Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jan 19, 2019 | Last Updated 2:44 pm IST

Menu &Sections

Search

సెక్యులర్ పార్టీలదే హవా (ట)! గౌడ, నాయుడు, స్టాలిన్ ఇదే కదా! సెక్యులరిజం

సెక్యులర్ పార్టీలదే హవా (ట)! గౌడ, నాయుడు, స్టాలిన్ ఇదే కదా! సెక్యులరిజం
సెక్యులర్ పార్టీలదే హవా (ట)! గౌడ, నాయుడు, స్టాలిన్ ఇదే కదా! సెక్యులరిజం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మాటవరసకు అనుకుందాం! ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకుల్లో ఒక్కడంటే ఒక్క డైనా సెక్యులరిస్టు ఉన్నాడా! ఇదంతా ఎందుకంటే దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే దేవగౌడ వంటి సీనియర్ నేతల అవసరం ఉందట. ఇది ప్రాధమికంగా చర్చల దశలో ఉంది. కాంగ్రెస్ దేశంలో ప్రధాన ప్రతిపక్షం కాబట్టి వారితో కలిసి పనిచేస్తాం.


బీజేపీయేతర పార్టీల కూటమి ఏర్పాటులో బిజీ అయ్యారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. రాహుల్ గాంధీ సహా జాతీయ స్థాయి నేతల్ని ఇప్పటికే కలిసిన ఈ చంద్రబాబు, ఇప్పుడు దక్షిణాది ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టటంపై కూడా ఫోకస్ పెట్టారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు బెంగళూరు లో జేడీఎస్ నేత, మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమార స్వామితో సమావేశమయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయాలతో పాటూ బీజేపీయేతర పార్టీల కూటమి ఏర్పాటుపై చర్చించినట్లు తెలుస్తోంది.

ap-news-national-news-united-secularist-party-chan

సమావేశం తరవాత  మాట్లాడిన దేవె గౌడ, లౌకికవాద పార్టీలన్నీ ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకతాటి పైకి రావాలని పిలుపు నిచ్చారు. సెక్యులర్ పార్టీలను ఏకం చేసేందుకు నారా చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారని, ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించడానికి చేసే ఈ ప్రయత్నం సఫలమవుతుందని భావిస్తున్నానని అన్నారు.


బీజేపీ రాజ్యాంగబద్ద సంస్థల్ని నిర్వీర్యం చేస్తోందని, నాలుగేళ్లుగా అన్నిరంగాల్లో విఫలమయ్యిందని విమర్శించారు. నాలుగురాష్ట్రాల ఎన్నికల తర్వాత మరిన్ని పరిణామా లు జరుగుతాయని  త్వరలోనే భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామన్నారు దేవగౌడ.

ap-news-national-news-united-secularist-party-chan

దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే దేవగౌడ వంటి సీనియర్ నేతల అవసరం ఉందన్నారు బాబు. బీజేపీయేతర పార్టీలన్నీ కలిసి పనిచేస్తాయని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కలిసి ముందుకు సాగుతామన్నారు. కూటమి తరఫున ప్రధాని ఎవరన్నది అందరం కలిసి నిర్ణయిస్తామన్నారు. అభ్యర్థి ఎవరన్నది మాత్రం తర్వాత క్లారిటీ ఇస్తామన్నారు. ఆర్బీఐ, ఈడీ, ఐటీ, సీబీఐ వంటి సంస్థల్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు చంద్రబాబు.


ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, ప్రతిపక్షాలను నియంత్రించటానికి ఈడీని ప్రయోగిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌తో స్నేహంపై ప్రశ్నించగా, కాంగ్రెస్ దేశంలో ప్రధాన ప్రతిపక్షం కాబట్టి వారితో కలిసి పనిచేస్తామన్నారు చంద్రబాబు. కూటమి ప్రయత్నాలు ప్రాధమికదశలోనే ఉన్నాయని, త్వరలోనే మరికొందరు నేతల్ని కలవబోతున్నట్లు చెప్పారు. రేపు (శుక్రవారం) చెన్నై వెళ్లబోతున్నానని, అక్కడ డీఎంకే అధినేత స్టాలిన్‌తో సమావేశం కాబోతున్నట్లు బాబు తెలిపారు.

ap-news-national-news-united-secularist-party-chan

పై విషయాలపై చర్చిద్ధాం! ఎవరు సెక్యులరిష్టు. దెవేగౌడనా? కుమారస్వామినా? చంద్రబాబా? ముందు ఈ ముగ్గుర్ని చూద్ధాం. కులం గౌడ సామాజిక వర్గం ఒక్కళిగ.  ఆ కులం పేరుతో రాష్ట్రంలో ఎక్కడో సుడి ఉండి ఆయన కొడుకు కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. అదీ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ పటిమ లేని ఒక పప్పు నాయకత్వం వహించటం వలన. ఈ తండ్రి గౌడకు కొడుకు గౌడకు అంటే లింగాయత్ లతో అంతర్గత పోరాటం రగులుతూనే ఉంది.

 

ఇక ఏపికి వద్దాం. చంద్రబాబు నాయుడు సెక్యులరిస్టా? ఆయన కొడుకు లోకెష్ నాయుడు సెక్యులరిస్టా? వీళ్ళు సామాజికంగా కమ్మ ఉరఫ్ చౌదరి కులస్తులు. అమరావతి నగరాన్నే ఈ కులానికి దారాదత్తం చేసిన ఈ తండ్రి కొడుకులు రాష్ట్ర సంపదని కొల్లగొట్టేస్తుఉన్నారని ప్రతిపక్షం కోడై కూస్తుంది. రాష్ట్రంలో ఈ తండ్రి తనయులు పాలన వదిలేశారెప్పుడో? ధర్మ పోరాటం, న్యాయ పోరాటం అంటూ శాసనసభనే బహిరంగసభగా మార్చేసినా, వీళ్ళని ఆ రాష్ట్ర ప్రజలు కనీసం ప్రశ్నించటం లేదు. కాంట్రాక్టులు, ప్రకటనలు, ఇసుక, పదవులు, సినిమాలు, మీడియా, మాఫియా ఇంకా అనేకం, సారీ! సర్వం తన కులం వాళ్ళకే కట్టబెట్టిన వీళ్ళను సెక్యులరిస్టు అనటాన్ని ఈ దేశంలో ఎవరూ సాహసించరు కదా!

ap-news-national-news-united-secularist-party-chan
ఇంత గొప్ప సెక్యులరిస్టులు సెక్యులర్ పార్టీ లను ఏకం చేసేందుకు పూనుకుంటారట. ఒక్కసారి ఆఫ్ట్రాల్ ఆదాయపు పన్ను అధికారులు దాడి చెయ్యటంతో, పిచ్చెక్కి నోళ్ళ లాగా రోడ్దున పడి సెక్యులర్ పార్టీ లను ఏకం చేసే పనిలో పడ్దారు. ఇక వీళ్ళ రాష్ట్రాల్లో ప్రజలు ఖచ్చితంగా వీళ్ళ అధికారానికి తద్దినం పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నయని అంటున్నారు జనం. బై ది బై దెవేగౌడ ప్రధానిగా పార్లమెంటులో నిద్రపోతుండేవారు.
ap-news-national-news-united-secularist-party-chan
ఈ సందర్భంగా దెవేగౌడ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు ఇచ్చిన హామీలు అమలు చేసి తీరాలని దేవెగౌడ స్పష్టం చేశారు. బీజేపీ కుట్రపూరిత రాజకీయాల ను ప్రజలు క్రమేపీ అర్థం చేసుకుంటూ తిప్పికొట్టే ప్రయత్నాల్లో ఉన్నారని తెలిపారు. జాతీయ స్థాయిలో చంద్రబాబు మరోసారి చక్రం తిప్పడం ఖాయమన్నారు. 1996లోనూ దేశంలో నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయని, 2019 లోక్‌సభ ఎన్నికల అనంతరం కూడా ఇదే పునరావృత మవుతుందని కుమారస్వామి ఆశాభావం వ్యక్తంచేశారు. కర్ణాటకలో బీజేపీ ఎంతగా దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డా ప్రజలు దీటుగా తిప్పికొట్టారని.. దేశవ్యాప్తంగా ఆ పార్టీపై భ్రమలు తొలగిపోతున్నాయని చెప్పారు. అంతకుముందు తన నివాసా నికి వచ్చిన బాబును దేవెగౌడ ఇంటి బయటకువచ్చి మరీ సాదరంగా తోడ్కొనివెళ్లారు. ఆయనకు మైసూరుసంప్రదాయ తలపాగా తొడిగి ఘనంగా సన్మానించారు. మరోవైపు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం చెన్నైలో డీఎంకే అధినేత స్టాలిన్‌ తో భేటీ కానున్నారు. సాయంత్రం ఆరుగంటలకు ఈ సమావేశం జరుగుతుంది.
ap-news-national-news-united-secularist-party-chan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హత విధీ! అపర చాణక్యుడికిదేం గతి? ఆయన చివరి రోజులే ఈయనకు సంప్రాప్తమౌతున్నాయా?
చంద్రబాబుపై తలసాని చండ్ర నిప్పులు? బాబుపై సమర శంఖమేనా?
జయహో భారత్! కీలక పదవుల్లో భారతీయ అమెరికన్లు-ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నామినేషన్లు
యుద్దం జరగక పోయినా సరిహద్దుల్లో మన సైనికులు ప్రాణాలు ఎందుకు కోల్పోతున్నారు?
తగ్గిపోతున్న పురుషత్వం - సంతానోత్పత్తి తగ్గటానికి పురుషులే ప్రధాన కారణం
సామాన్యుని సణుగుడు: దొరవారూ! ఇది కరక్టేనా! మీకిది తగునా?
శాపగ్రస్త కర్ణుని చేతిలో ఆయుధాలు పనిచేయనట్లే - ఇక ఆయన చాణక్యం పనిచేయదట?
హర్షవర్ధన చౌదరి, గరుడ శివాజి పై - వైఎస్ జగన్  హత్యయత్నం కేసులో - విచారణ?
నేను రాజకీయాలు చేయటానికే వచ్చా! టిడిపికి ఎవరు ఎదురెళ్ళినా వారు మోడీ ఏజెంట్లే! తలసాని
షర్మిల పిర్యాదు తో నాకేం సంబంధం? చంద్రబాబు కౌంటర్
కప్పల తక్కెడ రాజకీయం కర్ణాటకలో....అలా మొదలైంది!
పవన్ కళ్యాన్ సంగతేంటి?
ఎడిటోరియల్: ఎన్టీఆర్ బయోపిక్ వసూళ్ల వైఫల్యం - ఎన్నికల్లో టిడిపి పరిస్థితికి సంకేతమా?
విజువల్లీ ఛాలెంజెడ్ పాత్రలో స్వీటీ అనుష్క మరో రాం చరణ్ కావాలనా?
వాళ్ళు నేరస్తులే-వాళ్ళకు బలహీన కేంద్రం కావాలి-ప్రధాని మోడీ
కేసీఆర్ చంద్రబాబుకు ఇచ్చే రిటర్న్-గిఫ్ట్ కార్యక్రమానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ నాంది ప్రస్థావన
కులసంఘాలు, స్నేహితుల పేరుతో చంద్రబాబుకు భారీ రిటన్-గిఫ్ట్! ఎన్నికలే ఆలస్యం
ప్రభాస్ - షర్మిల సంబంధంపై పిర్యాదు చేసిన షర్మిల - దీనిలో టిడిపి హస్తం ఉంది
జగన్ పై హత్యయత్నం నేపధ్యంలో ఉన్నది ఆయనేనా?
ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు సినిమాను బ‌య్య‌ర్ల‌కు "ఉచితం" గా ఇచ్చేస్తున్నారా?
About the author