పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి హెచ్ఎన్. అనంత్‌కుమార్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతు చికిత్స తీసుకుంటున్నారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.  కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత అనంత్ కుమార్ ను ఊపిరితిత్తుల కేన్సర్ కబళించింది. వ్యాధికి చికిత్స నిమిత్తం ఆయన అమెరికాకు వెళ్లి వచ్చినా ఫలితం దక్కలేదు. న్యూయార్క్ లోని కేన్సర్ ఇనిస్టిట్యూట్ లో చికిత్సపొంది, గత నెల ఇండియాకు వచ్చిన ఆయన పరిస్థితి మరింతగా విషమించింది. 


ప్రస్తుతం ఆయన పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రిగా ఉన్నారు.  22 జనవరి 1959న బెంగళూరులో అనంత్ కుమార్ జన్మించారు. మైసూరు యూనివర్సిటీ నుంచి న్యాయశాఖలో పట్టా అందుకున్నారు. దక్షిణ బెంగళూరు లోక్ సభ స్థానం నుంచి 1996లో తొలిసారి ఎంపీగా గెలిచిన అనంత్‌కుమార్ వరుసగా ఆరుసార్లు ఎంపీగా గెలుపొంది రికార్డు సృష్టించారు.  పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి హెచ్ఎన్.

Image result for anantha kumar pass away

అనంత్‌కుమార్ మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం కర్ణాటక ప్రజలకు తీవ్ర ఆదేదన మిగిల్చిపోయిందని అన్నారు.  ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. కాగా, అనంత్ కుమార్‌ మృతిపట్ల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: