తెలంగాణ లో వచ్చే నెలలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు.  అయితే కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పై గెలవడం కోసం టిటిడిపి, టీజేఎస్,సిపిఐ పార్టీలతో కలిసి మహా కూటమిగా ఏర్పడబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు సీట్ల సర్ధుబాటు విషయంలో తర్జన భర్జన జరుగుతూనే ఉంది. తెలంగాణలో మహాకూటమి కొనసాగుతుందని..సీట్ల సర్థుబాటు పై రేపు సాయంత్రం పూర్తి క్లారిటీ వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. 

పొత్తులపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని..ఆయా పార్టీలకు కావాల్సిన సీట్లు వాళ్లు అడిగారని..మాకు కూడా ముఖ్యమైనవి ఉంటాయని టీటీడీపికి 14, టీజేఎస్ కి 8, సిపిఐకి 3లేదా నాలు సీట్లు కేటాయిస్తామని అన్నారు.  మిగిలిన పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నాం. బిసిలకు గతంలో మాదిరిగానే సీట్లు కేటాయిస్తాం.  పొత్తు ల్లో పరస్పర సహకారం ఉంటుంది. 

కేసీఆర్ తో మాకు పోలిక లేదు. దేశ ప్రయోజనం కోసం చంద్రబాబు, రాహూల్ గాంధీని కలిశారు.  గతంలో కేసీఆర్ ని కలిసిన రోజులు కూడా ఉన్నాయి.  సెంటిమెంట్ ను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని కేసీఆర్ చూస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: