ఆత్మ అభిమానం లేదా ఆంధ్రుల ఆత్మ గౌరవం.  
NTR Kathanayakudu కోసం చిత్ర ఫలితం 
ఈ నేపథ్యంలో ఇప్పటి పరిణామాలను గమనిస్తే, ఒకవైపు ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ ఆయన బయోపిక్-ను రూపొందిస్తున్నాడు. అతి త్వరలోనే ఎన్ టి ఆర్ బయోపిక్ -కథానయకుడు గా సినిమా విడుదల అయ్యే అవకాశాలున్నాయి. వాళ్లు విడుదల తేదీని జనవరి 9, 2019 గా ముహూర్తం నిర్ణయించారు. మరో వైపు రాజకీయంగా సైద్ధాంతిక విలువల వలువలు ఊడ్చుతూ చంద్రబాబు నాయుడు, ఇప్పుడు హస్తం గుర్తు పార్టీ తో తన రక్స్త హస్తాన్ని కలిపారు. ఎన్టీఆర్ ను రాజకీయంగా వెన్నుపోటేసి పదవి నుంచి దించి అదే పీఠంపై ఆయన అల్లుడు, ఇప్పుడు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ తో జతకట్టటం మొత్తం తెలుగుదేశం పార్టీని, దాని పుట్టుక నుంచి దాదాపు నాలుగు దశాబ్ధాలుగా ఆ పార్టీ పోకడలను గమనించే ప్రజలు ఒక "కుదుపు" కు గురయ్యారు. 
 NTR Kathanayakudu కోసం చిత్ర ఫలితం
ఒకనాటి కాంగ్రెస్ అధికార దురహంకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పులు మోయించింది. ప్రతి చిన్న నిర్ణయానికి ఇక్కడి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు నెలలో సగాని కంటే ఎక్కువ రోజులు డిల్లీలోని అగ్రనాయకత్వం చుట్టూ తిరిగారు. ఈ ఢిల్లీ దర్బారు ముందు "తెలుగు వారి ఆత్మగౌరవం" దహనమవటాన్ని ఆ మహా నటుడు సహించలెక పోయారు. దరిమిలా ఆగ్రహోదగ్దుడైన ఎన్టీఆర్ ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ అనే సిద్ధాంత ప్రాతిపదికన తెలుగు దేశం  పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీ పిండ దశ నుండే కాంగ్రెసును చీల్చిచెండాడుతూ నవజాత శిశువు గానే చంద్రబాబు కూడా ఒక నేతగా ఉన్న కాంగ్రెసును ఎడమకాలితో తంతే నాడు బంగాళా ఖాతంలో పడిపొఇంది. 
NTR completely against to congress and build TDP కోసం చిత్ర ఫలితం
అయితే ఇప్పుడు అదే ఢిల్లీ దర్బారు పాదాలచెంత చంద్రబాబు సాష్టాంగపడ్డాడు. కాంగ్రెస్ వ్యతిరేకతే ఆయుధంగా ఎన్టీఆర్ పెట్టినపార్టీని, ఇప్పుడు ఆయన దశమ గ్రహం (అల్లుడు దశమ గ్రహం అన్నారు కదా!) ఆయన నిర్మించిన పార్టీని, ఆయన ఆ గర్భ శత్రువు కాంగ్రెస్ పార్టీతో పొత్తుతో కలుపుతున్నాడు.
 NTR Kathanayakudu కోసం చిత్ర ఫలితం
ఇక ఎన్టీఆర్ బయోపిక్ తెలుగు ప్రజలు కోరుకునే లేదా ఊహించే తెలుగవారి ఆత్మగౌరవం, ఢిల్లీ దర్బార్ దురహంకారం అంటూ కథానాయకుడు బాలకృష్ణ చెలరేగిపోయే అవసరం ఉంటుంది. అదే జరిగితే ఆయన బావ, వియ్యంకుడు కాంగ్రెస్ తో చేతులు కలిపేసిన తరుణంలో ఎన్టీఆర్ కథానాయకుడు బయోపిక్ లో కాంగ్రెస్ ను  చెడా మడ  తిడితే అది ఖచ్చితంగా చెడు సంకేతాలు పంపదా? మరి సినిమా విడుదల్ రాంగ్ టైమింగ్ కాదా! అంతేకాదు సినిమానే మొత్తంగా షాక్ ఇస్తుంది కదా! 

సంబంధిత చిత్రం

మరింత సమాచారం తెలుసుకోండి: