డిసెంబర్‌ 11 ఈ డేట్‌ ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్‌ డేట్‌గా మారింది. దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎంతో మంది అభ్యర్థుల జాతకాలు వెల్లడయ్యే రోజు. తెలుగు రాష్ట్రమైన తెలంగాణతో పాటు రాజస్థాన్‌,మిజోరం, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘ‌డ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చెయ్యనున్నాయి. అదే టైమ్‌లో 2019లో జరిగే సాధారణ లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఫలితాలను 2019 ఎన్నికలకు సెమీఫైన‌ల్స్‌గా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు దేశ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తే తెలంగాణ ఎన్నికల ఫలితాలు మాత్రం పొరుగు తెలుగు రాష్ట్రమైన ఏపీ రాజకీయాలను ఓ రేంజులో ప్రభావితం చేస్తాయి అనడంలో సందేహం లేదు. తెలంగాణ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని, సీఎం కేసీఆర్‌ని గద్దె దింపేందుకు కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితి మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. 


కేసీఆర్‌ను గద్ది దింపేందుకు కాంగ్రెస్‌ పార్టీకి బద్ద శత్రువుగా పేరున్న తెలుగుదేశం సైతం చివరకు ఆ పార్టీతో జట్టు కట్టక తప్పలేదు. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేశాయి. నాలుగేళ్ల పాటు కలిసి కాపురం చేశాకా బీజేపీతో ఏర్పడిన తీవ్ర విభేదాల నేపథ్యంలో టీడీపీ బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. బీజేపీతో తెగతెంపులు చేసుకున్నప్పటి నుంచి టీడీపీ, బీజేపీ మధ్య‌ పచ్చగడ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. ఈ క్రమంలోనే కేసీఆర్‌ అటు మోడీకి దగ్గర అవుతుంటే... ఇటు చంద్రబాబు తెలంగాణలో కేసీఆర్‌ను ఢిల్లీలో మోడీని గద్ది దింపడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ సైతం పోటీ ఎలా ఉన్నా తెలంగాణలో మహాకూటమి కంటే కేసీఆర్‌కే ఇన్నర్‌గా సపోర్ట్‌ చేసే పరిస్థితి కూడా కనిపిస్తోంది. అదే టైమ్‌లో ఏపీలో చంద్రబాబును గద్దె దింపడమే టార్గెట్‌గా కూడా మోడీ అండ్‌ బీజేపీ నాయకులు చాప కింద నీరులా తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. 


ఏదేమైనా చంద్రబాబు ఇప్పుడు కేసీఆర్‌పై కత్తి కట్టినట్టు వ్యవహరిస్తుండడంతో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్‌ఎస్‌ గెలిచి కేసీఆర్‌ మరో సారి సీఎం అయితే 2019లో జరిగే ఏపీ ఎన్నికల్లో కేసీఆర్‌ ఇప్పుడు చంద్రబాబు తనను ఓడిచేందుకు ఎన్ని వ్యూహాలు పన్నుతున్నాడో రేపు కేసీఆర్‌ సైతం ఇక్కడ చంద్రబాబును ఓడించేందుకు అంతకు మించిన వ్యూహాలు పన్నుతారనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే కేసీఆర్‌, బీజేపీ చంద్రబాబుకు వ్యతిరేఖంగా ఒక్కటైనా ఆశ్చర్యపోనవసరం లేదు. చంద్రబాబు తెలంగాణలో కేసీఆర్‌కు వ్యతిరేఖంగా ఎలా మహాకూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్నారో అదే స్థాయిలో జాతీయ రాజకీయాల్లో మోడీకి చెక్‌ పెట్టేందుకు పలు ప్రాంతీయ పార్టీలను ఏకతాటి మీదకు తీసుకురావడంతో పాటు కాంగ్రెస్‌తో సైతం ఇప్పటికే చేతులు కలిపారు. రేపు ఏపీలో జరిగే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో సైతం ఆయన కాంగ్రెస్‌తోనే నడిచివెళ్లే ఛాన్సులు ఉన్నాయి.

Image result for modi chandrababu naidu

ఈ క్రమంలోనే ఇప్పుడు మోడీకి, చంద్రబాబు పెద్ద శత్రువుగా మారారు. తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి రాకపోతే మిగిలిన పార్టీల సంగతి ఎలా ఉన్నా కేసీఆర్‌, కేంద్రంలో మోడీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రధానంగా టీడీపీనే టార్గెట్‌ చేస్తాయని అనడంలో సందేహం లేదు. తెలంగాణలో టీడీపీని పూర్తిగా భూస్థాపితం చేసి ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీని ఓడించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తారనడంలో సందేహం లేదు. రాహుల్‌తో భేటీ అయ్యాక చంద్రబాబు దేశంలో ప్రజాస్వామ్య‌ పరిరక్షణ కోసం బీజేపీయేత‌ర‌ పక్షాలన్నిటిని ఏకం చేస్తామని... అందుకు అందరు కలిసి రావాలని చేసిన ప్రకటన సైతం ఇప్పుడు బీజేపీకి చంద్రబాబు మీద తీవ్రమైన మంటకు కారణం అయ్యింది. అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో మోడీని గద్దె దింపుతామని కూడా ఆయన చేసిన ప్రకటనతో ఇప్పుడు మోడీతో పాటు బీజేపీ జాతీయ నాయకత్వం సైతం చంద్రబాబును ఎలా అణచాలా అని వీలున్నన్ని ప్రయత్నాలు చేస్తోంది. 


ఈ క్రమంలోనే తెలంగాణలో అవసరమైతే తాను ఓడినా మహాకూటమి మాత్రం అధికారంలోకి రాకూడదని మరో సారి కేసీఆర్‌ గెలిచినా తమకు ఇబ్బంది లేదని బీజేపీ నేతలు సైతం తమ అంతర్గత సంభాషణలో అంగీకరిస్తున్నారు. ఏదేమైన తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి రాకపోతే మాత్రం ఈ ఎఫెక్ట్‌ ఏపీలో వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది అనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఏపీ టీడీపీ లీడర్లు సైతం ఇదే విషయంలో తీవ్రమైన అందోళన చెందుతున్నారు. ఏదేమైన డిసెంబర్‌ 11 కోసం టోటల్‌గా టీడీపీ నేతలందరూ టెన్షన్‌ టెన్షన్‌గానే వేట్‌ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: