మొన్నటి వరకు తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైనా.. అసలు ఘట్టం నేటి నుంచి ప్రారంభం కానుంది.  నేడు ఎన్నికల నోటిఫికేషన్ గెజిట్ విడుదల కానుంది. మొత్తం 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనుండగా, ఎస్సీలకు 19, ఎస్టీలకు 12 నియోజకవర్గాలు రిజర్వ్ అయి ఉన్నాయి. నోటిఫికేషన్ విడుదలైన మరుక్షణం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఇందుకోసం రిటర్నింగ్ కార్యాలయాలను సిద్ధం చేశారు. కాగా, డిసెంబర్ 7న తెలంగాణలో ఎన్నికలు జరుగనున్నాయి.

Image result for తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్

ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యగా సీటీ పోలీసు కమిషనర్, అంజనీ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం నోటిఫికేషన్‌ జారీ అయిన మరుక్షణం నుంచే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. అభ్యర్ధుల నామినేషన్ల స్వీకరణకు 19 వరకు గడువు ఉంది. 20న పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 22 వరకు గడువు ఉంది. ఆపై డిసెంబర్ 5తో ప్రచారం ముగించాల్సి వుంటుంది. పోలింగ్ డిసెంబర్ 7వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరుగుతుంది. ఈ పోలింగ్ లో మొత్తం  2.73 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనుండగా, మొత్తం 32,791 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. 

Related image

13వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలుకు సిద్దమయ్యారు.  మరోవైపు నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమైనప్పటినుంచి నామినేషన్ల ఉపసంహరణ వరకు ఆయా ప్రాంతాల్లో 100 మీటర్ల దూరంలో ఎక్కడా కూడా ఐదుగురు కంటే ఎక్కువ మంది కలిసి తిరగరాదని హెచ్చరించారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు 54 వేల మంది రాష్ట్ర పోలీసు బలగాలతోపాటు 275 కంపెనీల సాయుధ పోలీసు బలగాలు భద్రతా ఏర్పాట్లలో పాలుపంచుకోనున్నాయి. ఎవరైనా ఆదేశాలను అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సీపీ హెచ్చరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: